Jump to content

అమర జవాన్ జ్యోతి

వికీపీడియా నుండి
ఇండియా గెట్ కింద ఉన్న అమర జవాన్ జ్యోతి
జాతీయ యుద్ధ స్మారకం అమర చక్ర దగ్గర ఉన్న అమర జవాన్ జ్యోతి

అమర జవాన్ జ్యోతి (హిందీ: अमर जवान ज्योति) అనేది 1971 నాటి ఇండో-పాకిస్తానీ యుద్ధం తర్వాత భారత సాయుధ దళాలలో మరణించిన అమరవీరులైన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన భారతీయ స్మారక చిహ్నం. అమర జవాన్ జ్యోతి పాలరాతి పీఠాన్ని కలిగి ఉంటుంది. దాని పైన సమాధి ఉండి, "అమర జవాన్" (అమర సైనికుడు) అని సమాధికి నాలుగు వైపులా బంగారంతో రాయబడి ఉంటుంది. దాని పైన, L1A1 సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ దాని బారెల్‌పై సైనికుడి హెల్మెట్‌ ను కలిగి ఉంటుంది. పీఠం నాలుగు కలశాలతో బంధించబడి ఉంటుంది, వాటిలో ఒకటి నిరంతరం మండే మంటను కలిగి ఉంటుంది.

స్థానం

[మార్చు]

ఈ స్మారకం రెండు ప్రదేశాలలో ఉంది. మొదటిది డిసెంబరు 1971లో నిర్మించబడింది, ఇది 1972లో ఇందిరా గాంధీ చేత న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద ఇండియా గేట్ క్రింద ప్రారంభించబడింది. రెండవది భారత సాయుధ దళాలలో అమరవీరులందరిని (స్వాతంత్ర్యం తర్వాత) గౌరవించటానికి జాతీయ యుద్ధ స్మారక చిహ్నం క్రింద స్థాపించబడింది, ఇది 'బంగారు అక్షరాలతో' లిఖించబడింది, దీని నిర్మాణం ఫిబ్రవరి 2019లో పూర్తి చేసి, ఫిబ్రవరి 25న జవాన్ల శాశ్వత జ్వాల "అమర జవాన్ జ్యోతి"ని వెలిగించి నరేంద్ర మోదీ ప్రారంభించాడు.

చరిత్ర

[మార్చు]

ఇండియా గేట్ 1921లో ఎడ్విన్ లుటియన్స్ చేత నిర్మించబడింది. అమర్ జవాన్ జ్యోతి 1971లో ఇండియా గేట్ కింద నిర్మించబడింది. 3 డిసెంబర్ 1971 నుండి 16 డిసెంబర్ 1971 వరకు (ఢాకా పతనం), తూర్పు పాకిస్తాన్‌లో విముక్తి యుద్ధం సమయంలో భారతదేశం పాకిస్తాన్‌తో (1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం) సైనిక ఘర్షణను ఎదుర్కొంది.[1] బంగ్లాదేశ్ సృష్టికి భారతదేశం సహాయం అందించింది, ఈ సమయంలో చాలా మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరు 1971లో, 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం తర్వాత, మరణించిన, తెలియని సైనికుల స్మారకార్థం ఇండియా గేట్ కింద అమర జవాన్ జ్యోతిని నిర్మించడానికి ఇందిరా గాంధీ (అప్పటి భారత ప్రధాని) శంఖుస్థాపన చేసింది.[2] 26 జనవరి 1972 (23వ భారత గణతంత్ర దినోత్సవం)న, స్మారక చిహ్నాన్ని ఇందిరా గాంధీ అధికారికంగా ప్రారంభించింది.[3][3][4]

అమర జవాన్ జ్యోతి పాత ఆచారం (1972-2019)

[మార్చు]

1972 నుండి, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఎయిర్‌స్టాఫ్ చీఫ్, నేవల్ స్టాఫ్ చీఫ్, ఆర్మీ స్టాఫ్ చీఫ్, మరికొంత మంది ప్రముఖులు ఇండియా గేట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, అమరులైన సైనికులకు నివాళులర్పించేవారు.[3][4][5][6]

అమర జవాన్ జ్యోతి ప్రస్తుత ఆచారం (2020-)

[మార్చు]

2020 నుండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియా గేట్‌కు బదులుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచాడు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద కొత్త అమర జవాన్ జ్యోతిని ప్రారంభించాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో పాటు, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో పాటు కొంత మంది ప్రముఖులు స్మారక చిహ్నాన్ని సందర్శించడం, నివాళులు అర్పించడం చేస్తున్నారు. 2022 జనవరి 21 న అమర జవాన్ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ లో కలపనున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించాడు.[7]

నిర్మాణం

[మార్చు]

ఇండియా గేట్ కింద, 1971లో

[మార్చు]

అమర జవాన్ జ్యోతి న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద ఇండియా గేట్ కింద ఉంది. ఇది సమాధితో కూడిన పాలరాతి పీఠాన్ని కలిగి ఉంటుంది. "అమర జవాన్" (అమర సైనికుడు) అనే పదం సమాధికి నాలుగు వైపులా బంగారంతో వ్రాయబడింది. పైభాగంలో, L1A1 స్వీయ-లోడింగ్ రైఫిల్ దాని బారెల్‌పై ఉంచబడి, సైనికుడి హెల్మెట్‌ ను కలిగి ఉంటుంది.[8]

