అభివాదం
అభివాదము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. అనేక దేశాలలో వివిధ విధాలుగా అభివాదాలు చేస్తారు. అలాగే వివిధ మతములలో వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా అభివాదాలు చేస్తారు.
హిందూ సాంప్రదాయంలో అభివాదం
[మార్చు]పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమకు తాము అభివాద మంత్రం ద్వారా ఇతరులకు పరిచయం చేసుకొనేవారు. ఈ సంస్కృత మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి.
__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత _________ సగోత్రః , _____ సూత్రః, _____ శాఖాధ్యాయీ _________శర్మన్ అహం భో అభివాదయే !
ఏ వంశానికైనా ఒక్కరు లేక ముగ్గురు లేక ఐదుగురు లేక ఏడుగురు ఋషులు (గోత్ర పురుషులు) ఉండవచ్చును. పైని ప్రవరలో, మన గోత్రము పేరు, గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ఇంకా ఖాళీలలో, సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ, బౌధాయన, కాత్యాయన ....ఇలా.. ). శాఖ అన్నచోట, తమ వంశపారంపర్యంగా అనుసరించే, అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు, రిక్, సామ ... ఇలా ). శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని, క్షత్రియులైతే, వర్మా అని, వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
ఉదాహరణకు క్షత్రియ కులానికి చెందిన ఒక వ్యక్తి ఇలా చెబుతాడు: అభివాదయే విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ ఇతి త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్రస్య, ఆపస్తంభ సూత్ర, యజు సాఖాద్యాయీ రామకృష్ణ తేజ వర్మా నాం అహంభొ అభివాదయే.
ఐతే అభివాదం తెలియజెప్పడానికి ఏ వ్యక్తికైనా తన గోత్రము, ప్రవర, సూత్రము, వేద శాఖ వగైరా తెలవాలి. శూద్ర కులాలవారికి ఈ విధంగా అభివాదం తెలియజెప్పడానికి మార్గము లేదు.
హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు తమ గోత్రములను, ప్రవరలను, శాఖలను కలిపి అభివాదము చేసేవారు. ఉదాహరణకు నేను ఫలాన వ్యక్తిని అని పరిచయం ఛెసుకోవడానికి - విశ్వమిత్ర, మధుచ్చంద, ధనుంజయ త్రియార్షేయ ధనుంజయ గోత్ర, ఆపస్తంభ సూత్ర, యజుర్వెద శాఖయే రామకృష్ణ తేజ వర్మ అహంభో అభివాదయే" అని చెప్పుకొనేవారు. బ్రాహ్మణులైతే తమ పేర్ల చివర శర్మ అని, క్షత్రియులైతే తమ పేర్ల చివర వర్మ అని, వైశ్యులైతెతే తమ పేర్ల చివర గుప్త అని చెప్పుకోనేవారు.
క్రైస్తవ మత సాంప్రదాయాలలో అభివాదము
[మార్చు]వందనాలు లేక ప్రయిజ్ ద లార్డ్ ని క్రైస్తవులు అభివాదం చేస్తారు.
ఇస్లాం మత సాంప్రదాయంలో అభివాదాము
[మార్చు]ముస్లింలు సలాం, ఆదాబ్ లు పలుకుతారు.