Jump to content

అబ్స్ట్రక్టెడ్ లేబర్

వికీపీడియా నుండి
Cesarean Delivery
సిజేరియన్ డెలివరీ - రేఖా పటం

అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ (Obstructed labour) లేదా లేబర్ డిస్టోషియా (labour dystocia), అనేది శిశువు జన్మ సమయంలో గర్భాశయం సాధారణంగా వర్తనములో ఉన్నప్పటికీ, పొత్తికడుపు నుండి శిశువు బయటకి రాకుండా శిశువు జన్మాన్ని భౌతికంగా ఆగిపోవడం.[1] శిశువుకు సంబంధించిన సమస్యలు తగినంత ఆక్సిజన్ పొందలేక మరణించచ్చు, తల్లికి సంక్రమణ, గర్భాశయ చీలికను కలిగి ఉండటం లేదా ప్రసవానంతర రక్తస్రావం కలిగివుండే ప్రమాదం పెరుగుతుంది.[2] తల్లికి వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ప్రసూతి నాళవ్రణం (obstetrical fistula). లేబర్ దశ కనుక పన్నెండు గంటలు కన్నా ఎక్కువ ఉంటే అది ప్రోలాంగ్డ్ లేబర్ గా మారే అవకాశాం ఉంది.[1]

అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ సంభవించటానికి ప్రధాన కారణాలు: పెద్ద లేదా అసాధారణ స్థానంలో ఉన్న శిశువు, ఒక చిన్న పొత్తికడుపు,, జనన కాలువతో సమస్యలు. అసాధారణ స్థానములో ముందుగా భుజము జఘన ఎముక (pubic bone) క్రింద తేలికగా జరగనప్పుడు దినిని భుజం డిస్టోకియా అంటారు.[2] ఒక చిన్న పొత్తికడుపు కోసం ప్రమాద కారకాలు విటమిన్ డి లోపం వల్ల కలిగే పోషకాహార లోపాలు, సూర్యకాంతికి గురికావక పోవడం.[3] పెల్వివిస్ పెరుగుదల పూర్తికాకపోవటం వలన యవ్వనంలో కూడా ఇది చాలా సాధారణం. జనన కాలువతో సమస్యలు ఇరుకైన యోని, పెర్నియం (perineum), ఇవి స్త్రీ జననాంగ విస్ఫారణం లేదా కణితుల వలన కావచ్చు.[2] ఒక పార్టోగ్రాఫ్ ని తరచూ పురోగతిని ట్రాక్ చేయడానికి, సమస్యలను నిర్ధారించడానికి ఉపయోగిస్తారు, శారీరక పరీక్షతో కలిపి అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ గుర్తించవచ్చు.[4]

అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ కు చికిత్స సిజేరియన్ విభాగం లేదా వాక్యూమ్ వెలికితీత అవసరం కావచ్చు, ఇతర చర్యలు: పొరలు (membranes) కనుక 18 గంటలకు పైగా విరిగిపోయినట్లయితే మహిళల జలయోజిత తగ్గకుండా ఉంచటం, యాంటీబయాటిక్స్ను పంపిణి చేయటం చేయాలి.[5] ఆఫ్రికాలో, ఆసియాలో రెండు నుంచి ఐదు శాతం కాన్పులు అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్కు ప్రభావితమయ్యయి. 2015 లో సుమారు 6.5 మిలియన్ల కేసులు నమోదుఅయ్యాయి.[6] దీని ఫలితంగా 1990 లో 23,000 నుండి 29,000 తల్లి మరణాలు సంభవించాయి.[1]

కారణాలు

[మార్చు]

అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ సంభవించటానికి ప్రధాన కారణాలు: పెద్ద లేదా అసాధారణ స్థానంలో ఉన్న శిశువు, ఒక చిన్న పొత్తికడుపు,, జనన కాలువతో సమస్యలు. అసాధారణ స్థానములో ముందుగా భుజము జఘన ఎముక (pubic bone) క్రింద తేలికగా జరగనప్పుడు దినిని భుజం డిస్టోకియా అంటారు.[1] ఒక చిన్న పొత్తికడుపు కోసం ప్రమాద కారకాలు విటమిన్ డి లోపం వల్ల కలిగే పోషకాహార లోపాలు, సూర్యకాంతికి గురికావక పోవడం.[3] పెల్వివిస్ పెరుగుదల పూర్తికాకపోవటం వలన యవ్వనంలో కూడా ఇది చాలా సాధారణం. జనన కాలువతో సమస్యలు ఇరుకైన యోని, పెర్నియం (perineum), ఇవి స్త్రీ జననాంగ విస్ఫారణం లేదా కణితుల వలన కావచ్చు.[1]

రోగ నిర్ధారణ

[మార్చు]

అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ని సాధారణంగా శారీరక పరీక్షతో నిర్ధారిస్తారు.[4]

చికిత్స

[మార్చు]

అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ కు చికిత్స సిజేరియన్ విభాగం లేదా వాక్యూమ్ వెలికితీత అవసరం కావచ్చు, ఇతర చర్యలు: పొరలు (membranes) కనుక 18 గంటలకు పైగా విరిగిపోయినట్లయితే మహిళల జలయోజిత తగ్గకుండా ఉంచటం, యాంటిబయోటిక్స్ని పంపిణి చేయాలి.[5]

