Jump to content

అరిందమ్ సేన్‌గుప్తా

వికీపీడియా నుండి
అరిందమ్ సేన్‌గుప్తా

అరిందమ్ సేన్‌గుప్తా ప్రముఖ పాత్రికేయుడు. ఆయన ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ కాలేజీలో ఎం.ఎ పూర్తి చేసినతరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధించాడు. తరువాత జర్నలిజంలో చేరాడు. ఆయన అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, తదితర వివిధ రంగాలపై ఆయన వ్యాసాలు రాశారు. 1982 నుండి 1984 వరకు ప్రోబ్ పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన ద పేట్రియట్, సండే అబ్జర్వర్ లో చేరారు.ఈ పత్రికలో ఆయన తొలిసారిగా బిజినెస్ వార్తలకు ప్రత్యేక పేజీని కూడా కేటాయించారు.[1] 'ద సండే అబ్జర్వర్' అనంతరం 1988లో టైమ్స్ లో చేరి కొంతకాలం పనిచేశాక, తిరిగి సండే అబ్జర్వర్ లో చేరారు. 1991 లో ఎకనామిక్ టైమ్స్ లో, తదుపరి 2008 లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు.వివిధ హోదాలలో పనిచేసి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి చేరారు.[2]

మరణం

[మార్చు]

అరిందమ్ సేన్‌గుప్తా కేన్సర్ తో జనవరి 28 2016 న కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు.[3][4]

ఇతర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "TOI managing editor Arindam Sen Gupta no more". The Times of India. 28 January 2016. Retrieved 28 January 2016.
  2. టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అరిందమ్ సేన్ గుప్తా కన్నుమూత[permanent dead link]
  3. ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్‌గుప్తా మృతి
  4. Noted journalist Arindam Sengupta is dead

ఇతర లింకులు

[మార్చు]