అనంత్ నాగ్ (తమిళ నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంత్ నాగ్
నేరం చిత్రంలో అనంత్ నాగ్
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఊర్శిలా రాజ్

అనంత్ నాగ్ భారతీయ నటుడు. ప్రధానంగా తమిళ చిత్రాలలో చేసే ఆయన మలయాళ భాషా చిత్రాలలో కూడా నటించాడు. అల్ఫోన్స్ పుతరేన్ నేరం (2013) తమిళ వెర్షన్‌లో వచ్చిన చిత్రంతో ఆయన అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత, అమర కావీయం (2014), ప్రేమమ్‌లతో సహా పలు చిత్రాలలో నటించాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆయన చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించాడు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసాడు.

కెరీర్[మార్చు]

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన కళల పట్ల ఉన్న మక్కువతో రాజీవ్ మీనన్ నడుపుతున్న మైండ్‌స్క్రీన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ కోర్సును అభ్యసించడానికి దారితీసింది. ఆయన దినేష్ కుంబ్లే దగ్గర ఫోటోగ్రఫీ పాఠాలు అభ్యసించాడు. ఆ తరువాత ఆయన సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయడం కొనసాగించాడు. ఆ క్రమంలో దర్శకుడు అల్ఫోన్స్ పుతారెన్‌ను కలిశాడు. దీంతో నేరం (2013)లో ఆయనకు అతిధి పాత్ర దక్కింది. అలాగే ఆయన కథానాయకుడిగా నటించిన ఎన్న సొల్ల పొగరై, ఎన్న సొల్ల వారెన్నా, జై జక్కమా అనే వరుస లఘు చిత్రాల శ్రేణిలో నటించాడు.[1][2][3]

ఆ తర్వాత అమర కావ్యం (2014), ప్రేమమ్ (2015), వెట్రివేల్ (2016)లలో సహాయపాత్రలలో నటించిన[4][5] ఆయన జులై కాట్రిల్ (2019)తో కథానాయకుడుగా మారాడు.[6][7]

వ్యక్తిగతం[మార్చు]

ఆయన ఉర్శీలను 2017 జూన్ 30న వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సచిన్ అనే కుమారుడు 2018లో జన్మించాడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2013 నేరం మాణికం తమిళ వెర్షన్ మాత్రమే
2014 అమర కావ్యం బాలాజీ
2015 ప్రేమమ్ అరివళగన్ మలయాళ చిత్రం
2016 వెట్రివేల్ శరవణ
2019 జూలై కాట్రిల్ రాజీవ్
2020 తిరువాలర్ పంజంగం కార్తీక్
2021 మార బాల
2021 ఓరు కుడైకుల్ అయ్యా వైకుందర్
2022 కాఫీ విత్ కాదల్ అరవింద్
2022 కాలేజ్ రోడ్ అరుల్
2023 తలైకవాసముమ్ 4 నంబర్గలుమ్

మూలాలు[మార్చు]

  1. "Premam actor's next in Kollywood". behindwoods.com. 27 January 2016. Retrieved 1 July 2016.
  2. Soman, Deepa. "A 'simple' yet 'powerful' wedding". The Times of India. Retrieved 1 July 2016.
  3. Priya Sreekumar [@AnanthNag] (14 July 2015). "Ananth turns actor by accident" (Tweet) – via Twitter.
  4. "Vetrivel a Tale of Two Brothers".
  5. IANS (18 May 2013). "'Neram' - gem of Tamil cinema (Tamil Movie Review)". Business Standard. Retrieved 1 July 2016.
  6. "Anant Nag is July Kaatril's hero". August 2018.
  7. "Ananth Nag to debut as hero with July Kaatre".