అబొహొమాన్
Appearance
అబొహొమాన్ | |
---|---|
దర్శకత్వం | ఋతుపర్ణ ఘోష్ |
రచన | ఋతుపర్ణ ఘోష్ |
నిర్మాత | మహేష్ రామనాథన్, రిలయన్స్ బిగ్ పిక్చర్స్, జై దేవ్ బెనర్జీ |
తారాగణం | దీపంకర్ దే మమతా శంకర్ అనన్య ఛటర్జీ జిషు సేన్ గుప్తా రియా సేన్ |
ఛాయాగ్రహణం | అవిక్ ముఖోపధ్యాయ్ |
కూర్పు | అర్ఘ్యకమల్ మిత్ర |
సంగీతం | 21 గ్రామ్స్ |
పంపిణీదార్లు | బిగ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2010, జనవరి 22 |
సినిమా నిడివి | 122 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
అబొహొమాన్, 2010 జనవరి 22న విడుదలైన బెంగాలీ సినిమా. మహేష్ రామనాథన్, రిలయన్స్ బిగ్ పిక్చర్స్ నిర్మాణంలో ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపంకర్ దే, మమతా శంకర్, అనన్య ఛటర్జీ, జిషు సేన్ గుప్తా, రియా సేన్ తదితరులు నటించారు. 2009 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మార్చి డు ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా ప్రదర్శించబడింది.[1]
తన కుమారుడి వయసు గల దర్శకుడిని ప్రేమించిన వివాహిత నటి నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది.[2] 2010 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ దర్శకుడు (ఋతుపర్ణ ఘోష్), జాతీయ ఉత్తమ నటి (అనన్య ఛటర్జీ), జాతీయ ఉత్తమ ఎడిటింగ్ (అర్ఘ్య కమల్ మిత్ర), బెంగాలీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (మహేష్ రామనాథన్) విభాగాల్లో అవార్డులు వచ్చాయి.[3]
నటవర్గం
[మార్చు]- దీపాంకర్ దే (అనికేత్)
- మమతా శంకర్ (దీప్తి)
- జిషు సేన్‌గుప్తా (అప్రాతిమ్)
- అనన్య ఛటర్జీ (శిఖ సర్కార్/శ్రీమతి సర్కార్)
- రియా సేన్ (చంద్రిక/తీయ)
- సశ్వతి గుహాతకుర్తా (హషి)
- సుమంత ముఖర్జీ (గిరీష్ చంద్ర ఘోష్)
- లబోని సర్కార్ (శిఖా సోదరి)
- శోభా సేన్ (అనికేత్ తల్లి)
- దేబ్జానీ చటోపాధ్యాయ్ (సంగీత)
- రిషి కౌశిక్
అవార్డులు
[మార్చు]- గోల్డెన్ లోటస్ అవార్డు - ఉత్తమ దర్శకుడు - ఋతుపర్ణ ఘోష్
- సిల్వర్ లోటస్ అవార్డు - ఉత్తమ నటి - అనన్య ఛటర్జీ
- సిల్వర్ లోటస్ అవార్డు - ఉత్తమ ఎడిటింగ్ - అర్ఘ్యకమల్ మిత్ర
- సిల్వర్ లోటస్ అవార్డు - బెంగాలీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కోసం జాతీయ ఫిల్మ్ అవార్డు - మహేష్ రామనాథన్
మూలాలు
[మార్చు]- ↑ Premankur Biswas (1 May 2009). "Cannes Bound". The Indian Express. Retrieved 2021-07-31.
- ↑ "Rituparno Ghosh's Abohomaan to release Jan 22". India Today. PTI. 5 January 2010. Retrieved 2021-07-31.
- ↑ "Rituparno happy, but not celebrating 'Abohoman' success". Bollywood.com. Archived from the original on 2018-07-28. Retrieved 2021-07-31.