అమేలి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Amélie
దర్శకత్వంజీన్‌ పియర్‌
స్క్రీన్ ప్లేగిలియమ్ లారెన్
కథ
 • గిలియమ్ లారెన్
 • జీన్‌ పియర్‌
నిర్మాత
 • జీన్-మార్క్ డెస్ఛాంప్స్
 • క్లాడీ ఓస్సార్డ్
తారాగణం
 • ఆడ్రీ టాటౌ
 • మాథ్యూ కస్సోవిట్జ్
Narrated byఆండ్రీ డస్యోలియర్
ఛాయాగ్రహణంబ్రూనో డెల్బన్నల్
కూర్పుహెర్వ్ స్చ్నైడ్
సంగీతంయన్ టైర్సెన్
పంపిణీదార్లుయుజిసి ఫాక్స్ డిస్ట్రిబ్యూషన్
విడుదల తేదీs
25 ఏప్రిల్ 2001 (2001-04-25)(ఫ్రాన్స్)
16 ఆగస్టు 2001 (జర్మనీ)
సినిమా నిడివి
123 నిముషాలు[1]
దేశాలు
భాషఫ్రెంచి భాష
బడ్జెట్$10 మిలియన్[2]
బాక్సాఫీసు$174.2 మిలియన్[2]

అమేలి 2001వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ రొమాంటిక్‌ కామెడీ చిత్రం. జీన్‌ పియర్‌ దర్శకత్వంలో అమేలి పాత్రలో ఆడ్రీ టాటౌ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ స్ర్కీన్ ప్లే, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ మ్యూజిక్‌, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది.

చిన్నతనంలోనే కన్నతల్లిని కోల్పోయి, అత్యంత అసాధారణ మనుషుల మధ్య పెరిగిన అమ్మాయి చివరికి తన జీవితంలో ఆనందం ఎలా పొందిందన్నదే ఈ చిత్ర కథ. అమేలి పాత్ర ప్రధానంగా ఉన్న ఈ చిత్రంలో ఒక అమ్మాయి తన కలలు కన్న ప్రపంచం కోసం చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంతరించుకున్న కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌ నిలవడంతోపాటూ , అమేలి పాత్రలో ఆడ్రీ టాటౌ నటన ఆకట్టుకుంది. తను చేసిందే సరైనదనుకునే మనస్తత్వం గల అమ్మాయైన అమేలి తన నాన్న కారణంగా అణచివేయబడి, నెగటివ్‌ దృక్పథాన్ని ఏర్పర్చుకుంటుంది. తనకు నచ్చినట్లు ఉండాలని, ప్రేమతో కూడిన ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవించాలని కలలు కంటూ, ప్రేమ కోసం ఆరాటపడిన అమేలి తను ఊహించుకున్న అద్భుతమైన లోకం దొరక్కపోవడంతో అమేలి ఏం చేసిందనేది చిత్రకథ.[3]

నటవర్గం

[మార్చు]
మోంట్మార్టేలో అమేలీ పనిచేసిన కేఫ్ డెస్ 2 మౌలిన్
 • ఆడ్రీ టాటౌ
 • ఫ్లోరా గైట్
 • మాథ్యూ కస్సోవిట్జ్
 • అమౌరీ బాబుల్ట్
 • రూఫస్
 • సెర్గె మెర్లిన్
 • లోరెల్లా క్రావొట్ట
 • క్లాటిల్డే మొల్లెట్
 • క్లైరే మౌరియర్
 • ఇసబెల్లె నాంటీ
 • డొమినిక్ పానన్
 • పెంటెర్న్ యొక్క ఆర్టుస్
 • యోలాండె మొరెయు
 • అర్బన్ క్యాన్సర్
 • జమేల్ డబ్బాజ్
 • మారిస్ బెనిచౌ
 • కెవిన్ ఫెర్నాండెజ్
 • మిచెల్ రాబిన్
 • ఆండ్రే దమెంట్
 • క్లాడ్ పెరోన్
 • అర్మెల్లి
 • టిక్కీ హోల్గోడో
 • ఫాబియన్ చౌదత్
 • ఫ్రాంక్-ఆలివర్ బోనెట్
 • అలైన్ ఫ్లోరెట్
 • జీన్-పాల్ బ్రిస్సార్ట్
 • ఫ్రెడెరిక్ మిట్ట్రాండ్

సాంకేతికవర్గం

[మార్చు]
పారిస్ ర్యూ డెస్ ట్రోస్ ఫ్రైర్స్ లోని బ్యూట్ మార్కెట్ ను మాన్స్యూర్ కొల్లింగొన్ దుకాణంకోసం ఉపయోగించబడింది
 • దర్శకత్వం: జీన్‌ పియర్‌
 • నిర్మాత: జీన్-మార్క్ డెస్ఛాంప్స్, క్లాడీ ఓస్సార్డ్
 • స్క్రీన్ ప్లే: గిలియమ్ లారెన్
 • కథ: గిలియమ్ లారెన్, జీన్‌ పియర్‌
 • వ్యాఖ్యానం: ఆండ్రీ డస్యోలియర్
 • సంగీతం: యన్ టైర్సెన్
 • ఛాయాగ్రహణం: బ్రూనో డెల్బన్నల్
 • కూర్పు: హెర్వ్ స్చ్నైడ్
 • నిర్మాణ సంస్థ: కెనాల్ +, ఫ్రాన్స్ 3 సినిమా, యుజిసి ఫాక్స్ డిస్ట్రిబ్యూషన్
 • పంపిణీదారు: యుజిసి ఫాక్స్ డిస్ట్రిబ్యూషన్

మూలాలు

[మార్చు]
 1. "AMELIE FROM MONTMARTRE (LE FABULEUX DESTIN D'AMELIE POULAIN) (15)". British Board of Film Classification. 2001-07-17. Archived from the original on 2013-09-27. Retrieved 3 September 2018.
 2. 2.0 2.1 "Amélie (2001)". The Numbers (website). IMDb. Retrieved 3 September 2018.
 3. నవతెలంగాణ (18 September 2017). "అబ్బురపరచే ఫ్రెంచ్‌ చిత్రాలు". Archived from the original on 3 September 2018. Retrieved 3 September 2018.

ఇతర లంకెలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.