Jump to content

అనగానివారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°02′50″N 80°42′40″E / 16.047299°N 80.711076°E / 16.047299; 80.711076
వికీపీడియా నుండి

అనగానివారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

అనగానివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అనగానివారిపాలెం is located in Andhra Pradesh
అనగానివారిపాలెం
అనగానివారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°02′50″N 80°42′40″E / 16.047299°N 80.711076°E / 16.047299; 80.711076
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522309
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ పాఠశాల భవనాన్ని, 2014, నవంబరు-5న, ఈ గ్రామస్తులైన, రేపల్లె నియోజకవర్గం శాసనసభ్యులైన శ్రీ అనగాని సత్యప్రసాద్ ప్రారంభించెదరు. మునుపటివరకు కీ.శే. శ్రీ నందనవనం జాలయ్య గారు తరువాత వారి కుమారులు కీ.శే. నందనవనం శేషగిరిరావు గారు స్వంత భూమిలో ఎయిడెడ్ పాఠశాలగా ఉన్న దీనిని ప్రభుత్వానికి అందజేశారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం నడింపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

అనగానివారిపాలెం గ్రామ దేవత అంకగుడారుగా పిలవబడుతుంది.ప్రతి సంవత్సరం ఈ దేవత కొలుపులు ఐదు రోజులు వైభవంగా నిర్వహించెదరు. అనగానివారి ఇంటి దేవతగా కూడా పిలవబడుతొంది.

శ్రీ నాగరాజ సమేత భవానీశంకర స్వామి దేవాలయం

[మార్చు]

పురాతనకాలం అనగా దాదాపు 500 సంవత్సరాల క్రితం నాటి రంగాపురమనే అగ్రహారంగా పిలవబడిన అగ్రహారం కాలగతిలో మరుగునపడి పోయిన తరువాత ప్రస్తుత ఈ గ్రామంగా బయటపడినది అని అక్కడి ప్రజలు అంటుంటారు. దానికి గుర్తుగా ఇప్పటికి దాదాపు 50సంవత్సరాల క్రితం అనగా రమారమి 1975 కాలంలో అప్పటి మాన్యశ్రీ అనగాని భగవంతరావు గారి హయాంలో, స్వయంగా తానే భక్తులకు కనిపించి వినిపించి వెలికివచ్చిన శ్రీ నాగరాజ సమేత భవానీశంకర స్వామి వారి దేవాలయంలోని స్వయంభు శివలింగం వాయు ప్రతిష్ఠితలింగంగా ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. పూర్వ ప్రాచీన శివలింగం, ఏకవీరాలయానికి అప్పటి గ్రామ వాస్తవ్యులు నందనవనం శేషగిరిరావు (సం. 2000లో పరమపదించారు) దేవాలయ నివేదనాది పోషణ, అనగాని భాస్కరరావుగారు స్థలదానం ఇచ్చి విశేష సేవ చేశారు. వారి జ్ఞాపకార్ధం వారి పేర్లు దేవాలయ శిలాఫలకంపై చెక్కబడివున్నాయి.ఇటీవలి కాలంలో ఈ ఆలయం పునరుద్ధరించబడింది. ఆ స్వయంభు శివలింగ స్థానే మానవ ప్రతిష్ఠిత శివలింగం ఇప్పుడు పూజలందుకుంటుంది.

ప్రస్తుతము

ప్రథమంగా స్వామి వెలిసిన తరువాత దాదాపు 20 సంవత్సరాలు కేవలము స్లాబ్ వేసిన ఏకవీరాలయములో పూజలందుకున్న భవానిశంకర స్వామి తరువాతి కాలంలో కీ.శే. శ్రీ యఱ్ఱాప్రగడ వెంకట సుబ్బారావు గారు వారి ధర్మపత్ని సీతారామమ్మ గార్లు స్వామివారి దీక్షతో సమస్యలతో వచ్చిన భక్తుల ప్రశ్నలకు సమాధానం, పరిష్కారములు చూపుతూ చేసిన నిర్విరామ కృషితో పునర్వైభవానికి, కొన్ని భవన నిర్మాణాలకి, శ్రీ వరసిద్ది వినాయక, భవానీ దెవి వార్ల ప్రతిష్ఠకి పునాదిరాళ్లు వేశి అభివృద్ధి చేశారు. తరువాతి కాలంలో ప్రస్తుతమున్న రెండవసారి నవీకరించిన చదునయిన పాలరాతి నేలతో ప్రహారీలు,ధ్వజస్తంభం, నవగ్రహ మండపం, ఆంజనేయ, పూర్వ వరసిద్ది వినాయక, భవానీదేవి మూలవిరాట్టులు కొలువుతీరి ఉన్నారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  1. అనగాని భగవంతరావు
  2. ప్రస్తుత రేపల్లె నియోజకవర్గం శాసనసభ్యులైన అనగాని సత్యప్రసాద్ ఈ గ్రామస్థులే.
  3. పద్మశ్రీ డాక్టర్ అనగాని మంజుల:- వీరు రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ సోదరి. వీరు హైదరాబాదులో గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. సన్ షైన్ సూపెర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూట్ డైరెక్టరుగా ఉన్నారు. వీరు ఉన్నత పాఠశాల, కళాశాల విద్యలో కూడా విద్యార్థిప్రతినిధిగా పనిచేసారు. ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైద్య పట్టా పొందినారు. అధునాతన లాప్రోస్కోపిక్, హిస్తాస్కోపిక్ విద్య విధానంలో నిపుణురాలు. ఇప్పటి వరకు ఆమె పదివేల వరకూ లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేసారు. దాదాపు 500 మంది వైద్యులకు ఈ శస్త్ర చికిత్సలో శిక్షణ నిచ్చారు. ఈమె పలు సామాజిక సేవలు గూడా చేపట్టినారు. చిన్నారులకు, కిశోర బాలబాలికలకు, ఎయిడ్స్, పోలియో, ఇతర స్త్రీ సంబంధిత వ్యాధులపట్ల అవగాహన సదస్సులు, ఉచిత వైద్య సేవలు అందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు ఈమె ఆహ్వానం పొందుచున్నారు. హైదరాబాదులోని కేర్, యశోద, బీమ్స్ ఆసుపత్రులలో పనిచేసారు. ఎన్.టీ.ఆర్. వైద్య విశ్వవిద్యాలయంలో గౌరవ అచార్యులుగా పనిచేసారు. ఎం.ఎం.సి.ఆసుపత్రులను సందర్శించారు. ఈమె పలు వైఙానిక పత్రాలను సమర్పించారు. వివిధ రకాలుగా అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఈమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

మూలాలు

[మార్చు]