Jump to content

అనలిటికల్ ఇంజన్

వికీపీడియా నుండి
బాబేజ్ రూపొందించిన అనలిటికల్ ఇంజన్, 1834-1871. (9660574685)

అనలిటికల్ ఇంజన్ లేదా వైశ్లేషిక యంత్రం ఆంగ్ల గణిత శాస్త్రవేత్త, గణనయంత్ర దార్శనికుడు అయిన ఛార్లెస్ బాబేజ్ సాధారణ అవసరాలకు కోసం రూపకల్పన చేసిన డిజిటల్ మెకానికల్ కంప్యూటరు. దీనిని బాబేజ్ మొదటిసారిగా 1837లో అంతకుముందే తాను ప్రతిపాదించిన సరళ గణన యంత్రం, డిఫరెన్స్ ఇంజన్ కి కొనసాగింపుగా రూపొందించాడు.[1][2] ఇది ఒక మెకానికల్ కంప్యూటర్. ఇది లెక్కల కోసం గేర్లు, షాఫ్టులు మీద ఆధార పడుతుంది. బడ్జెట్ పరిమితుల వలన ఈ యంత్రం పూర్తి కానప్పటికీ దీని నమూనా మాత్రం చారిత్రక ప్రాధాన్యం కలిగిఉంది. తర్వాతి తరంలో నిర్మించిన కంప్యూటర్లకు ఇది ఒక పునాదిగా నిలిచింది. దీనికి మూలమైన డిఫరెన్స్ ఇంజిన్ నిర్దిష్ట లెక్కల కోసం రూపొందించబడింది. కానీ విశ్లేషణాత్మక యంత్రాన్ని మాత్రం సూచనలను అనుసరించడం ద్వారా ఏ గణిత ప్రక్రియనైనా పూర్తి చేయగలదు. ఈ లక్షణమే దీనిని సాధారణ-ప్రయోజన యంత్రంగా మార్చింది.

ఈ అనలిటికల్ ఇంజన్ లో అరిథమెటిక్ లాజిక్ యూనిట్, కండీషనల్ బ్రాంచింగ్, లూప్స్ ద్వారా కంట్రోల్ ఫ్లో, ఇంటిగ్రేటెడ్ మెమరీ మొదలైనవి ఉన్నాయి. అందుకనే దీన్ని ట్యూరింగ్ కంప్లీట్ నియమాలను అనుసరించి సాధారణ కంప్యూటరు యొక్క మొదటి రూపకల్పనగా పేర్కొంటారు.[3][4]

రూపకల్పన

[మార్చు]

ఒక మెకానికల్ కంప్యూటరును రూపొందించాలనుకున్న బాబేజికి వచ్చిన మొదటి ఆలోచన డిఫరెన్స్ ఇంజన్. ఇది నియత వ్యత్యాసాలను (Finite differences) కనుక్కోవడం ద్వారా లాగరిథమ్స్, త్రికోణమితీయ ప్రమేయాలను గణించడానికి రూపొందించిన ప్రత్యేక యంత్రం. ఈ యంత్ర పూర్తి నిర్మాణానికి నోచుకోలేదు. బాబేజి తన ముఖ్య ఇంజనీరు అయిన జోసెఫ్ క్లెమెంట్ తో విబేధించడం వలన బ్రిటిష్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు నిలిపివేసింది.[5][6][7]

విభాగాలు

[మార్చు]

అరిథమెటిక్ లాజిక్ యూనిట్ కూడికలు, తీసివేతలు, గుణకారాలు నిర్వహిస్తుంది. స్టోర్ లేదా మెమరీ లెక్కల ఫలితాలను భద్రపరుస్తుంది. రీడర్ అనేది పంచ్ కార్డ్స్ ద్వారా ఆదేశాలను, డేటాను యంత్రానికి అందిస్తుంది. ఇది మొదటి తరం కంప్యూటర్లలో వాడిన పంచ్ కార్డులకు సమానమైంది. ప్రింటర్ చివరి ఫలితాలను వెలివరుస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Graham-Cumming, John (4 October 2010). "The 100-year leap". O'Reilly Radar. Retrieved 1 August 2012.
  2. "The Babbage Engine: The Engines". Computer History Museum. 2016. Retrieved 7 May 2016.
  3. "Babbage". Online stuff. Science Museum. 19 January 2007. Archived from the original on 7 ఆగస్టు 2012. Retrieved 1 August 2012.
  4. "Let's build Babbage's ultimate mechanical computer". opinion. New Scientist. 23 December 2010. Retrieved 1 August 2012.
  5. Collier 1970, p. chapter 3.
  6. Lee, John A.n (1995). International Biographical Dictionary of Computer Pioneers. Taylor & Francis. ISBN 9781884964473. Retrieved 1 August 2012.
  7. Balchin, Jon (2003). Science: 100 Scientists Who Changed the World. Enchanted Lion Books. p. 105. ISBN 9781592700172. Retrieved 1 August 2012.