Jump to content

అనాది అనంతం

వికీపీడియా నుండి
అనాది అనంతం
కృతికర్త: అద్య రంగాచార్య
అసలు పేరు (తెలుగులో లేకపోతే): అనాది అనంత
అనువాదకులు: కె.సుబ్బరామప్ప
దేశం: భారతదేశం
భాష: తెలుగు(మూలగ్రంథం:కన్నడ)
ప్రక్రియ: నవల
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
విడుదల: 1978 (తెలుగు అనువాదం)
1959(కన్నడ మూలం)
పేజీలు: 228

అనాది అనంతం పుస్తకం ప్రముఖ కన్నడ రచయిత అద్య రంగాచార్య రచించిన కన్నడ నవలకు తెలుగు అనువాదం.

రచన నేపథ్యం

[మార్చు]

అనాది అనంతం నవలకు అద్య రంగాచార్య కన్నడ నవల అనాది అనంత మూల గ్రంథం. 1959లో రచించిన అనాది అనంత అద్య రంగాచార్య 8వ నవల. ఈ నవలను కె.సుబ్బరామప్ప తెలుగులోకి అనువదించగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. తెలుగు అనువాదం తొలి ముద్రణ 1978లో జరుగగా, 1990లో రెండవ ముద్రణ పొందింది.

రచయిత గురించి

[మార్చు]

అద్య రంగాచార్య కన్నడ భాషలో ప్రముఖ సాహిత్యవేత్త. రంగాచార్య శ్రీరంగ కలంపేరుతో రచనలు చేసారు. కన్నడ నాటక సాహిత్య వికాసంలో రంగాచార్యది ప్రముఖ పాత్ర. విశ్వామిత్ర సృష్టి, పురుషార్థ, విషచక్ర వూహ, అనాది అనంత తదితర నవలలు నవలాసాహిత్యంలో కూడా ఆయనకు పేరు సంపాదించిపెట్టాయి.[1]

ఇతివృత్తం

[మార్చు]

ఈ నవల అనాది అనే మొదటిభాగం, అనంతం అనే రెండవభాగాల సమాహారం. అనాదిలో రామన్న-సరళ దంపతుల జీవితంలో సరళ అనారోగ్యంతో ఏర్పడే కల్లోలం, ఆ సమయంలోనే సరళ చెల్లెలు కుముద సరళ ఇంటికి రావడం, రామన్నతో కుముదకు సంబంధం ఏర్పడడం, ఆ విషయం తెలియని అమాయిక సరళ వారిద్దరి వివాహాన్ని సూచిస్తూ మరణించడం, ఆపై వారి వివాహంతో ముగుస్తుంది. అనంతం రామన్న-కుముదల నడుమ స్పర్థతో ప్రారంభమవుతుంది. తన శారీరిక సంబంధాన్ని కాంక్షించడమే తప్ప రామన్న తనను ప్రేమించడం లేదన్న భావన కుముదకు, రామన్నకు నడుమ అగాధం కలిగించింది. ఆ స్పర్థ ఏ రూపం తీసుకుంటుందనేది కథకు ముగింపు.[2]

మూలాలు

[మార్చు]
  1. అనాది అనంతం నవలకు ఎల్.ఎస్.శేషగిరిరావు పీఠిక
  2. అనాది అనంతం:మూ.అద్య రంగాచార్య, అ. కె.సుబ్బరామప్ప:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురణ

డి.ఎల్.ఐలో అనాది అనంతం పుస్తక ప్రతి