Jump to content

అన్బిల్ మహేశ్ పొయ్యమొళి

వికీపీడియా నుండి
అన్బిల్ మహేశ్ పొయ్యమొళి

పాఠశాల విద్య మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021
ముందు కె.ఏ. సెంగోట్టయన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2016
ముందు ఎస్. సెంథిల్‌కుమార్
నియోజకవర్గం తిరువెరుంబూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1977-12-02) 1977 డిసెంబరు 2 (వయసు 47)
తిరుచ్చి, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు అన్బిల్ పొయ్యమొళి, మాలతీ
జీవిత భాగస్వామి జనని
సంతానం ఇనియన్
నివాసం తిరుచ్చి, తమిళనాడు, భారతదేశం
వెబ్‌సైటు http://www.anbilmaheshpoyyamozhi.com/

అన్బిల్‌ మహేశ్‌ పొయ్యమొళి (జననం 1977 డిసెంబరు 2 "నల్లముత్తు పొయ్యమొళి" ) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు తిరువెరుంబూర్ శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర పాఠశాల విద్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అన్బిల్ మహేశ్ పొయ్యమొళి 2000లో డీఎంకే పార్టీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని 2014లో యూత్ వింగ్ సెక్రటరీగా నియమితుడయ్యాడు. ఆయన 2016లో తిరువెరుంబూర్ నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2] అన్బిల్ మహేశ్ పొయ్యమొళి  2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[3], ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో పాఠశాల విద్యా మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. The Week (22 March 2021). "Meet Anbil Mahesh Poyyamozhi, close friend of DMK scion Udhayanidhi Stalin" (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. CNBCTV18 (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Here's full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (19 December 2022). "గ్రంథాలయ పుస్తకాలు ఇంటికే వస్తాయి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.