అరకువ్యాలీ కాఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరకువ్యాలీ కాఫీ

అరకు వ్యాలీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు వేలాది ఎకరాల్లో సాగుచేసే కాపీ.[1]

విశేషాలు[మార్చు]

అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజనుల నుంచి కాఫీ గింజలను జిసిసి కొనుగోలు చేసి మార్కెట్లో గింజలు గాను, కాఫీ పొడి రూపంలోనూ విక్రయిస్తుంది. గిరిజనులు కాఫీని సేంద్రీయ పద్ధతుల్లో పండించడానికి తోడు ఇక్కడి మట్టి లక్షణాలతో కాఫీ మంచి సువాసన, రుచి కలిగి వుంటుంది. ఈ ప్రాంతంలో పండే అరబికా కాఫీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాఫీ సాగు పర్యావరణ పరిరక్షణ, సమతుల్యతతో పాటు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది జిసిసి ఫిల్టర్ కాఫీని అరకు వ్యాలీ & వైశాఖి ఫిల్టర్ కాఫీ బ్రాండ్ పేరుతో నాలుగు రకాలలో ప్రాసెస్ చేసి వివిధ సైజులలో డబ్బాలు, ప్యాకెట్లలో మార్కెటింగ్ చేస్తుంది. ఇంకా జిసిసి అరబికా హాట్ పేరుతొ ప్రత్యేకంగా విశాఖ, హైదరాబాదు నగరాలతో పాటు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కాఫీ షాపులను నడుపుతుంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్న కాఫీ గింజలు, మిరియాలకు భారత వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) 2023 మేలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేసింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Andhra Pradesh's Araku Valley Coffee gets organic certificate". The Hindu (in ఇంగ్లీష్). 2023-05-25. ISSN 0971-751X. Retrieved 2023-06-29.