అన్వేషణ (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్రం జాషువా

అన్వేషణ గుర్రం జాషుగా, విశ్వనాథ సత్యనారాయణల శత జయంతి ఉత్సవాల ప్రత్యేక సంచిక. విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో 20వ శతాబ్ది తొలి అర్థభాగంలోనే వలసవాదాన్ని ఎదిరించినవారు. గుర్రం జాషువా అదే కాలంలో కుల వివక్షపై పోరాటం చేసినవారు. వారిద్దరికీ ఒకరితో ఒకరికి సౌజన్యం ఉండేది. సిద్ధాంతాల హోరులో పలువురు లేని వివాదాలు ప్రచారం చేసినా వారి మధ్య స్నేహం చెదరనిది. వారిద్దరూ 1895లో జన్మించినవారే. 1994-5లో నాగార్జున విశ్వవిద్యాలయ తెలుగు ప్రాచ్య పరిశోధన విభాగం వారిద్దరి శతజయంతిని పలువురు సాహిత్యవేత్తల ప్రసంగాలతో నిర్వహించి. వాటన్నిటినీ విభాగపు పత్రిక అన్వేషణ ప్రత్యేక సంచికలో ప్రకటించింది.

ఉత్సవ ప్రసంగాలు

[మార్చు]
  1. శతవసంతాల విశ్వనాథ - డా. యం.ఆర్. అప్పారావు
  2. జాషువా కవితాత్మ - ఆచార్య ఎస్. గంగప్ప
  3. కిన్నెరసాని - ప్రొఫెసర్ తమ్మారెడ్డి నిర్మల
  4. మహాకవి జాషువా సాహిత్యంలో మానవతావాదం - శ్రీ జె. అమ్ములయ్య
  5. గుప్తపాశుపతం - తులనాత్మక పరిశీలన - డా. పి. వరప్రసాద మూర్తి
  6. విశ్వనాథ - జాషువా - డా. సంజీవ దేవ్
  7. విశ్వనాథవారి వేయిపడగలు నవలా వైశిష్ట్యం - డా. జి. వై. ప్రభావతీదేవి
  8. విశ్వనాథవారి విశ్వామిత్రుడు - ఆచార్య నేతి అనంతరామశాస్త్రి
  9. విశ్వనాథవారి కృష్ణకవిత - ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం
  10. కవికోకిల జాషువా కవితా భూమిక - ఆచార్య ఆ. పున్నారావు
  11. జాషువా కవితలో మానవతావాదం - శ్రీ రావెల సాంబశివరావు
  12. నవయుగ సంఘ సంస్కర్త జాషువా - శ్రీ. కె. సత్యనారాయణ
  13. శ్రీ విశ్వనాథ రేడియో నాటికలు - తెలుగు సాహిత్యం - అనుశీలన - ఆచార్య ఎస్. గంగప్ప
  14. జాషువా "నా కథ" - రసవత్కావ్యం - ఆచార్య లకంసాని చక్రధరరావు
  15. విశ్వనాథ సాహితీ వ్యక్తిత్వం - ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ
  16. జాషువా ముంతాజమహలు - కావ్యసౌందర్యం - డా. జి. వై. ప్రభావతీదేవి
  17. జాషువా కోరిన జాతీయ సమైక్యత - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి

మూలాలు

[మార్చు]