పీఠంకు నాలుగు వైపులా కలశాలను కలిగి ఉంది, అందులో ఒకటి 1971 నుండి నిరంతరం మండుతూనే ఉంది (CNGని ఉపయోగించడం ద్వారా). మండుతున్న జ్వాల నిర్వహణ బాధ్యత కలిగిన సిబ్బంది నిత్యం మండే మంట పక్కనే ఆర్చ్ కింద ఉన్న గదిలో ఉంటారు. 1971 నుండి 2006 వరకు, LPG ఇంధన వనరుగా ఉపయోగించబడింది. 2006 నుండి, CNG ఉపయోగించబడుతుంది. నాలుగు కలశాలలో ప్రతి ఒక్కటి ఒక మంటను కలిగి ఉంటుంది, అయితే నాలుగు జ్వాలలో ఒకటి మాత్రమే సంవత్సరం పొడవునా మండుతుంది. భారత స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవాలలో, అన్ని జ్వాలలు వెలిగిస్తారు.[9][9]

జాతీయ యుద్ధ స్మారకం

[మార్చు]

అమర జవాన్ జ్యోతి పక్కనే జాతీయ యుద్ధ స్మారకం అమర్ చక్ర కూడా ఉంది. మెమోరియల్‌లో నాలుగు కేంద్రీకృత వృత్తాలు, సెంట్రల్ ఒబెలిస్క్ ఉన్నాయి, దాని దిగువన అమర సైనికుడిని (అమర్ జవాన్) సూచించే 'శాశ్వత జ్వాల' ఉంటుంది. పీఠం నాలుగు కలశాలతో ఉంటుంది, దీనిలో ప్రారంభోత్సవం నుండి నిరంతరం మంటలు మండుతూనే ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవంతో సహా జాతీయ దినాలలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఈ స్మారకాన్ని సందర్శిస్తారు. ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా సంబంధిత సేవా దినాలలో స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు, స్వాతంత్ర్యం తర్వాత, వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తారు.[7]

21 జనవరి, 2022న, 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర జవాన్‌ జ్యోతిలోని కొంత భాగాన్ని 25,942 మంది అమరులైన జవాన్ల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నందున జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో ఎయిర్ మార్షల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి బలభద్ర రాధాకృష్ణ విలీనం చేసారు.[10][11]

ప్రాముఖ్యత

[మార్చు]

1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం తర్వాత అమర జవాన్ జ్యోతి, ఆ సంఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మారకార్థం నిర్మించబడింది, దాని ఫలితంగా స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. మండుతున్న జ్వాల అమరత్వంగా పరిగణించబడుతుంది.[4]

స్వాతంత్య్రానంతర యుద్ధాలలో అమరవీరులైన సైనికుల పేర్లన్నీ సువర్ణాక్షరాలతో యుద్ధ స్మారక చిహ్నం వద్ద జతచేయబడినప్పుడు ఇది మరింత విస్తృతమైంది. అమర చక్ర వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతి ఇప్పుడు పౌరులు కేంద్రీకృత త్యాగచక్ర వద్ద మరణించిన సైనికుల పేర్లను చదవడం ద్వారా వారిని స్మరించుకునే, నివాళులర్పించే ప్రదేశంగా మారింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "The India Gate". thedivineindia.com. Retrieved 4 January 2017.
  2. "India-Pakistan 1971 war". The Indian Express. Retrieved 4 January 2017.
  3. 3.0 3.1 3.2 "Amar Jyoti". discoveredindia.com. Archived from the original on 4 జనవరి 2017. Retrieved 4 January 2017.
  4. 4.0 4.1 4.2 "Amar Jawan Jyoti". indiagate.org.in. Archived from the original on 9 జనవరి 2017. Retrieved 4 January 2017.
  5. 5.0 5.1 "Significance of Amar Jawan Jyoti". indiagate.org.in. Archived from the original on 30 ఏప్రిల్ 2017. Retrieved 4 January 2017.
  6. "History". indiagate.org.in. Archived from the original on 16 డిసెంబరు 2016. Retrieved 4 January 2017.
  7. 7.0 7.1 "Not Amar Jawan Jyoti, Republic Day wreath-laying ceremony at National War Memorial from this year". India Today (in ఇంగ్లీష్). January 23, 2020. Retrieved 2020-12-14.
  8. "Keeper of the flame". The Indian Express. Retrieved 4 January 2017.
  9. 9.0 9.1 "5 things about Amar Jawan Jyoti". thebetterindia.com. Retrieved 4 January 2017.
  10. "Amar Jawan Jyoti: అమర్‌ జవాన్‌ జ్యోతిని ఆర్పివేయట్లేదు.. కేంద్రం స్పష్టత". EENADU. Retrieved 2022-01-21.
  11. "దిగ్విజయంగా విలీన ఘట్టం.. జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో అమర్ జవాన్ జ్యోతి". Samayam Telugu. Retrieved 2022-01-22.