Jump to content

మూత్రం నియంత్రణలేమి

వికీపీడియా నుండి
(అనైచ్ఛిక మూత్రవిసర్జన నుండి దారిమార్పు చెందింది)
మూత్ర నియంత్రణ లేమి
ఇతర పేర్లుఅనైచ్ఛిక మూత్రవిసర్జన
వీడియోతో వివరణ
ప్రత్యేకతయూరాలజీ, గైనకాలజీ
సంక్లిష్టతలుమూత్ర నాళాల అంటువ్యాధులు, ఒత్తిడి వలన పూత, పుండ్లు, నిరాశ ఇంకా మందుల నుండి దుష్ప్రభావాలు
సాధారణ ప్రారంభంచిన్న పిల్లలలో, వృద్ధులలో, ఇతర వ్యాధులలో
ప్రమాద కారకములుమూత్ర నాళాల అంటువ్యాధులు, ఒత్తిడి వలన పూత, పుండ్లు, నిరాశ ఇంకా మందుల నుండి దుష్ప్రభావాలు
చికిత్సకటి కండరాల శిక్షణ, మూత్రాశయం శిక్షణ, బరువు తగ్గడం, ధూమపానం ఆపడం, విద్యుత్ ప్రేరణ, మందులు, శస్త్రచికిత్స ఉండవచ్చు.
తరుచుదనముస్త్రీలలో సాధారణం

మూత్రం ఆపుకొనలేని (UI) శరీర పరిస్థితి. దీనిని అనైచ్ఛిక మూత్రవిసర్జన అని కూడా అంటారు, దీని వలన మూత్రం నియంత్రణ లేకుండా కారుతుంటుంది . ఇది ఒక వ్యాధి కాదు కానీ ఒక లక్షణం . దీనిని యూరినరీ ఇంకాంటినెన్స్ అని తరచుగా చెపుతారు. రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు చిన్న పిల్లలో సంభవించే అసంకల్పిత మూత్ర విసర్జనని ఎన్యూరెసిస్ (బెడ్ వెట్టింగ్) అని పిలుస్తారు.[1] పెద్ద వాళ్లలో ఇది జీవన నాణ్యతమీద ప్రభావం ప్రతికూలం గా ఉంటుంది. దీనివలన ఏర్పడే సంక్లిష్టతలలో మూత్ర నాళాల అంటువ్యాధులు, ఒత్తిడి వలన పూత, పుండ్లు, నిరాశ ఇంకా మందుల నుండి దుష్ప్రభావాలు వంటివి ఉండవచ్చు.[2]

ఈ లక్షణాలకి కారణాలలో గర్భం ధరించడం, ప్రసవం సమయం, రుతువిరతి (మెనోపాజ్), అధిక బరువు, మలబద్ధకం, కటి శస్త్రచికిత్స, మూత్ర నాళాల అంటువ్యాధులు, కొన్ని రకాల మందులు కూడా ఉన్నాయి.[1] ఐదు ప్రధాన రకాల అసంయములు (నియంత్రణ లేని పరిస్థితులు) ఉన్నాయి

  • ఒత్తిడి: అసంయమ కారణంగా మూత్రాశయం సరిగా మూయబడలేక పోవడము వలన ఈ పరిస్థితి ఉంటుంది.
  • ఒత్తిడి అసంయమముతో కూడి అతిగా స్పందించే మూత్రాశయం
  • మూత్రనాళ స్పింక్టర్ కండరం పని చేయక పోవడం (అంతర్గత స్పింక్టర్ లోపం) లేదా మూత్రాశయ నాళం అతి కదలికలు
  • మిశ్రమ అసంయమము
  • మూత్రాశయ సంకోచం లేదా అడ్డంకి కారణంగా మూత్రం పైకి కారే అసంయములు.[2]

చికిత్స లక్షణాలు ఏ రకం అనే మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో కటి కండరాలకు శిక్షణ, మూత్రాశయం శిక్షణ, బరువు తగ్గడం, ధూమపానం ఆపడం, విద్యుత్ ప్రేరణ, మందులు, శస్త్రచికిత్స ఉండవచ్చు.[1] [3] సాధారణంగా ఒత్తిడి వలన మూత్రం ఆపుకొనలేని పరిస్థితిలో బిహేవియరల్ చికిత్స మందుల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. మందుల వలన ప్రయోజనం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్స అనేది అస్పష్టం. ఫలితాలు మారుతూ ఉంటాయి.[2]

వృద్ధులలో మూత్రం ఆపుకొనలేని ఈ లక్షణం సాధారణం గా ఉంటుంది.[4] అయితే, ఇది చాలా మంది బయటకు చెప్పరు.[2] పురుషులతో పోలిస్తే మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ప్రభావితమవుతారు .[1] 65 ఏళ్లు పైబడిన మహిళల్లో 40% కంటే ఎక్కువ మంది ప్రభావితమయ్యారు.[1]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Urinary incontinence". womenshealth.gov (in ఇంగ్లీష్). 8 March 2017. Archived from the original on 27 May 2017. Retrieved 28 October 2020.
  2. 2.0 2.1 2.2 2.3 (January 2020). "Urinary Incontinence".
  3. Shamliyan T, Wyman J, Kane RL (April 2012). "Nonsurgical Treatments for Urinary Incontinence in Adult Women: Diagnosis and Comparative Effectiveness". Comparative Effectiveness Reviews. AHRQ Comparative Effectiveness Reviews. Agency for Healthcare Research and Quality (US). PMID 22624162.
  4. "Urinary Incontinence in Older Adults". National Institute on Aging. Archived from the original on 14 April 2020. Retrieved 18 March 2018.