అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు
అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు ఒక మంచి కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.
ఈ కీర్తనను వాచస్పతి జన్యమైన సరస్వతి రాగం, రూపక తాళంలో గానం చేస్తారు.[1]
వివరణ
[మార్చు]మనిషి మాత్రం బుద్ధి చేత గొప్పవాడు. ఏది మంచో, ఏది చెడో ఆ తారతమ్యాన్ని బాగా తెలిసికోగల వివేకం వున్నా అధమ స్థానంలోకి జారిపోతే మాత్రం ఎవరు రక్షిస్తారు? అందుకే ‘అనురాగము లేని మనసుకు సుజ్ఞానం రాదు.’
సగుణ ధ్యానం ఎప్పటికైనా నిర్గుణ ధ్యానం వైపునకు లాక్కెళ్లుతుందంటాడు త్యాగయ్య.[2]
రాగము అంటే కోరిక. అనురాగము అంటే ప్రేమతో కూడిన కోరిక. మరి భగవంతున్ని తేలుసుకోనేందుకు ,సామాన్యంగా ఇది ప్రతి బందకము. కాని సాధనలో 2 రకాలు సగుణోపాసన,నిర్గుణోపాసన, నిర్గుణోపాసనలో అనురాగము ప్రతిబందకం. కాని సగుణోపాసనలో మన ఆరాధ్యమూర్తి పై అనురాగము వల్ల మన మనసులో లేదా అంతరంగంలో మంచి జ్ఞానము లేదా ఎరుక కలుగుతుంది. [3]
కీర్తన
[మార్చు]- పల్లవి
అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు ॥ అనురాగము ॥
- అనుపల్లవి
ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకేగాని ॥ అనురాగము ॥
- చరణము
వగవగగా భుజియించువారికి తృప్తియౌరీతి సగుణధ్యానముపైని సౌఖ్యము త్యాగరాజనుత ॥ అనురాగము ॥
భారతీయ సంస్కృతి
[మార్చు]- ఈ కీర్తనను సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నేర్చుకొని గానం చేయడం విశేషం.[4]
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్లో అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు పూర్తి కీర్తన.
మూలాలు
[మార్చు]- ↑ కర్ణాటిక్ సైట్ లో అనురాగము లేని కీర్తన సాహిత్యం.
- ↑ "అనురాగము లేని మనసున.. సుజ్ఞానము రాదు (అమృతవర్షణి) | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-08-26.
- ↑ srividhyananadanatha (2016-12-28). "అనురాగము లేని మనసు". Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam (in ఇంగ్లీష్). Retrieved 2020-08-26.
- ↑ యూ ట్యూబ్ లో సింగపూర్ విద్యార్ధులు గానం చేసిన అనురాగము లేని కీర్తన.