అరటి కుటుంబము
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
1'అరటి. అరటి చెట్టు ప్రకాండము భూమిలోపలనే వుండును. మనకు మాను అని అనుకొనునది..... దీర్ఘముగాను దట్టంగాను నున్న ఆకుల తొడిమలోక దానినొకటి చుట్టు కొనుటచే ఏర్పడు చున్నకాండము. భూమిలోపల నున్న ప్రకాండము మూలవహము గుల్మము.
- ఆకులు
- దీని ఆకులు పెద్దవి. కణుపు పుచ్చములుండవు. నిడివి చౌకపాకారము. లఘు పత్రము. సమాంచలము సమ రేఖ పత్రము. మర్రి ఆకు మొదలగు వాని యందున్నట్లు వీని యందు అంచు చుట్టు ఈ నేలు లేవు. అందు చేతనే గాలికి ఆకులు సులభముగా చిరిగి పోవును. ఆకులు రెండు వైపుల నున్నగా నుండును.
- పుష్పమంజరి. అరటి చెట్టు ఒక మారే పుష్పించును.
పుష్పించుటకే వృంతము పైకి వచ్చును. అదియే జంట. రెమ్మకంకి.
పువులు మిగుల పెద్దవగు చేటికల సందుల రెండు రెండు వరుసలుగా నున్నవి. పుష్పములకు నుప వృంతములు లేవు. క్రింది చేటికల సందు నున్నవి. స్త్రీపుష్పములు. మధ్య చేటికల సందులున్నవి. మిధున పుష్పములు పైనున్నవి. పురుష పుష్పములు.
పుష్ప నిచోళము. 5 దంతములు గల నొక గొట్టమున్నది. దీని కొక వైపున నిలువున జీలిక గలదు. రక్షక పత్రములు 3 ఆకర్షణ ప్త్రములు 2 గలసి ఈ గొట్టమైనదని యూహింప వచ్చును. ఈ గొట్టమునకు లోపలి వైపున విడిగా నొక ఆకర్షణ పత్రము గలదు. వానికి రంగంతగా లేదు ఉచ్చము.
- కింజల్కములు
- 5 విడిగా నున్న ఆకర్షణ పత్రముచే నావరింప బడి యున్నవి. దీని కెదిరుగ నొక కింజల్కమును లేదు. పుప్పొడి తిత్తులు వెడల్పుగా నున్నవి.
- అండ కోశము
- అండాశయము నీచము. 3 గదులు కండ కాయ. అడవి కాయలందు దప్ప గింజలు లేవు. కీలము సన్నము. అడుగున రోమములతో గూడి లావుగ నున్నది. కీలాగ్రము చీలి 6 తమ్మెలుగ నున్నది.
2.మెట్ట తామర
[మార్చు]మెట్ట తామర హిందూ దేశమునందంతటను పెరుగు చున్నది.
- ప్రకాండము
- మూలవహము.
- ఆకులు
- లఘు పత్రము ఒంటరి చేరిక అండాకారము కణుపు పుచ్చములు లేవు సమ రేధ పత్ర్ము రెండు వైపుల నున్నగా నుండును కొన సస్న్నము.
- పుష్ప మంజరి
- కంకి. కంకి మీద అంగుళము అంగుళ దూరమున రెండేసి పువ్వులు గలవు వీని దగ్గర మూడేసి చేటికలు గలవు.
- పుష్ప కోశము
- 3 రక్షక పత్రములు ఉచ్చము. ఎండి పోయినను కాన నంటి పెట్టుకొని యుండును.
- దళ వలయము. ఆకర్షణ పత్రములు 3. రక్షక పత్రముల కంటే పెద్దవి గాను ఎక్కువ రంగుగాను నున్నవి. ఎర్రని రేకులన్నియు ఆకర్షణ పత్రములు గావు.
- కింజల్కములు
- దళ వలయము లోపల ఆకర్షణ పత్ర్ముల వంటివి నాలుగైదు ఉన్నాయి. ఇవియే పుష్పమున కందము దెచ్చుచున్నవి. వీనిలో నన్నిటి కంటెను లోపలగా నున్న దాని మీద మధ్యగా నొక పుప్పొడి చిత్తి గలదు. దీనిలో ఒక గది మాత్రమే ఉంది. మిగిలిన కింజల్కములు గొడ్డులై ఆకర్షణ పత్రముల వలె మారినవి.
