అనంతపురం క్లాక్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతపురం క్లాక్ సెంటర్
అనంతపురం క్లాక్ టవర్ .jpg
అనంతపురం క్లాక్ టవర్
భౌగోళికాంశాలు50°50′12″N 4°21′6″E / 50.83667°N 4.35167°E / 50.83667; 4.35167
ప్రదేశంఅనంతపురం , ఆంధ్రప్రదేశ్ భారత దేశం
ఎత్తు47 అడుగులు
ప్రారంభ తేదీ1945
ప్రారంభమైన తేదీ15- ఆగష్టు 1947

చరిత్ర[మార్చు]

అనంతపురం క్లాక్ సెంటర్ అనంతపురం నగరంలోని ఒక చారిత్రిక ప్రదేశం. అనంతపురం అనగానే గుర్తుకు వచ్చేది టవర్ క్లాక్. దీనికి ఎంతో చరిత్ర వుంది . ఇది ఎందరో మహనీయుల త్యాగం ఫలితంగా 1947 ఆగస్టు 15 న నిర్మించబడినది. స్వాతంత్ర్యోద్యమ స్మారక చిహ్నమే ఈ గడియార స్తంభం. బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తుల బానిసత్వం నుంచి భారతీయుల విముక్తి పొందిన రోజున ఈ గడియర స్తంభాన్ని నిర్మించారు.

గడియార స్తంభం నిర్మాణం[మార్చు]

నాలుగు ముఖాలు కనిపిస్తున్నా అష్ట భుజాలతో 47 అడుగుల ఎత్తు ,15 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. 15 అడుగుల వెడల్పు 15వ తేదిని, అష్ట భుజాలు 8వ నెలను, 47అడుగుల ఎత్తు 1947వ సంవత్సరాన్ని స్పుర్తించేలా దీన్ని నిర్మించడం విశేషం .

ఇతర విషయాలు[మార్చు]

1945 లోనే కేబినేట్ మిషన్ భారత్ లో పర్యటించినపుడు అనంతపురంలో కూడా పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. 1945 లోనే జిల్లాల్లోని ప్రజలు దాదాపు రూ.30 వేలు వసూలు చేసారు. ఆ నిధులతొనే నిర్మించారు.అప్పటి జిల్లా కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైనది. టవర్ క్లాక్ కు రెండు శిలా ఫలకాలను ఏర్పటు చేశారు. ఒక దాంట్లొ ప్రారంభోత్సవ వివరాలు , మరో శిలాఫలకం పై విరళాలు అందజేసిన వారి పేర్లున్నాయి.[1]

మూలాలు[మార్చు]