Jump to content

అప్రస్తుత ప్రశంసాలంకారం

వికీపీడియా నుండి

అప్రస్తుత ప్రశంసాలంకారం తెలుగు భాషలో ఒక విధమైన అలంకారము.

లక్షణం

[మార్చు]

ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం అవుతుంది.

ఉదాహరణ-1

[మార్చు]

"వలచిన యువకుని గాలి సోకినంత మాత్రముననే వెన్నలా కరిగిపోయే మనసుతో వశమయే మనుజ అలివేణుల కౌగిటి సుఖము ఎన్ని జన్మలెత్తినా లభింపవు" అని వరూధిని అన్నది.[1] ఇది మనుచరిత్రలోని పెద్దన గారు రాసిన వచనం.

వివరణ

[మార్చు]

ఇక్కడ అప్రస్తుతమగు లోకంలోని అలివేణుల వర్ణన చేత ప్రస్తుతం అయిన వరూధిని తానట్టి దానననియు, తనను కౌగిటిలో చేర్చటం అనేది ఎన్నో జన్మలెత్తితే గాని లభింపదనియు, అది నీకు (ప్రవరునికి) లభించిందనీ అర్ధం ఇక్కడ తోచడం వల్ల ఇది అప్రస్తుత ప్రశంస.

ఉదాహరణ-2

[మార్చు]

"ఇంద్రుని తప్ప ఇంకొకని యాచింపని చాకక పక్షి ఒక్కటియే పక్షులలో ధన్యము."

ఇందు చాతక పక్షి ధన్యత గురింది వర్ణించబడింది. అది వర్ష జలాల కోసం ఇంద్రుడుని తప్ప మరొకరిని యాచింపదు. ఇది అప్రస్తుతం. కానీ దీనివల్ల గొప్పరాజైన వానిని తప్ప ఇంకొకడిని యాచింపని యాచకుడు స్ఫురించుచున్నాడు. యాచక ప్రశంస ప్రస్తుతం. కానీ ఇక్కడ అప్రస్తుతం అయిన చాతక పక్షి ప్రశంసించబడడం వల్ల ఇది అప్రస్తుత ప్రశంసాలంకారం అయినది.

మూలాలు

[మార్చు]
  1. మను చరిత్రలో అల్లసాని పెద్దన