అబ్దుల్ నజీబ్ ఖురేషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్ నజీబ్
వ్యక్తిగత సమాచారము
పూర్తిపేరుమహ్మద్ అబ్దుల్ నజీబ్ ఖురేషి [1]
జాతీయత భారతదేశం
జననం (1988-02-25) 1988 ఫిబ్రవరి 25 (వయసు 36)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
నివాసంహఫీజ్ బాబానగర్, హైదరాబాదు
క్రీడ
దేశంభారతదేశం
క్రీడరన్నింగ్
సంఘటన(లు)100 మీటర్లు, 200 మీటర్లు
Retiredకాలేదు
విజయాలు, బిరుదులు
వ్యక్తిగత ఉత్తమ విజయాలు60 m: 6.90 (తెహ్రాన్ 2010)
100 m: 10.30 (న్యూఢిల్లీ 2010)
200 m: 21.06 (కొచ్చి 2010)

అబ్దుల్ నజీబ్ ఖురేషి (జననం 1988-02-25) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన స్ప్రింటర్ (రన్నర్). అనిల్ కుమార్ ప్రకాష్ లతో కలిసి 10.30లో 100 మీటర్ల భారత జాతీయ రికార్డును నెలకొల్పాడు.[2]

జీవిత విషయాలు[మార్చు]

ఖురేషి 1988, ఫిబ్రవరి 25న జన్మించాడు. హైదరాబాదు కాంచన్‌బాగ్‌లోని డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. పరుగులో ఖురేషి ప్రతిభను మొదటగా గుర్తించిన పిటి మాస్టర్ ఆదర్శ్ గోస్వామి, అథ్లెటిక్స్ వృత్తిని కొనసాగించాలని ప్రోత్సహించాడు.

క్రీడారంగం[మార్చు]

2010, అక్టోబరు 6న ఖురేషి న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడల్లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించినప్పుడు 100కు సమాన రికార్డ్ చేశాడు.[3] 2005లో న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ సర్క్యూట్ అథ్లెటిక్ మీట్‌లో 10.30లలో అనిల్ కుమార్ ప్రకాష్ చేసిన జాతీయ రికార్డును సమం చేశాడు.[4] 2010 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారతదేశ 4x100 రిలే జట్టులో ఖురేషి కూడా ఉన్నాడు.[5] ఈ జట్టు 38.89 సెకన్లలో జాతీయ రికార్డు సృష్టించింది.[6]

2010 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన దక్షిణాసియా క్రీడలలో ఖురేషి 200 మీటర్లు పరుగు పందెంలో గెలిచాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "Kavita Raut sets 10,000m meet record". The Hindu. 19 May 2010. Archived from the original on 24 May 2010. Retrieved 19 July 2021.
  2. "Qureshi equals national 100m record, qualifies for semis". The Times of India. 8 October 2010. Retrieved 19 July 2021.
  3. "The 'Ukraine effect' on Indian sprinters". The Hindu. 8 October 2010. Archived from the original on 11 October 2010. Retrieved 19 July 2021.
  4. "Qureshi equals national 100m record, qualifies for semis". Rediff.com. 6 October 2010. Archived from the original on 9 October 2010. Retrieved 19 July 2021.
  5. "4x100 Metres Relay Results". CBC. 2010-10-12. Archived from the original on 2011-07-21. Retrieved 19 July 2021.
  6. Rajeev K. (2010-10-12). "Relay quartet stands out on night of riches". Deccan Herald. Archived from the original on 22 October 2010. Retrieved 19 July 2021.
  7. "South Asian Games 2010- Dhaka". asianathletics.org. 8 February 2010. Archived from the original on 7 October 2010. Retrieved 19 July 2021.

బయటి లింకులు[మార్చు]