అమల్దా లిజ్
అమల్దా లిజ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | మోడల్, నటి, టెలివిజన్ వాఖ్యాత |
అమల్దా లిజ్ (ఆంగ్లం: Amalda Liz) భారతీయ మోడల్, టెలివిజన్ యాంకర్, సినిమా నటి. మలయాళ సినిమారంగానికి చెందిన ఆమె 2016లో వచ్చిన కమ్మట్టి పాదం చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆమె సి యు సూన్ (2020), 9 (2019), అండర్ వరల్డ్ (2019), ట్రాన్స్ (2020), తులసి, ఒట్టు (2022) చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.
మమ్ముట్టి కథానాయకుడుగా జనవరి 2024లో తెరకెక్కుతున్న భ్రమయుగం చిత్రంలో ఆమె స్త్రీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ఏకకాలంలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]వాయనాడ్‌లో జన్మించిన ఆమె, భరతనాట్యంలో నైపుణ్యం కలిగిన శాస్త్రీయ నృత్యకారిణి. ఆమె మిస్ కేరళ 2009 అందాల పోటీలో పాల్గొని మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఇంజినీరింగ్ డిగ్రీలో ఉండగా ఈ పోటీలో పాల్గొన్న ఆమె ఫైనల్ చేరుకుని మిస్ బ్యూటిఫుల్ హెయిర్ అవార్డును గెలుచుకుంది. అలాగే, ఆమె సౌత్ ఇండియన్ మోడల్‌కు అగ్ర పోటీదారుగా నలిచింది. సౌత్ ఇండియన్ హంట్ 2010లో మిస్ కాన్ఫిడెంట్ ఫేస్ కిరీటాన్ని పొందింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- తులసి (మలయాళ షార్ట్ ఫిల్మ్)
- కమ్మట్టి పాదం (2016)
- 9 (2019)
- అండర్ వరల్డ్ (2019)
- ట్రాన్స్ (2020)
- సీ యూ సూన్ (2020)
- ఒట్టు (2022)
- సులైఖా మంజిల్ (2023)
- బ్రహ్మయుగం (పాన్ ఇండియా సినిమాగా నిర్మాణంలో ఉంది)
మూలాలు
[మార్చు]- ↑ "సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్! | Malayalam Star Mammootty New Movie Bramayugam Poster Goes Viral On Social Media, Deets Inside - Sakshi". web.archive.org. 2024-01-12. Archived from the original on 2024-01-12. Retrieved 2024-01-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)