అమ్మమ్మ చదువు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మమ్మ చదువు
అమ్మమ్మ చదువు
కృతికర్త: సుధామూర్తి
అనువాదకులు: ద్వారక
ముద్రణల సంఖ్య: ఒకటి
ముఖచిత్ర కళాకారుడు: చంద్ర, హైదరాబాద్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కథలు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: అలకనంద పబ్లికేషన్స్
విడుదల:
ప్రచురణ మాధ్యమం: తెలుగు సాహిత్యము
పేజీలు: 167
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 81-8294-006-0


అమ్మమ్మ చదువు సుధామూర్తి రాసిన కథల పుస్తకం.[1] సుధామూర్తి ఇన్పోసిస్ అధినేత ఎన్.ఆర్. నారాయణ మూర్తి భార్య. ఆమె కథలు చెప్పడం అంత సులబం కాదు. అంటూనే అతి సునాయాసంగా అతి మంచి కథలను చెప్పారు. . వీటిని కథలు అనడం కన్నా రచయిత జీవిత పాఠాలు అని అంటే ఇంకా బాగుంటుంది. ఇందులో వున్న కథలన్నీ రచయిత అనుభవాలే. ఈ కథలు అనేక భాషలలో అనువదించ బడ్డాయి. ఈ పుస్తకం ఆంగ్ల మూలానికి తెలుగు అనువాదం. ఇందులోఅమ్మమ్మ చదువు అనే కథతో పాటు 35 కథలున్నాయి.

అభిప్రాయాలు[2]

[మార్చు]
  • సలలితంగా సందేశం...కల్పిత కథానికలు కావు, స్వీయానుభవాల నుంచి జాలువారిన ముత్యాల సరాలు. - ఇండియా టుడే
  • జీవితంలో తాను స్వయంగా ఎదుర్కొన్న అనేకానేక సమస్యలకు అనుభవపూర్వకంగా నిర్మాణాత్మక సమాధానాలు సూచించే కథల్లాంటి రచనలు ఇవి. ఈ ఆత్మకథాత్మక కథనాలలో మనావతా పరిమళాలు గుబాళిస్తాయి. - ప్రజాసాహితి

మూలాలు

[మార్చు]
  1. "వే వెలుగుల దీపవృక్షాలు". www.teluguvelugu.in. Retrieved 2020-08-18.[permanent dead link]
  2. "Ammamma Chaduvu - అమ్మమ్మ చదువు by Sudha Murthy - Ammamma Chaduvu". anand books (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-28. Retrieved 2020-08-18.