అనశ్వర రాజన్
అనశ్వర రాజన్ | |
---|---|
జననం | కరివెల్లూర్, కేరళ, భారతదేశం | 2002 సెప్టెంబరు 8
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | యారియన్ 2 |
అనశ్వర రాజన్ (జననం 2002 సెప్టెంబరు 8) ప్రధానంగా మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె మొదటి చలన చిత్రం ఉదాహరణం సుజాత (2017).[1] ఆమె నటించిన తన్నీర్ మథన్ దినంగల్ (2019), సూపర్ శరణ్య (2022) చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమైయ్యాయి.
ప్రారంభ జీవితం
[మార్చు]ఆమె 2002 సెప్టెంబరు 8న కరివెల్లూరుకు చెందిన రాజన్, ఉష దంపతులకు జన్మించింది.[2][3] ఆమె పయ్యనూరులోని సెయింట్ మేరీస్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంది.[4]
కెరీర్
[మార్చు]అనశ్వర రాజన్ ఉదాహరణం సుజాత (2017) లో అతిరా కృష్ణన్ పాత్రలో నటించింది. ఆ తరువాత, ఆమె ప్రధాన పాత్రను తన్నీర్ మథన్ దినంగల్ (2019) చిత్రంలో పోషించింది. ఇది ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆమె సూపర్ శరణ్య (2022) లో టైటిల్ రోల్ పోషించింది. ఇది కూడా విజయవంతమైన చిత్రమే.[5][6]
ఆమె త్రిష నటించిన రాంగి (2022) తో తమిళ చిత్రసీమలోకి ప్రవేశించింది.[7] యారియాన్ 2 (2023) తో ఆమె హిందీలో అరంగేట్రం చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "Anaswara Rajan: I haven't enjoyed any movie set like 'Thanneermathan Dinangal'". The Times of India. 20 July 2019.
- ↑ "Anaswara Rajan turns 18". The Times of India. 8 September 2020.
- ↑ "ഇനി എല്ലാ കാര്യങ്ങളും നിയമപരമായി ചെയ്യാം! മധുര പതിനെട്ടിന്റെ സന്തോഷം പങ്കുവെച്ച് അനശ്വര". Samayam (in మలయాళం). The Times of India. 8 September 2020. Retrieved 19 August 2022.
- ↑ "Dreaming of a chance to act with Dulquer, says Anaswara". English Archives (in ఇంగ్లీష్).
- ↑ "Glimpses 2019: From 'Lucifer' to 'Virus', 5 finest Malayalam movies of the year". The Week (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
- ↑ "Change in movie goers' taste confuses all in Malayalam film industry". The New Indian Express. Retrieved 2023-08-20.
- ↑ "Anaswara Rajan to Make Tamil Debut With 'Raangi'". India Abroad. Archived from the original on 12 October 2020. Retrieved 11 February 2020.