అన్వారా బేగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్వారా బేగం
నవాబు సిరాజుద్దౌలా సినిమాలో అన్వారా బేగం (1967)
జననం
అన్వారా జమాల్

17 జనవరి 1948
జాతీయతబంగ్లాదేశి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1964-2014
జీవిత భాగస్వామిముహితుల్ ఇస్లాం ముహిత్‌ (1964)
పిల్లలురుమానా ఇస్లాం ముక్తి
బంధువులునర్గీస్ అఖ్తర్ (సోదరి)

అన్వారా బేగం, బంగ్లాదేశ్ సినిమా నటి. 2015[1] 600 కంటే ఎక్కువ సినిమాలలో నటించింది. అన్వారా నటించిన గొలాపి ఎఖోన్ ట్రైన్ (1978), సుందరోరి (1979), సోఖినార్ జుద్ధో (1984), మోరోనర్ పోర్ (1990), రాధా కృష్ణ (1992), బంగ్లార్ బధు (1993), ఒంటోర్ ఒంటోర్ (1994) సినిమాలకు ఏడుసార్లు ఉత్తమ సహాయ నటిగా.., షువోడా (1986) సినిమాకి ఉత్తమ నటిగా బంగ్లాదేశ్ నేషనల్ ఫిల్మ్ అవార్డులు గెలుచుకుంది.[2]

సినిమారంగం

[మార్చు]

అన్వారా పలాసి బాలికల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నప్పుడు 1961లో ఆజాన్ అనే సినిమాలోని ఒక పాటలో నృత్యకారిణిగా నటించింది.[3] కానీ ఆ సినిమా విడుదల కాలేదు. 1963లో నాచ్ఘోర్, ప్రీతి నా జానే రీత్ అనే రెండు సినిమాలలో డ్యాన్సర్‌గా నటించింది. ఆ తర్వాత 1964లో వచ్చిన సంగం అనే సినిమాలో సహాయ నటిగా నటించింది. 1967లో వచ్చిన బాలా అనే సినిమాలో ప్రధాన పాత్రలోనటించింది. 1967లో వచ్చిన నవాబ్ సిరాజుద్దౌలా సినిమాలో ఆలేయా పాత్రలో నటించి గుర్తింపు పొందింది.[4]

1972 నుండి, అన్వారా తల్లి, అత్త, పాత్రలలో నటించడం ప్రారంభించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అన్వారాకు 1972లో ముహితుల్ ఇస్లాం ముహిత్‌లో వివాహం జరిగింది. వారికి రుమానా ఇస్లాం ముక్తి అనే కుమార్తె ఉంది.[4]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు పాత్ర ఇతర వివరాలు మూలాలు
1964 సంగం జహీర్ రైహాన్
1965 జనజని
ఎకలేర్ రూపకోత
1967 నవాబు సిరాజుద్దౌలా ఖాన్ అతౌర్ రెహమాన్ ఏలియా [4]
బాల
1976 నాయన్మోని పద్మ కాకి
1978 గోలపి ఎఖోన్ ట్రైన్ అమ్జాద్ హుస్సేన్ మొయినా ఉత్తమ సహాయ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
1979 సుందరి అమ్జాద్ హుస్సేన్ ఉత్తమ సహాయ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
1980 కోసాయి
గోరిబెర్ మేయే
బషోరి
1982 దేవదాస్ చాషి నజ్రుల్ ఇస్లాం చంద్రముఖి [3]
1984 సోఖినార్ జుడ్డో ఉత్తమ సహాయ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
1986 శువోడా చాషి నజ్రుల్ ఇస్లాం ఉత్తమ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది [5]
1989 బౌమా
1990 మోరోనర్ పోర్ ఉత్తమ సహాయ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
1991 దంగా కాజీ హయత్ అమీనా బేగం
1992 రాధా కృష్ణ ఉత్తమ సహాయ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
1993 బంగ్లార్ బధు ఉత్తమ సహాయ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
1994 ఒంటోర్ ఒంటోర్ డాడీ ఉత్తమ సహాయ నటిగా బంగ్లాదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
1999 స్రాబోన్ మేఘర్ దిన్ హుమయూన్ అహ్మద్ కుసుమ్ తల్లి
2013 పూర్ణో దోయిర్ఘో ప్రేమ కహినీ సఫీ ఉద్దీన్ సఫీ రోకేయా బేగం/డాది [6]
2014 చినీ బీబీ నజ్రుల్ ఇస్లాం బాబు డాడీ [7]
2016 ఓజంతే భలోబాషా ఏజే రానా ప్రేమ్ అమ్మమ్మ

మూలాలు

[మార్చు]
  1. আনোয়ারা বেগম. Online Dhaka Guide. Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-25.
  2. জাতীয় চলচ্চিত্র পুরস্কার প্রাপ্তদের নামের তালিকা (১৯৭৫-২০১২) [List of the winners of National Film Awards (1975-2012)]. Government of Bangladesh. Bangladesh Film Development Corporation. Archived from the original on 2018-12-23. Retrieved 2022-02-25.
  3. 3.0 3.1 Khokhon, Liakat (5 August 2010). কিংবদন্তি : বাংলার আলেয়া আনোয়ারা [Legendary Anwara - Aleya of Bengal]. Amar Desh. Archived from the original on 4 March 2016. Retrieved 2022-02-25.
  4. 4.0 4.1 4.2 "Film actress Anwara gets PM's assistance". Prothom Alo. 27 August 2017. Archived from the original on 27 August 2017. Retrieved 2022-02-25.
  5. Shah Alam Shazu (6 February 2015). "Suchitra was Chashi mama's first choice for 'Shubhoda…Anwara". The Daily Star. Retrieved 2022-02-25.
  6. "Razzak acts opposite Anwara after decades". Dhaka Mirror. Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-25.
  7. "Misty Zannat with Anwara". The New Nation. 30 October 2014. Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-25.