అరణ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరణ్య
దర్శకత్వంప్రభు సాల్మన్
రచనప్రభు సాల్మన్
డైలాగ్స్వనమాలి (తెలుగు)
నిరంజన్ అయ్యంగర్‌ (హిందీ)
నిర్మాతఏరోస్‌ ఇంటర్నేషనల్‌
తారాగణం
  • రానా దగ్గుబాటి
  • విష్ణువిశాల్‌
  • పుల్‌కిత్ సామ్రాట్‌
  • జోయా హుస్సేన్‌
  • శ్రియా పిల్‌గావ్ంక‌ర్
ఛాయాగ్రహణంఏఆర్‌ అశోక్‌కుమార్‌
కూర్పుభువన్
సంగీతంశంతన్‌ మొయిత్రా
నిర్మాణ
సంస్థ
ఏరోస్‌ ఇంటర్నేషనల్‌
పంపిణీదార్లుఏరోస్‌ ఇంటర్నేషనల్‌
విడుదల తేదీ
2021 మార్చి 26 (2021-03-26) (తమిళం & తెలుగు)
సినిమా నిడివి
178 నిముషాలు
దేశం భారతదేశం
భాషలు
  • తమిళ్
  • తెలుగు
  • హిందీ

అరణ్య 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. రానా దగ్గుబాటి, విష్ణువిశాల్‌, పుల్‌కిత్ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్‌గావ్ంక‌ర్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ 2021 మార్చి 26 న విడుదలైంది.[1][2]

కథ[మార్చు]

నరేంద్ర భూపతి అలియాస్‌ అరణ్య (రానా దగ్గుబాటి) అడవి ప్రాణంగా బతికే మనిషి. తన తాత ముత్తాతలు తనకు రాసిచ్చిన అడవిని ప్రాణంగా చూసుకుంటాడు. అక్కడ ఏనుగులు చెట్లు చేమలతోనే తన జీవితం గడుపుతుంటాడు. అలాంటి సమయంలో అటవీ శాఖ మంత్రి రాజగోపాల కనకమేడల (అనంత్ మహదేవన్) అక్కడ ఒక భారీ టౌన్షిప్ ప్లాన్ చేస్తాడు. ఏనుగుల వెళ్ళే దారిలో ఒక భారీ గోడ నిర్మిస్తారు. అడ్డొచ్చిన అరణ్యను పిచ్చివాడు అంటూ జైలుకు పంపిస్తారు. అయితే అదే సమయంలో ఏనుగులు అక్కడికి వచ్చి దాడి చేస్తాయి. వాటిని అదుపులో పెట్టడానికి సింగా (విష్ణు విశాల్) వస్తాడు. అలాంటి సమయంలో అరణ్య జైలు నుంచి వచ్చి తన ఏనుగులు, అడవిని ఎలా కాపాడాడు అనేది సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

  • రానా దగ్గుబాటి - నరేంద్ర భూపతి అలియాస్‌ అరణ్య [4]
  • అనంత్ మహదేవన్ - రాజగోపాల కనకమేడల
  • శ్రీయా పింగోల్కర్‌ - జర్ణలిస్టు
  • విష్ణు విశాల్ - కుమ్కీ ఏనుగు శింగ‌న్న
  • జోయ హుస్సేన్ - న‌క్స‌లైట్ మ‌ల్లి

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: ప్రభు సాల్మన్
  • సంగీత దర్శకుడు: శాంతను మొయిత్ర
  • ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
  • సినిమాటోగ్రఫీ: అశోక్ కుమార్
  • నిర్మాణ సంస్థ: ఎరోస్ ఇంటర్నేషనల్
  • కూర్పు: భువన్
  • డైలాగ్స్: వనమాలి

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (24 March 2021). "Aranya Movie : బాహుబలికి మించి ఈ సినిమాకోసం కష్టపడ్డానన్న రానా.. షూటింగ్ కు వారం ముందునుంచే.. - rana daggubati about aranya movie". TV9 Telugu. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 Sakshi (26 March 2021). "'అరణ్య' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "‘అరణ్య’ మూవీ రివ్యూ" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. Eenadu (26 March 2021). "రివ్యూ: అరణ్య - rana daggubati aranya telugu movie review". www.eenadu.net. Archived from the original on 9 మే 2021. Retrieved 10 May 2021.
  4. Republic World, Republic (26 March 2021). "'Aranya' movie Review: Fans love Rana Daggubati's role, call the plot 'below average'" (in ఇంగ్లీష్). Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=అరణ్య&oldid=4076571" నుండి వెలికితీశారు