- అండకోశము
- అండాశయము 3 గదులు నీచము కాయ బహు విదారుణ ఫలము. కీలము ప్ల్చగాను కీలాగ్రము వెడల్పుగాను నున్నది.
3.కచ్చూరము.
[మార్చు]కచ్చూరము మొక్క హిందూ దేశములో కెల్ల బంగాళ దేశమ్ందెక్కువగా గలదు.
- ప్రకండము
- సశునము. భూమి మీద నిజమైన ప్రకాండము లేదు.
- ఆకులు
- లఘు పత్రము కణుపు పుచ్ఛములు లేవు. తొడిమ గలదు బల్లెపాకారము సమాంచలము సమ రేఖ పత్రము క్రింది వైపున బిరుసుగా నున్న రోమములు గలవు. కొన సస్న్నము వేసవి కాలమందు ఆకులెండి రాలి పోవును.
- పుష్పమంజరి. కంకి. వేసవి కాలమందాకు లెండి పోయినప్పుడు బయలు వెడలును. గులాబి రంగు.
- పుష్ప కోశము
- సంయుక్తము. 8 దంతములు గలలవు. ఉచ్చము.
- దళవలయము. అడుగున గొట్టము వలె నున్నది. కంఠము లావుగా నుండును. ఆకర్షణ పత్రములును, ఆకర్షణ పత్రములుగా మారిని కింజల్కములును గలసి వెడల్పుగు రెండంచుల గరాటి వలే నైనవి. దీని పై అంచులో నిడివి చౌకముగ నున్న నెర్రని తమ్మెలు 3ను ఆకర్షణ పత్రములు.
- కింజల్కములు
- అగరాటి యొక్క పసుపు పచ్చగా నున్న 8 తమ్మెలు కింజల్కములు వీనిలో లోపలగా నున్న అతమ్మె యెక్కువపొడగుగాను నున్నది. పైనవున్న రెండు తమ్మెలకు మధ్య కింజల్కపు కాడ ఉంది. పుప్పొడి తిత్తికి రెండు గదులున్నవి. గదుల క్రింద నుండి చిన్న వాలములు గలవు.
- అండకోశము
- అండశయము నీచ్ము సంయుక్తాండాశము 3 గదులు ఒక్కొక గదిలో చాల యండములు గలవు.
- కీలము
- సన్నముగా దారము వలెనున్నది. కీలాగ్రము మూడు తమ్మెలుగ చీలి యున్నవి. ప్రతి రెమ్మె మధ్య ఒక సన్నని రంద్రము గలదు.
ఈ కుటుంబపు చెట్లలో నన్నియు గుల్మములే. వీనిలో మిక్కిలి ఎత్తుగా బెరుగునది రటి చెట్టు. సాధారణంగా వీని ప్రకాండములు మూల వహములు. అండ కోశము నీచము. 3 గదులు గలల్వు. కింజల్కములీ కుటుంబములో మూడు విధస్ములుగస్ నున్నవి . అరటి చెట్టులో వలె కొన్నిటి యందు 5, 6 కింజల్కములున్నవి. మరికొన్నిటియందు మెట్ట తామరలో నట్లు కింజల్కములన్నియు ఆకర్షణ పత్రముల వలె మారి పుప్పొడి తిత్తి యొక్క ఒక గది మాత్రము మిగులు చున్నది. అల్లము కచ్చూరము మొదలగు కొన్నిటి యందు రెండు గదులు గల యొక పుప్పొడి తిత్తి గలదు. ఈ భేదములను బట్టి అరటి కుటుంబ ఉప కుటుంబములుగా విభజింప బడింది. అరటి చెట్లు మన దేశమునందెల్ల యెడల 5, 6 వేల యడుగుల ఎత్తు ప్రదేశములందు కూడా బెరుగు చున్నవి. వీనిలో బొంత రటి, కొమ్మరటి, చెక్కర కేళి, అమృత పాణి, ఎర్ర అరటి మొదలల్గు పెక్కు ర్కములు గలవు. ఈ రకములన్నియు ఒక అడస్వి ర్కమునుండి సేద్య భేదము వలన గలిగినవి. సేద్యము చేయు రకములు దుంపల మూళముననే వ్యాపించ బడు చున్నవి. వాని పండ్ల యందు విత్తులు లేవు. గొంత అరటి దాదాపుగా అన్ని నేలలందును పెరుగును కాని8 