Jump to content

అమెనోరియా

వికీపీడియా నుండి
అమెనోరియా
ప్రత్యేకతగైనకాలజీ
లక్షణాలుపునరుత్పత్తి వయస్సుకు చేరుకున్న స్త్రీలో ఋతుకాలం సక్రమం గా లేకపోవడం
రకాలుప్రాధమిక అమెనోరియా, ద్వితీయ అమెనోరియా.
కారణాలుహార్మోన్ల అసమతుల్యత లేదా శరీర నిర్మాణ సంబంధ అసాధారణత
రోగనిర్ధారణ పద్ధతిగర్భం పరీక్ష,కటి అల్ట్రాసౌండ్, థైరాయిడ్ పరీక్షలు,MRI స్కాన్
చికిత్సబరువు తగ్గడం, వ్యాయామం
ఔషధంమెట్‌ఫార్మిన్, స్పిరోనోలాక్టోన్ యాంటీ-ఆండ్రోజెన్ మందులు , గర్భనిరోధక మాత్రలు

అమెనోరియా అంటే పునరుత్పత్తి వయస్సుకు చేరుకున్న స్త్రీలో ఋతు కాలం లేకపోవడం అనే శరీర స్థితి. సాధారణంగా అమెనోరియా శారీరక పరిస్థితులు స్త్రీ గర్భం ధరించినప్పుడు, చనుబాలిచ్చే (బిడ్డకు పాలు పట్టే) సమయంలో కనిపిస్తాయి. బాల్యంలో, రుతువిరతి (పునరుత్పత్తి వయస్సు తరువాత, అంటే మెనోపాజ్), తరువాత రుతుక్రమం ఉండదు.[1] అమెనోరియా అనేది సాధారణంగా ఒక లక్షణం. అనేక సంభావ్య కారణాలుంటాయి.[2]

రకాలు

[మార్చు]

అమెనోరియాను రెండు రకాలుగా వర్గీకరించారు - ప్రాధమిక అమెనోరియా ఇంకా ద్వితీయ అమెనోరియా.

ప్రాథమిక అమెనోరియాలో 13 సంవత్సరాల వయస్సులో తుక్రమం మొదలవకపోవడం ఇంకా 15 సంవత్సరాల వయస్సులో కూడా లేకపోవడం అని నిర్వచిస్తారు.[3] ఇటువంటి పరిస్థితి పుట్టుకతో గర్భాశయం లేకపోవడం, అండాశయం గుడ్డు కణాలను స్వీకరించలేకపోవడం లేదా నిర్వహించడంలో వైఫల్యం లేదా యుక్తవయస్సు ఏర్పడడము, అభివృద్ధిలో ఆలస్యం వంటి సమస్యల వల్ల సంభవించవచ్చు.[4]

ద్వితీయ అమెనోరియాను ఋతుక్రమం ఏర్పడిన తర్వాత ఆవర్తనాలు (సైకిల్స్) నిలచి పోవడం, గతంలో సాధారణ రుతుస్రావం ఉన్న మహిళలో మూడు నెలలు వరుసగా ఋతుక్రమం లేకపోవడం లేదా ఒలిగోమెనోరియా (అంటే సాధారణంగా రుతుక్రమం సక్రమంగా ఉన్న మహిళలకు ఆరు నెలలకు కూడా ఋతుక్రమం లేకపోవడం) అని నిర్వచించారు.[3] ఇది తరచుగా హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథి నుండి ఏర్పడే హార్మోన్ల హెచ్చు తగ్గులు, అకాల రుతువిరతి, గర్భాశయాంతర మచ్చ ఏర్పడటం లేదా ఆహారం తీసుకొనే విధానం వలన ఏర్పడే రుగ్మతల వల్ల సంభవిస్తుంది.[5][6][7]

హార్మోన్ల అసమతుల్యత

[మార్చు]

అమెనోరియాకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, చివరికి, హార్మోన్ల అసమతుల్యత లేదా శరీర నిర్మాణ సంబంధ అసాధారణత ఫలితంగా ఏర్పడుతుంటుంది .[8]

