అనుపమ (తెలుగు టైపింగ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్స్క్రిప్ట్ తెలుగు కీబోర్డ్ - ప్రతీకాత్మక చిత్రం

అనుపమ తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్. 24 గంటల్లో, ఇన్‌స్క్రిప్టు కీబోర్డు లేఅవుట్లో, కంప్యూటర్లో తెలుగు టైపింగ్ నేర్పుతుంది.[1]

ఆవశ్యకత[మార్చు]

ఆంగ్ల భాషతో పోలిస్తే తెలుగు భాషలో అక్షరాల సంఖ్య ఎక్కువగా ఉండడం, తెలుగులో ద్విత్వక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉండడం ద్వారా తెలుగు క్లిష్టమైనదనే భావన వల్ల తెలుగు టైపింగ్ నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదనే మాట సత్యదూరం కాదు. తెలుగును ఆంగ్ల భాషలో రాయడంలోనూ, ఫొనెటిక్ కీబోర్డు లేఅవుట్ ను ఉపయోగించడంలోనూ, ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ నుపయోగించి రాయడంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తెలుగును ఆంగ్ల అక్షరాలతో రాస్తున్నామనే భావన మొదటి ఇబ్బంది అయితే, ఎక్కువకీ ప్రెస్సులు అవసరం కావడం మరో ఇబ్బంది. ఈ పరిస్థితుల్లో కంప్యూటర్లలోనే తెలుగు టైపింగ్ను సులువుగా నేర్పే సాప్ట్ వేర్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉదాహరణకు, కంప్యూటర్లో తెలుగు టైపింగ్ చేయడం వస్తే, ప్రభుత్వ అధికారులు అధికార భాషగా తెలుగును అమలు చేయవచ్చును. అధికారులకు తెలుగు టైపింగ్ రాకపోవడం ద్వారా, తెలుగు అధికారభాషగా విస్తృతమైన అమలుకు నోచుకోలేక పోయింది. విలేకరులు తమ వార్తలను క్షణాల్లో చేరవేయవచ్చును. రచయితలు తమ రచనలకు కొత్తమెరుగులు దిద్దుకోవచ్చును. ఇంటర్నెట్లో తెలుగులోనే మెస్సేజింగ్, చాటింగ్ చేయవచ్చును. తెలుగులో ఈ-మెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుకోవచ్చును. తెలుగు వెబ్ సైట్లు రూపొందించవచ్చును, తెలుగులో సులువుగా బ్లాగ్ లు రాయవచ్చును. ఒకటేంటి కంప్యూటర్లో ఏపనైనా తెలుగులోనే చేసుకోవచ్చును.

ఈ దిశగా వచ్చిన ఒక ఉపకరణం అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్. ఇది తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్. రెండు సంవత్సరాల కృషితో రూపొందించిన ఇంతటి అందమైన, ఉపయోగకరమైన టైపింగ్ ట్యూటర్ ఆంగ్ల భాషతో సహా మరే ఇతర భారతీయ భాషలకు కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో.

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ లో తెలుగు టైపింగ్ నేర్పడంతోబాటు తెలుగు భాషపైన కూడా మంచి పట్టువచ్చేలా చేయడానికి కొన్ని వందల జాతీయాలను, నానుడులను, సామెతలను, తెలుగు పద్యాలను, సాధారణంగా తప్పులు దొర్లే పదాల (సాధారణ దోషాలు) ను టైపింగ్ సాధన పాఠాలుగా ఇవ్యడం జరిగింది. ఇవి తెలుగు టైపింగ్ నేర్చుకోవడంతోబాటు తెలుగు భాషపైనకూడా మంచి పట్టు సాదించడానికి ఉవయోగపడతాయి. అనుపమతో తెలుగు టైపింగ్ నేర్చుకోవడంద్వారా, మరే ఇతర ప్రత్యేక తెలుగు సాప్ట్‌వేర్ అవసరం లేకుండానే కంప్యూటర్లో ఏ పనైనా తెలుగులో చేయగలుగుతాము. అనుపమ కంప్యూటర్లో తెలుగు టైపింగ్ ను సులువుగా నేర్పే తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్ సాప్ట్ వేర్. అనుపమ, ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ లో తెలుగు టైపింగ్ ను నేర్పుతుంది. ఇది భారతప్రభుత్వం కంప్యూటర్లలో భారతీయభాషల టైపింగ్ కు ఆమోదించిన కీబోర్డు లేఅవుట్ (ఇండియన్ స్క్రిప్ట్ కు సంక్షిప్త రూపము.)