మిగిలిన రకములు పెరుగవు. వీనికి సారవంతమగు నేలలుగా వలెను. కాన క్రొత్తగా దోటలు వేయునపుడు చెరువులో బెడ్డ దీసి తోటలలో వేసెదరు. నీలి రొట్టను బేడను నెరువుగా వేయు చో దోటలకు బలము కలుగును. అరటి చెట్లను దోటలలోనే గాక చేల గట్ల మీదకూడ పాతుదురు. చిన్న చెట్లను పాతిన యొక సంవత్సరమునకు గాపుకు వచ్చును. కెల నుండి కొన్ని కాయలు దిగిన పిదప మిగిలిన పుషములను గోసిస్ వేయుట మంచిది. ట్లు చేసించో ఆహార పదార్థములాకాయలకే సంవృద్ధిగా బోవును. కాన అవి నీరాముగా నుండస్క బాగుగ నుండును. అది గాక చివర పుష్పముల నుంచినను లాభము లేదు. అవి పురుష పుష్పములు గాన కాయలు కాయవు. అరటి చెట్టు పుష్పించి యున్నప్పుడు దసని నాశ్రయించి చుట్తు నున్న చిన్న చిన్న మొక్కలను దీసి వేయుట మంచిది. కాయలు పండిన పిదప అరటి చెట్లను నరికి వేసెదరు.
అరటి పండ్లు మిక్కిలి రుచియైనవి. ఇవి మామిడి పండ్లు పనస పండ్లు వలె కొన్ని ఋతువులందే కాక ఎల్లప్పుడును దొరకును. బొంత అరటి కాయలు కూరకే బాగుండును. అరటి గెల చివర నుండు పువ్వును కూడా కూర వండుకొను చున్నాము. కొందరు అరటి కాయలు బలుచగాముక్కలు కోసి ఎండ బెట్టి పొడి చేసి నిల్వ వుంచు కొనెదరు. ఈ పొడుమును కూడా బియ్యపు పిండి, జొన్నపిండి వలెనే వాడుదురు. అరటి స్తంభముల నేనుగులు తిన్నచో వానికి బలము గలుగును. దుంపలను ఆవులకు బెట్టితిమా అవెక్కువ పాలిచ్చును. స్తంభములందముగా నుండుట చే వివాహాది శుభ కార్యములందు బందిళ్ళకు వీనిని గట్టు చున్నారు.
అరటి చెట్ల యుపయోగము పండ్లను దినుట, ఆకులలో భుజించుటయే గాదు, వాని నుండి విలువైన నారయు దొరుకు చున్నది. నారకు గొండ ప్రదేశములందు బెరుగు చెట్లు శ్రేష్టము నారదీయుటకు చెట్లు పుష్పింప బోవు చుండగా నరికి వేసి, స్తంభములను దొప్పలుగా విడదీసి, మూడేసి అంగుళముల వెడల్పున నిలువున జీల్చెదరు. ఆ చీలికలను నొకనున్నని బల్లకును నొక కత్తికిని మధ్య బెట్టి లాగెదరు. అట్లు లాగుట వలన నా చీలికలలోని నీరు మెత్తని పదార్థమును పోయి నార మాత్రము మిగులును. దీనినే ఎండ బెట్టెదరు. ఈ నారతో చల కాలమునుండి పగ్గములు, కాతితములు చాపలు చేస్తున్నారు గాని ఈ మధ్య బట్టలు కూడా నేయు చున్నారు.లేత ఆకులు కాలి పుండ్లు పడిన చోట వేయుచో బాధ తగ్గును. అరటి వేరు, ప్రకాండమును రక్త సంబంధము లగు కొన్ని జబ్బులకు మంచివి. కచ్చూరము మొక్క ఒక బంగాళా దేశమునందే కాక చీనా మొదలాగు నేషియా ఖండమందలి ఇతర దేశములలో కూడా బెరుగు చున్నది. అది వేసవి కాలమందు పుష్పించును. దీని వేళ్లను ముక్కలుగా కోసి ఎండ బెట్టుదురు. ఇవియే గచ్చూరములు. వీనికి మంచి పరిమెళము గలదు. వీనిని పొడుము చేసి పచ్చాకుతో గలపి కొబ్బరి నూనెలో వేయుదురు. 3.పసుపు.
