Coordinates: 17°16′N 78°23′E / 17.26°N 78.38°E / 17.26; 78.38

అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి is located in Telangana
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి
తెలంగాణ లో ఉనికి
భౌగోళికాంశాలు :17°16′N 78°23′E / 17.26°N 78.38°E / 17.26; 78.38
పేరు
ప్రధాన పేరు :అమ్మపల్లి సీతారామచంద్రస్వామి
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:రంగారెడ్డి జిల్లా
ప్రదేశం:శంషాబాద్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సీతారామచంద్రస్వామి
ప్రధాన దేవత:సీత
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి, శివరాత్రి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:13వ శతాబ్దం
సృష్టికర్త:వేంగీ చాళుక్యులు

అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాద్‌ కు సమీపంలోని శంషాబాద్ మండలంలో వున్న పురాతన దేవాలయం. దీనిని 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మవారు కొలువై వున్న కారణంగానే ఈ ఊరికి 'అమ్మపల్లి' అనే పేరు వచ్చిందని చెపుతారు.

పురాతన ఆలయం[మార్చు]

ఆలయ ప్రాంగణలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ గుడికి రెండు నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు.

సీతారామలక్ష్మణుల ప్రతిమలు శిలా మకరతోరణాలను కలిగివుండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమంటపంలో 'కూర్మం' (తాబేలు) ఏర్పాటు చేయబడి వుండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు.

ఎత్తయిన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు, ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మంటపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం. వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయం నిర్మాణం జరిగివుంటుందని అనిపిస్తుంది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువై వుండగా, వారికి ఎదురుగా ముఖమంటపంలో హనుమంతుడు నెలవై ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తుంటాడు.

మోక్ష ప్రదాయిని[మార్చు]

సీతారామలక్ష్మణుల ప్రతిమలు శిలా మకరతోరణాలను కలిగివుండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమంటపంలో 'కూర్మం' (తాబేలు) ఏర్పాటు చేయబడి వుండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు.

సినిమా షూటింగులకు ప్రత్యేక ఆకర్షణ[మార్చు]

ఆలయం భక్తులనే కాకుండా సినీప్రముఖులను ఆకట్టుకుంటోంది. ఈ గుడి సినిమావారికి ఓ సెంటిమెంట్‌గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. భారీ బడ్జెట్ సినిమాల కీలక సన్నివేషాలను ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహరీ కూలడంతో అప్పటినుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పురావస్తు ప్రత్యేకతలున్నాయి[మార్చు]

2010లో పురావస్తు శాఖాధికారులు అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించి దీనికెంతో ప్రాధాన్యం ఉందని, అవి పురాతన కట్టడాలని తేల్చి చెప్పారు. గోపురం, చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడి స్థల నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు. మున్ముందు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత ఆధునీకరిస్తామన్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి విగ్రహాలు వెయ్యి సంవత్సరాల కిందటివని గుర్తించారు. ఏకశిలతో విగ్రహాలు ఉండడం చాలా అరుదని వారు స్పష్టం చేశారు.ః

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]