రోగ నిరూపణ

[మార్చు]

సిజేరియన్ విభాగం కనుక సమయానుసారంగా తీసుకుంటే, రోగ నిర్ధారణ మంచిది. దీర్ఘకాలం అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ని అడ్డుకొంటె బిడ్డ లేక తల్లి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.[7]

సాంక్రమిక రోగ విజ్ఞానం

[మార్చు]

2013 లో అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ వల్ల 19,000 మంది,, 1990 లో 29,000 మంది మరణించారు.[8]

పద చరిత్ర

[మార్చు]

డిస్టోకియా అనే పదానికి అర్థం డిఫికల్ట్ లేబర్. దాని వ్యతిరేక పదం యుటోషియా లేదా ఈసీ లేబర్. అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్కి వేరే పేర్లు: డిఫికల్ట్ లేబర్, అబ్నొర్మల్ లేబర్, డిఫికల్ట్ ఛైల్డ్బిర్త్, అబ్నొర్మల్ ఛైల్డ్బిర్త్, డిస్ఫంక్షనల్ లేబర్.

ఇతర జంతువులు

[మార్చు]

ఈ పదాన్ని వివిధ జంతువుల సందర్భంలో కూడా ఉపయోగించవచ్చు. పక్షులకు, సరీసృపాలకు సంబంధించిన డిస్టోకియాని ఎగ్ బైండింగ్ అని కూడా పిలుస్తారు. విస్తృతమైన సెలెక్టివ్ బ్రీడింగ్ కారణంగా, ఇతర జాతుల కంటే చిన్న గుర్రాలు మరింత తరచుగా అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ అనుభవం చెందుతాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 ఎడ్యుకేషన్ మెటీరియల్ ఫర్ టీచర్స్ అఫ్ మిడ్వైఫరీ : మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ (PDF) (2nd ed.). జెనీవా [స్విట్జర్లాండ్]: వరల్డ్ హెల్త్ ఆర్గనైసెషన్. 2008. pp. 17–36. ISBN 9789241546669. Archived (PDF) from the original on 2015-02-21.
  2. 2.0 2.1 2.2 నెయిల్సన్, జెపి; లావెండర్, టి; క్యూన్బై, ఎస్; వ్రే, ఎస్ (2003). "అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్". బ్రిటిష్ మెడికల్ బులెటిన్. 67: 191–204. doi:10.1093/bmb/ldg018. PMID 14711764.
  3. 3.0 3.1 Eఎడ్యుకేషన్ మెటీరియల్ ఫర్ టీచర్స్ అఫ్ మిడ్వైఫరీ : మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ (PDF) (2nd ed.). జెనీవా [స్విట్జర్లాండ్]: వరల్డ్ హెల్త్ ఆర్గనైసెషన్. 2008. pp. 38–44. ISBN 9789241546669. Archived (PDF) from the original on 2015-02-21.
  4. 4.0 4.1 ఎడ్యుకేషన్ మెటీరియల్ ఫర్ టీచర్స్ అఫ్ మిడ్వైఫరీ : మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ (PDF) (2nd ed.). జెనీవా [స్విట్జర్లాండ్]: వరల్డ్ హెల్త్ ఆర్గనైసెషన్. 2008. pp. 45–52. ISBN 9789241546669. Archived (PDF) from the original on 2015-02-21.
  5. 5.0 5.1 ఎడ్యుకేషన్ మెటీరియల్ ఫర్ టీచర్స్ అఫ్ మిడ్వైఫరీ : మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ (PDF) (2nd ed.). జెనీవా [స్విట్జర్లాండ్]: వరల్డ్ హెల్త్ ఆర్గనైసెషన్. 2008. pp. 89–104. ISBN 9789241546669. Archived (PDF) from the original on 2015-02-21.
  6. ఉష, కృష్ణా (2004). ప్రెగ్నన్సీ యట్ రిస్క్ :కరెంట్ కాన్సెప్ట్స్. న్యూ ఢిల్లీ: జెపి బ్రోస్. p. 451. ISBN 9788171798261. Archived from the original on 2016-03-04.
  7. కార్మెన్ డొలీ, కార్లా అబౌజార్ (July 2003). "గ్లోబల్ బర్డెన్ ఆఫ్ అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఇన్ ది ఇయర్ 2000" (PDF). ఎవిడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ పాలసీ (ఈఐపి), వరల్డ్ హెల్త్ ఆర్గనైసెషన్.
  8. జిబిడి 2013 మోర్తాలిటీ అండ్ కాసెస్ ఆఫ్ డెత్, కొలాబొరెటర్స్ (17 October 2018). "గ్లోబల్ , రీజినల్ అండ్ నేషనల్ ఏజ్-సెక్స్ స్పెసిఫిక్ ఆల్-కాస్ అండ్ కాస్-స్పెసిఫిక్ మోర్టాలిటి ఫర్ 240 కాసెస్ అఫ్ డెత్, 1990-2013: ఏ సిస్టమాటిక్ ఎనాలిసిస్ ఫర్ ది గ్లోబల్ బర్డెన్ అఫ్ దిసీజ్స్ స్టడీ 2013". Lancet. 385: 117–71. doi:10.1016/S0140-6736(14)61682-2. PMC 4340604. PMID 25530442.{{cite journal}}: CS1 maint: numeric names: authors list (link)