అరాజకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరాజకం (ఆంగ్లం: Anarchy) పరిపాలనా వ్యవస్థను ధిక్కరించే సంఘాలు, సమూహాలు, వక్తులు. మొదట అనార్కీ అనగా నాయకలేమి అనే అర్థం కలిగి ఉండేది కానీ 1840 పియరె జోసెఫ్ ప్రౌధన్ What is Property? అనే పుస్తకంలో అరాజకం అనగా స్వచ్ఛంద సంఘాలు నాయకుడు లేకుండా పరిపాలనను సాగించెడి తత్వం అని తెలిపాడు.

ఆచరణాత్మక కోణంలో చూస్తే అరాజకం అనేది సాంప్రదాయిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే. ఒక దేశం లో కేంద్రీకృత నియమం, వ్యవస్థ లేకపోతే ఆ దేశాన్ని అరాజకంగా పరిగణించవచ్చును. అరాజక తత్త్వాన్ని నమ్మేవాళ్ళు ప్రభుత్వాల స్థానే స్వచ్చంద సంస్థలను పరిపాలన చేపట్టవలసిందిగా సూచిస్తారు.

వ్యుత్పత్తి[మార్చు]

పురాతన గ్రీకు పదం ἀναρχία (anarchia) నుండి ఈ పదం పుట్టినది. అన్ అనగా లేనిది. ఆర్కియా అనగా పరిపాలన/అధికారం.

"https://te.wikipedia.org/w/index.php?title=అరాజకం&oldid=2953477" నుండి వెలికితీశారు