పసుపు మొక్కలను తరచుగా వంగ, కంద మొదలగు నితర పాఇఅరులతో గాని విడిగా గాని వేయుదురు. పొలములో నంతయు బసువునేవేసిన యెడల దిరిగి మూడేండ్ల వరకు నచ్చోట పసుపు వేయరు. వరియో రాగులో వండించుదురు. వర్షకాలము మందు దుంపముక్కలను నాటి చైత్ర మాస ప్రాంతముల దుంపలను ద్రవ్వెదరు. ఎకరమునకు పది మణుగులు వేసినచో రెండు వందల మణుగుల వరకు రావచ్చును. (త్రవ్విన పచ్చి దుంపలను నిలువ చేయుటలో మూడు నాలుగు విధములు గలవు. కొందరు పసుపు కొమ్మల నొక కుండలో వేసి మూత వేసి దానిపైన పేడ పూస పూసి, ఉడక బెట్టెదరు. అటు మీద వారము దినములు (రాత్రులందు మంచు దగుల నీయక కప్పుచు) ఎండలో బెట్టెదరు. కొందరు పేడ నీళ్ళలో ఈ దుంపలను వేసి కాచు చున్నారు. మరి కొందరు కాచకనే నీళ్ళలో నిమ్మకాయల రసము గలిపి పసుపు కొమ్ముల నానవేసి ఎండపెట్టుదురు. ఎండ బెట్టుటకు బదులు కొందరు తడి ఆరు వరకు పొయ్యిమీద బెట్టుదురు. చాయ పసుపునకు బిండి పసుపునకు బంట యొకటియే రెండు మూడు సార్లు నీళ్ళలో ఉడక బెట్టుట వలన అదే చాయ పసుపగు చున్నది. పసుపునకు చిరకాలము నుండి చాల గౌరవము గలదు. అది పుణ్యాంగనా చిహ్నము ప్రతి శుభ కార్యమునందును నిదియుండి తీరును. కొత్త బట్టను కట్టు కొనునప్పుడు కూడా వానికించుక పసుపు రాయుట మనలో ఆచారము. పసుపును స్త్రీలు తమ దేహములకు పూసి కొనెదరు. గడపలకు రాతురు. రంగుల్లో పసుపు యొక్కఉపయోగము తగ్గి పోయింది. అది స్థిరముగ నుండు రంగు కాదు. నిప్పుడంత కంటే చౌక రంగులను చేస్తున్నారు. ఔషధము లందు కూడా పసుపు వినియోగ పడుచున్నది. అది దేహమునకు వేడి కలుగ జేయును. చెన్న పట్టణం, బొంబాయి, కలకత్తా నుండి పసుపు జర్మినీ, ఇంగ్లాండు, అరేబియా, పెరిష్యా మొద్లగు ఇతర దేశములకు ఎగుమతి అవు చున్నది..
