అరస్తు ఝా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరస్తు ఝా
అరస్తు ఝా చిత్రపటం, సుమారు 1810–1820
హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి
In office
1778–1795
అంతకు ముందు వారువికారుద్దౌలా
తరువాత వారురాజా షాన్ రాయ్ రాయన్
హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి
In office
1797–1804
అంతకు ముందు వారురాజా షాన్ రాయ్ రాయన్
తరువాత వారురాజా రాజేంద్ర

మొయినుద్దౌలా, ముషీరుల్ ముల్క్, ఆజీముల్ ఉమ్రా, అరస్తు ఝా, పర్షియన్ సంతతికి చెందిన వ్యక్తి, రెండవ నిజాం, నిజాం అలీఖాన్ పాలనాకాలంలో హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి (దీవాను)గా 1778 నుండి 1804లో మరణించేవరకు ఆ పదవిలో కొనసాగాడు.[1]

నిజాం రాజకుటుంబీకులు కాకుండా బయటి వ్యక్తులలో 'ఝా' బిరుదుతో సత్కరించబడిన ఏకైక వ్యక్తి, నవాబ్ అజీముల్ ఉమ్రా అరస్తు ఝా. ఈయన నిజాంకు అత్యంత నమ్మకస్తుడు. నిజాం అన్నిపనులు అరస్తు ఝాను సంప్రదించి, సలహాలు తీసుకునే చేసేవాడు.

మరాఠాల బందీగా

[మార్చు]

1795, మార్చి 11న జరిగిన ఖర్దా యుద్ధంలో, మరాఠాల పీష్వా రెండవ మాధవరావు చేతిలో నిజాం సైన్యాలు ఓడిపోయినప్పుడు, అరస్తు ఝా వారితో వినాశకరమైన సంధి కుదుర్చుకోవలసి వచ్చింది. ఈ సంధిలో భాగంగా, 15 లక్షల సాలీనా ఆదాయం వచ్చే దౌలతాబాదుతో సహా అనేక ప్రాంతాలపై నిజాం ఆధిపత్యం వదులుకోవలసి వచ్చింది. మరాఠాలు కోరిన 3 కోట్ల రూపాయల నష్టపరిహారానికి బదులుగా తనను తాను బందీగా సమర్పించుకోవలసి వచ్చింది.

దీవాను అరస్తు ఝా, మరాఠాల బందీగా పూణేలో ఉన్నాడు. ఈ ఒప్పందాన్ని మరాటీల చేత రద్దు చేయించడంలో సఫలీకృతుడై 1797 జూన్లో విడుదలయ్యాడు. అనుకోని పరిస్థితుల్లో అరస్తు ఝా, బందీగా మరాఠా దర్బారులో ఉండటం వళ్ళ నిజాంకు యోగ్యమైన ప్రధానమంత్రి సేవలకు దూరమయ్యాడు. ఈయన ఖైదునుండి తిరిగి వచ్చేవరకు, హైదరాబాదు రాజ్యంలో పరిస్థితులు జటిలంగా ఉన్నవి. ఆరస్తు ఝా జైలుకు వెళ్ళినప్పటి నుండి 1979 జూలైలో తిరిగివచ్చేవరకు రాజా షాన్ రాయ్ రాయన్, నిజాం అలీఖాన్‌కు దీవానుగా ఉన్నాడు.

మరాఠాల బందీగా పూణేలో ఉన్న కాలంలో మరాఠాలతో ప్రాబల్యం పెంచుకున్నాడు. రెండవ బాజీరావు పీష్వా పదవిని దక్కించుకునేందుకు ఇతోధిక సహాయం చేశాడు. మరాఠా దర్బారులో అరస్తు ఝా ప్రభావం ఎంతగా పెరిగిందంటే, పూణే నుండి విడుదలై, ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాడనికి వచ్చేలోపే ఖర్దా యుద్ధంలో నిజాం కోల్పోయిన ప్రాంతాలను తిరిగి నిజాం ఇచ్చేందుకు మరాఠాలను ఒప్పించాడు. అంతేకాక బీదాపై చౌత్ పన్ను హక్కుల విరమణ, దౌలతాబాదు కోటనుండి సేనలు ఉపసహంరించుకునేట్టు, అలాగే యుద్ధనష్టాలపై దావాలన్నీ విరమించుకునేట్టు చేయగలిగాడు.

హైదరాబాదు తిరిగివచ్చి, దీవానుగా మళ్లీ బాధ్యతలు చేపట్టగానే, ప్రజా పత్రాలన్నింటిపైనా యువరాజు సికందర్ జా సంతకాలు చేసేట్లు నిజాంను ఒప్పించాడు.

స్మృతి

[మార్చు]

హైదరాబాదులోని ముషీరాబాదు ప్రాంతానికి ఈయన పేరుమీదుగానే పేరువచ్చింది.[2][3] సాంస్కృతిక వారసత్వమైన ఈయన సమాధి శిధిలావస్థలో ఉన్నది.[4]

1797లో సఫ్దర్ అలీఖాన్ రెండవ భాస్కరుని సిద్ధాంత శిరోమణిని సంస్కృతం నుండి పర్షియన్ భాషలోకి,జిజ్-ఏ సరుమణి అనే పేరుతో అనువదించి,[5] అరస్తు ఝాకు అంకితమిచ్చాడు. ఈ అనువాదం ఇప్పుడు అందుబాటులో లేదు. కానీ దీని గురించి అలీఖాన్ మరో రచన "జిజ్-ఏ సఫ్దరీ"లో ఉటంకించబడింది.[6]

మూలాలు

[మార్చు]
  1. New Delhi National Archives of India
  2. Ramchandram, D. (June 30, 1998). "A History behind Street Names of Hyderabad & Secunderabad". KnowAP. Archived from the original on 19 June 2018. Retrieved July 20, 2018.
  3. Nanisetti, Serish (2017-08-19). "There lies a forgotten story". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-07-20.
  4. "Over 20 historic maqbaras lose their land to grabbers". The Times of India. Retrieved 2018-07-20.
  5. K. Ramasubramanian (2019). "The Last Combinatorial Problem in Bhāskara's Līlāvatī". Gaṇitānanda. Springer. p. 291. doi:10.1007/978-981-13-1229-8_30. ISBN 9789811312298. S2CID 211676355.
  6. S. M. Razaullah Ansari (2019). "Persian translations of Bhāskara's Sanskrit texts and their impact in the following centuries". In K. Ramasubramanian; Takao Hayashi; Clemency Montelle (eds.). Bhāskara-prabhā: Sources and Studies in the History of Mathematics and Physical Sciences. Sources and Studies in the History of Mathematics and Physical Sciences. Springer. p. 386. doi:10.1007/978-981-13-6034-3_18. ISBN 9789811360343. S2CID 166240155.
"https://te.wikipedia.org/w/index.php?title=అరస్తు_ఝా&oldid=4311682" నుండి వెలికితీశారు