అభిరామి అజయ్ ఒక భారతీయ నేపథ్య గాయని.[1][2] ఆమె ఎర్నాకుళంలోని సెయింట్ థెరెసా కళాశాల నుండి పట్టభద్రురాలైంది.[3]డైమండ్ నెక్లెస్ చిత్రంలో తన మొదటి పాట "తొట్టు తొట్టు" పాడటం ద్వారా ఆమె తన వృత్తిని ప్రారంభించింది.[4][5]
అభిరామి 13 సంవత్సరాల వయస్సులో డైమండ్ నెక్లెస్ చిత్రంలో విద్యాసాగర్ తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఆ పాట హిట్ అయింది. తరువాత అభిరామి విద్యాసాగర్, ఔసేప్పచన్, గోపి సుందర్ కలిసి పనిచేశారు.