4.ఏలక చెట్లు
[మార్చు]ఇది కొండలమీదను అడవులలోను 5 మొదలు 8 అడుగుల ఎత్తు వరకును పెరుగును. అవి 500 మొదలు 50,000 అడుగులవరకు ఎత్తుగా నున్న ప్రదేశములందు గాని పెరుగ జాలవు. ఈ చెట్లలో రెండు రకములు గలవు. ఒక దాని ఆకులు సన్నముగా నుండును. వీనిక్రింది పైపునపట్టు వంటి రోమములు గలవు. రెండవ దాని ఆకులు వెడల్పుగా నుండును. రోమములు లేవు. దీని కాయలు పెద్దవి. సా రవంత మైన నేలయు, దాపున నొక కాలువయు జల్లని గాలియు ఈ మొక్కల కావస్యము.అడవులలో ఏలక చెట్లు పెరుగు చున్న చోట కలుపు దీసి చెత్త మొక్కలను దగుల పెట్టి నేల బాగు చేసెదరు. ఆ మొక్కల మీద నీడ ఎక్కువ గానున్న యెడల కొన్ని చెట్లలు గొట్టి వేయ వలెను. నీడ అంత ఎక్కువగా లేకున్నను వీని దాపుననున్న నొకటి రెండు చెట్లను కొట్టి వేయుట వాడుక అయి యున్నది. అట్లు వృక్షములను బడగొట్టుట వలన వేళ్ళు పైకి వచ్చి నేల అదురును. అందు చేత మొక్కలకు లాభము గలుగును. పెక్కు చిన్న మొక్కలు పెరుగుట కారంభించును. ఒక వేళ అట్లు మొక్కలు మొలవవని తోచిన యెడల లేత మొక్కలను దెచ్చి అచ్చట పాదుదురు. రెండు సంవత్సరములకు 10 ఆకులు వేసి ఒక అడుగెత్తు పెరుగును. అప్పుడు మొక్కలారడుగుల కంటే దగ్గరగా నున్నచో, వానిని దీసి మరల దూర దూరముగ పాతి పెట్టెదరు. మూడవ సంవత్సరమునకు నాలు గడుగుల ఎత్తు పెరుగును. ఇప్పటి నుండియు కాయలు కాయుట ఆరంభించును. తోటలలో పెంచు నపుడు గడ్డి మొక్కలు లేకుండా నేలను బాగు చేసి, దూర దూరముగా గోతులు దీసి గింజలను గాని, దుంపల ముక్కలుగాని పాతెదరు వీనిని లోతుగా పాత కూడదు. గింజల మీద మన్ను ఎక్కువగా బోయుచో అవి కుళ్ళి పోవును. విత్తనములు నాటిన యొక సంవత్సరమునకు నొక అడుగెత్తు మొక్కలు మొలచును. వాని నప్పుడు తీసి దూరముగ బాతి పెట్టెదరు.
కాయలెండి పోక మూపే కోసి వేయవలయును; లేని యెడల అవి బ్రద్ధలై గింజలు క్రింద రాలి పోవును. కాని, తరుచుగా నవి పచ్చగా గాక మునుపే కోసి యొక గోతిలో పాతుదురు. మరునాడుదయమున దీసి, చాపల మీద బోసి ఎండలో పెట్టుదరు. వర్షము మంచు మాత్రము తగుల కుండ వానిని జాగ రూకత బెట్టు చుండవలెను. ఎండ లేక వర్షములే కురియు చున్న యెడల వానిని పొయ్యి మీద బెట్టెదరు. కాయల యందలి నీరు ఇగిరి పోయిన పిదప చేతులతో రాసెదరు. ఆ రాపిడికి తొడిమలు, ముచ్చికలు రాలి పోవును. ఏలకులు సుగంధ ద్ర్వవ్యములలో ముఖ్యములైనవి. వాని సువాసనకై తాంబూలమునందును, కొన్ని పిండి వంటలందును వాడుదుము. వాని గింజల నుండి తైలమును దీసెదరు. ఏలకపొడి అనుపానములలో బనికి వచ్చుచున్నది.
5.అల్లము.
