Jump to content

అమిత నంగియా

వికీపీడియా నుండి
అమిత బన్సల్ నంగియా
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
జీవిత భాగస్వామిసంజయ్ బన్సాల్

అమిత నంగియా బాలీవుడ్‌కు చెందిన భారతీయ టెలీవిజన్ నటి.[1] 1993లో జీ టీవిలో ప్రసారమైన దారావహిక తారా సీజన్ 2లో షీనా కుమార్తె శ్రేయ పాత్రను పోషించిన ఆమె మంచి ప్రజాదరణ పొందింది. ఆమె పురాణీ హవేలీ, కాలేజ్ గర్ల్ వంటి బాలీవుడ్ హారర్ సినిమాలలో కూడా నటించింది. ఆమె ఇండియన్ మిస్టరీ, థ్రిల్లర్ షో కాల భైరవ రహస్యలో మాంత్రికురాలుగా నటించింది. స్వీటీ మాధుర్‌, రాఖీ విజ్జన్ లతో కలిసి ఆమె నటించిన టెలీసీరియల్ హమ్ పాంచ్‌లో రాధిక పాత్రతో కూడా ఆమె పేరు తెచ్చుకుంది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
పురాణి హవేలీ (1989)
కాలేజీ గర్ల్ (1990)
పథర్ కే ఇన్సాన్ (1990)
పాప్ కి కమయీ (1990)
బాఘీ (1990)
జీవన్ దాతా (1991)
సౌగంధ్ (1991)
అఫ్సానా ప్యార్ కా (1991)
ప్రతిజ్ఞాబాద్ (1991)
రణభూమి (1991)
ప్రతీకర్ (1991)
పోలీస్ మత్తు దాదా (1991)
రూపాయే దస్ కరోడ్ (1991)
జుల్మ్ కి హుకుమత్ (1992)
ఘర్ జమై (1992)
గీతాంజలి (1993)
హమ్ హై కమాల్ కే (1993)
రాజా (1995)
అజ్నబీ (2001)
చుప్ చుప్ కే (2006)
భాగమ్ భాగ్ (2006)
ఖట్టా మీఠా (2010)
రాజనందిని (2021)

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర ఛానల్ నోట్స్
1994 తెహ్కీకాట్ అంజలి రావు డిడి నేషనల్ ఎపిసోడ్ 1,2,3
అజ్నబీ డిడి మెట్రో
1995 హమ్ పాంచ్ రాధిక మాధుర్ జీ టీవీ కేవలం సీజన్ 1 ఆమె స్థానంలో నటి విద్యాబాలన్ వచ్చింది
2001 ఆనే వాలా పాల్ డిడి మెట్రో
2009 ఝాన్సీ కీ రాణి లచ్చోబాయి జీ టీవీ పునరావృత పాత్ర
2012-13 సుకన్య హమారీ బేటియా శకుంతల డిడి నేషనల్
2020- ఆనే వాలా పాల్ డిడి నేషనల్

మూలాలు

[మార్చు]
  1. "A different shade of beauty". The Hindu. October 2, 2013.