శారీరకంగా, హైపోథాలమస్ నుండి గోనాడోట్రోపిన్-విడుదల చేసే హార్మోన్ (GnRH) ద్వారా ఋతుస్రావం నియంత్రించబడుతుంది. ఇది (GnRH) ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH), లూటినైజింగ్ హార్మోన్ (LH) ల విడుదలను ప్రేరేపించడానికి పిట్యూటరీపై పనిచేస్తుంది. FSH ఇంకా LH ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి అండాశయాలపై పని చేస్తాయి, ఇవి వరుసగా ఋతు చక్రం విస్తరణ, ఋతుస్రావం దశలను నియంత్రిస్తాయి. పిట్యూటరీ గ్రంథి నుండి ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్ విడుదలను అణిచివేసేందుకు ప్రోలాక్టిన్ ఋతుచక్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా, థైరాయిడ్ హార్మోన్ కూడా ఋతు చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. తక్కువ స్థాయిలో థైరాయిడ్ హార్మోన్ హైపోథాలమస్ నుండి TRH విడుదలను ప్రేరేపిస్తుంది, ఇది TSH, ప్రోలాక్టిన్ విడుదల రెండింటినీ పెంచుతుంది. ప్రోలాక్టిన్‌ పెరుగుదల LH, FSH విడుదలను అణిచివేస్తుంది. ఈ హైపోథాలమిక్-పిట్యూటరీ-అండాశయ అక్షానికి అంతరాయం కలిగించే ఏపరిస్థితి వలనేనా అమెనోరియా సంభవించవచ్చును అని తెలుస్తోంది , అది హార్మోన్ల అసమతుల్యత వల్ల కావచ్చు లేదా హైపోథాలమిక్-పిట్యూటరీ-అండాశయ అక్షానికి ఏర్పడ్డ అంతరాయం వల్ల కావచ్చు.

రోగ నిర్ధారణ

[మార్చు]

ప్రాధమిక అమెనోరియా మాదిరిగానే, ద్వితీయ అమెనోరియాను కూడా గర్భం పరీక్ష, ప్రోలాక్టిన్, FSH, LH TSH స్థాయిలతో ప్రారంభమవుతుంది. కటి అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు. అసాధారణ TSH ఉంటే పూర్తి థైరాయిడ్ పరీక్షలు చేయించాలి.[9] అసాధారణ ప్రోలాక్టిన్ పరీక్షకు MRI స్కాన్ అనుసరించాలి.[10][9] LH, FSH విలువలు పెరిగినట్లయితే, రుతువిరతి లేదా ప్రాధమిక అండాశయ లోపంగా పరిగణించాలి.[9] FSH, LH సాధారణ లేదా తక్కువ స్థాయిలో ఉంటే రోగి చరిత్ర, శారీరక పరీక్షఅవసరమవుతుంది. ముఖం మీద వెంట్రుకలు లేదా మోటిమలు వంటి అదనపు ఆండ్రోజెన్ల లక్షణాలుంటే టెస్టోస్టెరాన్, DHEA-S, 17-హైడ్రాక్సీ ప్రొజెస్టెరాన్ స్థాయిల వివరాలు కూడా పొందాలి. పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్ ప్లాసియా (అంటే సాధారణ కణజాలం లేదా అవయవంలో అధిక కణ ఉత్పత్తి ఉండే లక్షణం) స్థితిలో 17-హైడ్రాక్సీ ప్రొజెస్టెరాన్ పెరుగుతుంది. పెరిగిన టెస్టోస్టెరాన్, అమెనోరియాలు PCOS ను సూచించవచ్చు.[9][11] అండాశయ లేదా అడ్రినల్ కణితులలో ఎక్కువ ఆండ్రోజెన్లు కూడా ఉండవచ్చు, కాబట్టి ఈ విషయం నిర్ధారించడానికి అదనపు ఇమేజింగ్ కూడా అవసరం అవుతుంది.[9] రోగుల చరిత్ర పరిశీలించినప్పుడు క్రమరహితంగా తినడం లేదా అధిక వ్యాయామం వంటివి హైపోథాలమిక్ అమెనోరియాకు సంకేతాలుగా భావించాలి. [12] తలనొప్పి, వాంతులు, దృష్టి మార్పులు ఉంటే అవి కణితి ఉండడానికి సంకేతాలు కావచ్చు. MRIతో అంచనా వేయడం కూడా అవసరం.[9] చివరగా, రోగి చరిత్ర హిస్టెరోస్కోపీ లేదా ప్రొజెస్టెరాన్ ఉపసంహరణ ఉన్నప్పుడు రక్తస్రావ పరీక్షతో అషెర్మాన్ సిండ్రోమ్ (అంటే గర్భాశయం లేదా గర్భాశయం లోపల మచ్చ కణజాలం ఏర్పడినప్పుడు ఉండే గర్భాశయ పరిస్థితి) ని కూడా అంచనా వేయవలసి వస్తుంది.[9][13]

చికిత్స

[మార్చు]

అమెనోరియా చికిత్స అంతర్లీన పరిస్థితి ఆధారంగా మారుతుంది .[1] చికిత్స, వలన , ఋతుస్రావం పునరుద్ధరించడమే కాకుండా, అమెనోరియా అంతర్లీన కారణంతో సంబంధం ఉన్న అదనపు సమస్యలను నివారిస్తుంది.[3]

PCOSకి ప్రస్తుతం ఖచ్చితమైన చికిత్స లేనప్పటికీ, రోగులలో అండోత్సర్గాన్ని పునరుద్ధరించడానికి వివిధ ప్రక్రియలు ఉపయోగిస్తారు. PCOS ఉన్న రోగులలో ఆండ్రోజెన్ స్థాయిలు సాధారణ స్థాయికి రావడము, అండోత్సర్గము తిరిగి రావడం మొదలగు లక్షణాలుకు బరువు తగ్గడం, వ్యాయామం వంటి వాటితో సంబంధం ఉంటుందని భావిస్తారు.