[మార్చు]అల్లము హిందూ దేశమునంతంటను సాగు చేస్తున్నారు. అది ఎర్ర మట్తి నేలలో ఏపుగా పెరుగును. వర్షాకాలమునందు బొలమును దున్ని చిన్న చిన్న గోతులు దీసి వానిలో పేడ వేసి అల్లము ముక్కలను నాటెదరు. నాటిన పిదప పొలమంతయు ఆకులతో కప్పుదురు. మొక్కలు పెద్దవి కాక పూర్వము వర్షములు విస్తారముగ గురుసి నీరు నిలిచెనా అల్లము మురిగి కుళ్ళి పోవును. కాన పొలములో నీరంతగా నిలువ కుండ చూచు చుండవలెను. 7, 8 నెలల నాటికె దుంపలు త్రవ్వుటకు వీలుగ నుండును.అల్లము నుండియే సొంఠిని చేతురు. అల్లము ముక్కలను నీళ్ళలో నానబెట్టి మట్తిని రాల్చివైచి ఒక అల్జిప్పతో పై చర్మమును కోసి వేసెదరు. దానిని మరల కడిగి మూడు నాలుగు దినములు ఎండలో పెట్టుదురు. మరిక మాటు దానిని చేతులతోడనే రాపాడించి రెండు గంటలు నీళ్ళలో నాననిచ్చి ఎండలో బెట్టుదురు. ఇంకను నెచ్చటనైనను సొంటిని చర్మమంటి పెట్టుకొని యున్నేడల ఒక గోని గుడ్డమీద పెట్టి రాచెదరు.అల్లము సుంటి మందులలో చాల ఉపయోగ పడు చున్నవి. వీనిలో నొకటైన బెక్కు అనుపానములందు గలియు చున్నది. వీని గుణమూ&లాయామందులను బట్టి యుండును. అల్లమును కూర్ కాయలందును బచ్చళ్ళయందును కూడా వాడు చున్నారు. దీని నుడి యొక విధమగు సారాయిని చేస్తున్నారు.మనదేశమునుండి అల్లము, సొంఠియు కూడా ఇతర దేసములకు ఎగుమతి అగు చున్నవి. మన దేశములో పండి ఎగుంతి అగు చుండినను మనకు చీనా, జపాను దేశముల నుండి కూడా అల్లము వచ్చు చున్నది. మనమెగుమతి చేయు అల్లము పంచ దారతో గలసియు, తేనెతోడ గలసియు, మనకు తిరిగి వచ్చు చున్నది.
6.పెద్దదుంప రాష్ట్రము
[మార్చు]పెద్దదుంప రాష్ట్రము. సన్న దుంప రాష్ట్రము కూడా ఔషధములలో పనికి వచ్చును. పెద్దదుంప రాష్ట్రము మనము కొంత చీనా దేశము నుండి కూడా వచ్చు చున్నది. వీని మొక్కల ఆకులనుండి వచ్చు నారతో కొన్నిచోట్ల కాగితములు చేస్తున్నారు. గంధ మూలిక 3, 3-1/2 అడుగు లెత్తు పెరుగును గాని ప్రకాండము భూమిలోపలనే యున్నది. దీని పువ్వులు పచ్చగా నుండును. ఎండిన వేళ్ళు ఔషధము లోనికి పనికి వచ్చును.
చంద్ర మూలికను కూడా ఔషధములలో వాడు చున్నారు. దీని వేరునకు సువాసస్న గలదు. దీని కీలాగ్రము గరాటి వలె నున్నది. కొండ పసుపు ఉల్లి గడ్డల వలె గడ్డలుగా నుండును.
కస్తూరి పసుపు పసుపు వలెనే యుండును గాని మంచి వాసన గలదు
అడవి యేలక కాయలు. ఏలక కాయలకు బదులుగా వీని నుపయోగించుట కలదు కాని ఇవి అంత రుచిగా నుండవు.
మూలాలు
[మార్చు]- ↑ Kress, W. J., Prince, L. M., Hahn, W. J., & Zimmer, E. A. (2001). Unraveling the evolutionary radiation of the families of the Zingiberales using morphological and molecular evidence. Systematic Biology, 50(6), 926-944. http://download.bioon.com.cn/view/upload/month_0904/20090404_900a6eeb398e881150a8ch7lGaprEVwR.attach.pdf
- ↑ Kress, W.J. & Specht, C.D. 2005. Between Cancer and Capricorn: Phylogeny, evolution and ecology of the primarily tropical Zingiberales. Biol. Skr. 55: 459-478. ISSN 0366-3612. ISBN 87-7304- 304-4. [Pp. 459-478, in Friis, I., y Balslev, H. (eds), Proceedings of a Symposium on Plant Diversity and Complexity Patterns - Local, Regional and Global Dimensions. Danish Academy of Sciences and Letters, Copenhagen.] http://spechtlab.berkeley.edu/sites/default/files/spechtlab/publications/12%20Kress%20and%20Specht%202005.pdf Archived 2017-12-30 at the Wayback Machine