ఉపయోగించే విధానం[మార్చు]

తెలుగును ఆంగ్లఅక్షరాలనుపయోగించి రాస్తే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చూద్దాము.

"తేనె ఎంత మధురమో తెలుగు అంత మధురమే" ఈ వాక్యాన్ని ఆంగ్ల అక్షరాలలో రాస్తే,

"TENE ENTA MADURAMO TELUGU ANTA MADURAME"

పై ఆంగ్ల లిపిలో రాసిన వాక్యాన్ని ఇప్పుడు చదువమంటే ఎలా ఉంటుందంటే,

"టెనె ఎంట మడురమొ టెలుగు అంట మడురమె"

అందమైన అక్షరాల తెలుగును ఆంగ్ల అక్షరాలలో రాయకుండా తెలుగులోనే రాసేటట్లు నేర్పేది అనుపమ.

ఇన్ స్క్రిప్ట్ ( ఇండియన్ స్క్రిప్ట్ ) కీబోర్డు లేఅవుట్ ను 1986 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ( DOE ) భారత ప్రభుత్వము వారు కంప్యూటర్లలో బ్రాహ్మీ లిపి ఆధారిత లిపులను ( తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము, ఒరియా, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, గురుముఖి (పంజాబీ), దేవనగరి (హిందీ, మరాఠీ, సంస్కృతం) ), కలిగిన భారతీయ భాషలలో రాయడానికి ఒక స్టాండర్డ్ కీబోర్డు లేఅవుట్ గా నిర్ణయించారు. అందుకే బ్రహ్మీ లిపి ఆధారిత లిపులను కలిగిన భారతీయ భాషలలో, కంప్యూటర్లో రాయడాన్ని అతిసులభంగా నేర్చుకోవడానికి, అధిక వేగంతో రాయడానికి అనుగుణమైన కీబోర్డులేఅవుట్ ఈ ఇన్ స్క్రిప్ట్ ఒక్కటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

“తెలుగు టైపింగ్ క్లిష్టమైనది”అనే భావననూ వదిలించుకొని, ఇంపైన ఇన్ స్క్రిప్ట్ ను అలవర్చుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడే ఆంగ్లభాషలో ఎంత వేగంగా రాయగలమో అంతకన్నా వేగంగా తెలుగులో రాయగలుగుతాము. మన ఆలోచనల వేగంతో రాయగలిగే అవకాశం ఉంటే అంతకన్నా కావల్సిందేముంది. మన ఆలోచనలకు అంతరాయం లేని వేగం ఇన్ స్క్రిప్ట్ తోనే సాధ్యం. ఇంత చక్కని ఇన్ స్క్రిప్ట్ ఉండగా, ఇంకాతెలుగుకు ఆంగ్లలిపి అవసరంలేదు.

అచ్చులు, వాటి గుణింతాలను కీబోర్డులో ఎడమవైపున, హల్లులను కీబోర్డులో కుడివైపున, మధ్యవరుసలో మన మాటల వెల్లువలో అధికంగా విన్పించే అక్షరాలను అమర్చి, వాటి ఒత్తక్షరాలను వాటిపైనే, పైవరుసలోనే అమర్చి, రాసేటప్పుడు అధిక వేగాన్ని సాధించడానికి అనుగుణంగా ఈ ఇన్ స్క్రిప్ట్ ను రూపొందించారు. కుడివైపునగల హల్లులపై వచ్చే గుణింతాలు ఎడమవైపున ఉండడం, హల్లుల ద్విత్వ, సంయుక్తాక్షరాల్లో అంతర్లీణంగా వచ్చే పొల్లుకూడా ఎడమవైపున మధ్య వరుసలో ఉండడంద్వారా, రాసేటప్పుడు సవ్యసాచిలా రెండుచేతులనుపయోగించి అతి సులభంగా అధిక వేగాన్ని సాధించగలిగే అవకాశం ఈ ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ లోనే ఉంది. ఒకింత సాదన తర్వాత నిమిషానికి 40 నుండి 60 పదముల వేగంతో అతిసులువుగా రాయగలుగుతాము.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-01-16. Retrieved 2017-12-05.

ఇతర లింకులు[మార్చు]