Jump to content

అధ్యక్షుడు

వికీపీడియా నుండి
రాష్ట్రపతి కార్యాలయం

ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం నాయకుడిని అధ్యక్షుడు (President) అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం. అధ్యక్షత వహించు (presiding over) నుండి పుట్టిన పదం అధ్యక్షుడు. ఒక దేశానికి చెందిన అధ్యక్షుడిని రాజ్యాధ్యక్షుడు లేదా దేశాధ్యక్షుడు అని పిలుస్తారు. ఇతని తర్వాతి పదవిని ఉపాధ్యక్షుడు (Vice President) అంటారు.

రాష్టుతి భవన్, న్యూ డిల్లీ.

అధ్యక్ష ప్రజా ప్రభుత్వం (Presidential Government) లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహిస్తాడు. (ఈపద్ధతి ప్రకారం ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక, అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉంటారు. ఈ పద్ధతి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అమలలో ఉంది.)

ఒక సభకు అధ్యక్షత వహించిన వ్యక్తిని సభాపతి, అధ్యక్షుడు అని కూడా అంటారు. ఇలాంటి సభలు, సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి వెలువరించిన ఉపన్యాసాన్ని అధ్యక్ష ప్రసంగం లేదా అధ్యక్షోపన్యాసం (Presidential address) అంటారు.

అధ్యక్షుడు ఎంపిక

[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ కు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అతను ఎలక్టోరల్ కాలేజి చేత ఎన్నుకోబడతాడు. కంపెనీలకు అధ్యక్షులు ఉంటారు. వారు ఆ కంపెనీకి చెందిన స్వంత విభాగం వారిచే ఎన్నుకోబడతారు. కొన్ని కంపెనీలలో ఆ కంపెనీ కార్మికులు ఓటింగ్ పద్ధతి ద్వారా వారి యొక్క కంపెనీ ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు.

రాష్ట్రపతి

[మార్చు]

భారతదేశం అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు. ఇతను భారతదేశానికి ప్రథమ పౌరుడు. ఇతనిని పార్లమెంటు రెండు సభలలో ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]