అపాల
Jump to navigation
Jump to search
అపాల అత్రి మహర్షి పుత్రిక. ఋగ్వేదం 8.91 శ్లోకంలో అపాల గురించి ప్రస్తావన ఉంది. [1]
అత్రి మహా ముని కుమార్తె బ్రహ్మవాదిని అనే కన్యకు బొల్లి వ్యాధి ఉండటం వలన వరుడు దొరకలేదు. ఆమెను ఏలుకునే పాలకుడు (భర్త) లభించలేదు కాబట్టి ఆమెకి అపాల అనిపేరొచ్చింది. వరుడు లభించేలా చేయమని ఆమె నిత్యం ఇంద్రుని పూజించేది. ఓసారి నదిలో కొట్టుకుపోతూ కూడా, చేతికందిన సోమలతని నమిలి, ఆ రసంతో ఇంద్రుని పూజించింది. ఇంద్రుడు అ రసాన్ని స్వీకరించి రతము, ఇరుసు, కాడి ఈ మూడింటి రంధ్రాల గుండా ఉదకాన్ని పోసి అమెను పవిత్రురాల్ని చేశాడు. ఆమె ఆరోగ్యవంతురాలైంది. అప్పటి నుంచీ ప్రతి వధువునూ వివాహ సమయంలో ఉదకంతో పవిత్రం చేయడం ఆచారమైంది.[2]
దాశరథి రంగాచార్య రచించిన ఋగ్వేద సంహిత లో ఎనభయ్యవ సూక్తంలో పైన వివరించిన అపాల కథ ప్రస్తావన ఉంది. [3]
మూలాలు
[మార్చు]- ↑ Histence. "histence". histence.blogspot.com. Retrieved 16 June 2016.
- ↑ భూమిక. "bhumilka". bhumika.org. K Satyavati. Retrieved 16 June 2016.
- ↑ http://www.teluguone.com/grandalayam/mobile1/novels/%E0%B0%8E%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D---81-1313-34844.html
- అపాల: శ్రీమతి టి.సావిత్రి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1999.