అద్దంకి అనంతరామయ్య
Appearance
అద్దంకి అనంతరామయ్య, రామ్@శృతి.కామ్ అనే నవలను రాసి కినిగె ద్వారా విడుదల చేశాడు.
ఈ బుక్ తో ముందడుగు వేసిన కుర్ర రచయిత. హైదరాబాదులో ఎంటెక్ పూర్తి చేయగానే మహీంద్ర సత్యంలోసాఫ్ట్ వేర్ ఉద్యోగమొచ్చింది. 2010 లో సొంతంగా ఓ బ్లాగు సృష్టించి మనస్సులోని భావాలను అందులో కూర్చేవాడు.
చదివిన మిత్రులు నవల రాయమని ప్రోత్సహించటంతో, రామ్@శృతి.కామ్ అనే నవలను రాశాడు. బ్లాగులో కబుర్లు రాసే కుర్రాడు ఇప్పుడు కొత్త రచయితగా మారాడు.
వేగంగా అమ్ముడవుతున్న తెలుగు ఈ పుస్తకాలల్లో మొదటి మూడింటిలో స్థానం సంపాదించింది ఈ నవల. దానితో, రాసిన తొలి నవలతోనే విజయాన్ని అందిపుచ్చుకున్నాడు