అన్నారం బ్యారేజి
అన్నారం బ్యారేజి | |
---|---|
![]() కాళేశ్వరం ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేస్తున్న సీయం కేసీఆర్ | |
ప్రదేశం | అన్నారం, మహాదేవపూర్ మండలం, కరీంనగర్ జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 18°45′51.9″N 79°49′24.7″E / 18.764417°N 79.823528°ECoordinates: 18°45′51.9″N 79°49′24.7″E / 18.764417°N 79.823528°E |
స్థితి | నిర్మాణంలో ఉంది |
నిర్మాణం ప్రారంభం | 02 మే 2016 |
ప్రారంభ తేదీ | 22 జూన్, 2019 |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
నిర్మించిన జలవనరు | గోదావరి నది |
Spillways | 68 |
జలాశయం | |
సృష్టించేది | అన్నారం బ్యారేజి |
మొత్తం సామర్థ్యం | 11.9 tmcft |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | బ్యారేజి |
అన్నారం బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా అన్నారం బ్యారేజి నిర్మించబడింది. యెల్లంపల్లి & మేడిగడ్డ మధ్య మూడు బారేజ్లను నిర్మించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదించిన బారేజిల్లో అన్నారం బ్యారేజి ఒకటి.
ప్రాజెక్టు వివరాలు[మార్చు]
2016 మే 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారం వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు.[1] గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్ చేశారు.[2]
అంచనా బ్యారేజి వివరాలు:
బ్యారేజి | బెడ్ స్థాయి (మీటర్లు) | చెరువు స్థాయి (మీటర్లు) | స్థూల నిల్వ (TMC లో) | గేట్ల సంఖ్య |
---|---|---|---|---|
అన్నారం బ్యారేజి | 107.0 | 120.0 | 11.9 |
ప్రారంభం[మార్చు]
2019, జూన్ 22న ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది.
మూలాలు[మార్చు]
- ↑ 10టీవి (1 May 2016). "మేడిగడ్డకు పునాది రాయి..." Retrieved 25 November 2017.[permanent dead link]
- ↑ నవతెలంగాణ (30 Apr 2016). "మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన". Retrieved 25 November 2017.