PCOS ఉన్న రోగులలో ఋతుకాలంను క్రమబద్ధీకరించడానికి మెట్‌ఫార్మిన్ మందు ప్రభావం ఇటీవల అధ్యయనం చేశారు. స్పిరోనోలాక్టోన్ వంటి యాంటీ-ఆండ్రోజెన్ మందులు, శరీర ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గించడానికి, ఋతుస్రావం పునరుద్ధరించడానికి కూడా ఉపయోగించుతారు. PCOS కారణంగా ద్వితీయ అమెనోరియా ఉన్న రోగులకు ఋతు చక్రం క్రమబద్ధీకరించడానికి నోటి గర్భనిరోధక మాత్రలు కూడా తరచుగా సూచించుతారు. అయితే దీని కారణం అండోత్సర్గము అణచివేత.

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 "Amenorrhea". nichd.nih.gov/ (in ఇంగ్లీష్). 31 January 2017. Retrieved 2018-11-07.
  2. "Who is at risk of amenorrhea?". nichd.nih.gov/. 31 January 2017. Retrieved 2018-11-08.
  3. 3.0 3.1 3.2 Master-Hunter T, Heiman DL (April 2006). "Amenorrhea: evaluation and treatment". American Family Physician. 73 (8): 1374–82. PMID 16669559. Archived from the original on 2008-07-23.
  4. "Absent menstrual periods - primary: MedlinePlus Medical Encyclopedia". medlineplus.gov (in ఇంగ్లీష్). Retrieved 2018-11-07.
  5. Fitzpatrick, Kathleen Kara; Lock, James (2011-04-11). "Anorexia nervosa". BMJ Clinical Evidence. 2011: 1011. ISSN 1752-8526. PMC 3275304. PMID 21481284.
  6. Broome, J. D.; Vancaillie, T. G. (June 1999). "Fluoroscopically guided hysteroscopic division of adhesions in severe Asherman syndrome". Obstetrics and Gynecology. 93 (6): 1041–1043. doi:10.1016/s0029-7844(99)00245-8. ISSN 0029-7844. PMID 10362178.
  7. Gordon, Catherine M. (2010-07-22). "Clinical practice. Functional hypothalamic amenorrhea". The New England Journal of Medicine. 363 (4): 365–371. doi:10.1056/NEJMcp0912024. ISSN 1533-4406. PMID 20660404.
  8. Nawaz, Gul; Rogol, Alan D. (2022), "Amenorrhea", StatPearls, Treasure Island (FL): StatPearls Publishing, PMID 29489290, retrieved 2022-02-17
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 Klein, David A.; Poth, Merrily A. (2013-06-01). "Amenorrhea: an approach to diagnosis and management". American Family Physician. 87 (11): 781–788. ISSN 1532-0650. PMID 23939500.
  10. Wang, Amy T.; Mullan, Rebecca J.; Lane, Melanie A.; Hazem, Ahmad; Prasad, Chaithra; Gathaiya, Nicola W.; Fernández-Balsells, M. Mercè; Bagatto, Amy; Coto-Yglesias, Fernando; Carey, Jantey; Elraiyah, Tarig A. (2012-07-24). "Treatment of hyperprolactinemia: a systematic review and meta-analysis". Systematic Reviews. 1: 33. doi:10.1186/2046-4053-1-33. ISSN 2046-4053. PMC 3483691. PMID 22828169.
  11. (2017). "An International Consortium Update: Pathophysiology, Diagnosis, and Treatment of Polycystic Ovarian Syndrome in Adolescence".
  12. Sophie Gibson, Marie Eve; Fleming, Nathalie; Zuijdwijk, Caroline; Dumont, Tania (2020-02-06). "Where Have the Periods Gone? The Evaluation and Management of Functional Hypothalamic Amenorrhea". Journal of Clinical Research in Pediatric Endocrinology. 12 (Suppl 1): 18–27. doi:10.4274/jcrpe.galenos.2019.2019.S0178. ISSN 1308-5735. PMC 7053439. PMID 32041389.
  13. (November 2008). "Current evaluation of amenorrhea".