అనావల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనావల్ - ఇది గుజరాతు దేశమున నివసించు బ్రాహ్మణుల తెగలలో నొకదానికి పేరు. వీరికి దేసాయీ లనియు, మస్తాను లనియు మరిరెండు పేర్లు ఉన్నాయి. దక్షిణ గుజరాతు దేశపు టాదిమ నివాసులు వీరు. బరోడా రాజ్యము లోని నవసరీ జిల్లాయందు గల అనావల్ అను గ్రామం పేరును బట్టి వీరి కీపేరు వచ్చింది.

ఈ యనావలులను గూర్చి యొక చిన్నకథ కలదు: రావణవధ యైపోయిన తరువాత శ్రీరాము డయోధ్యకు మరలి వచ్చుచు దారిలో అగస్త్యాశ్రమమునకు బోవలయు నని వింధ్యపర్వత ప్రాంతమున దిగెను. ఆయన అచ్చట రావణవధచే కలిగిన పాపమును బోగొట్టుకొనుటకై ప్రాయశ్చిత్త మొనరించుకొన దలచెను. కాని యచ్చట బ్రాహ్మను లెవ్వరును లేరు. అందరు భిల్లులే. అందుచే హిమాలయ ప్రాంతమున నుండి బ్రాహ్మణులను రప్పించెను. వారు రాము డిచ్చిన దక్షిణ గొనకపోవుటచే వైశ్యధర్మ మనుష్ఠించుచు నుందురుగాక యని వారి నతడు శపించెను. ఆ బ్రాహ్మణుల సంతరివారే యీ యనావలులు.

ఇది మరియొక చిన్నమార్పుతోగూడ ఒక్కొక్కచో వ్యాప్తిలో నున్నది: వింధ్యపర్వత ప్రాంతమున బ్రాహ్మణు లెవ్వరును లేకుంటచే శ్రీరాము డచ్చటి భిల్లులనే విప్రులుగ జేసే ననియు, అయినను వారికి సంపూర్ణమగు బ్రాహ్మణత్వ మబ్బకపోయిన దనియు నీమార్పు.

బరోడాలోని నవసరీ ప్రాంతమున వీరు విశేషముగ గలరు. మొత్తము మీద బరోడాలో వీరి జనసంఖ్య ---- . వీరిలో దేసాయీలు, భధేలులు అను రెండు తెగల వారున్నారు. దేసాయీలు ఉత్తములు. ఈ రెండు తెగలవారికిని చుట్టరికము కలియదు.

"https://te.wikipedia.org/w/index.php?title=అనావల్&oldid=2892253" నుండి వెలికితీశారు