అర్చన గిరీష్ కామత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్చన గిరీష్ కామత్
వ్యక్తిగత సమాచారం
జననం (2000-06-17) 2000 జూన్ 17 (వయసు 23)
విర్రల్, ఇంగ్లండ్
క్రీడ
దేశంభారతదేశం
క్రీడటేబుల్ టెన్నిస్
సాధించినవి, పతకాలు
జాతీయ ఫైనళ్ళు2013లో జరిగిన సబ్ జూనియర్స్ ఇండియన్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం

2018లో జరిగిన జూనియర్స్ ఇండియన్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం

2018లో జరిగిన ఇండియన్ నేషనల్ సీనియర్ విమెన్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం.

అర్చన గిరీష్ కామత్ (2000 జూన్ 17) భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. 2018లో జరిగిన మహిళల సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలిచింది.[1]అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ జట్టులో ఆమె సభ్యురాలు. 2019లో కటక్‌లో జరిగిన కామన్ వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో జ్ఞానశేఖరన్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు.[2]

వ్యక్తిగత జీవితం, నేపథ్యం[మార్చు]

అర్చన గిరీష్ కామత్ (2000 జూన్ 17) భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. 2018లో జరిగిన మహిళల సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలిచింది

9 ఏళ్ల ప్రాయంలోనే అర్చన కామత్ టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. ఆ తల్లిదండ్రులిద్దరూ బెంగళూరులో కంటి వైద్య నిపుణులు. తల్లిదండ్రులు గిరీష్, అనురాధ ఇద్దరూ ఆమెకు సంగీతం, నాట్యం వంటి కళల ఆసక్తి పెంచాలని ప్రయత్నించారు. కానీ ఆమె చూపు మాత్రం టేబుల్ టెన్నిస్‌పై ఉండేది. క్రీడల పట్ల ఆమెలోని దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించిన ఆమె సోదరుడు టేబుల్ టెన్నిస్‌ పట్ల మరింత శ్రద్ధ కనబరిచేలా ప్రోత్సహించాడు. దాంతో ఆమె సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తూ, శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఆపై 2013లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో విజయం సాధించింది.[1]

2018లో దుర్గాపూర్‌లో జరిగిన జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌ను అర్చన కైవసం చేసుకున్నారు.[3]ఆపై ఒక్కసారిగా దూకుడు పెంచిన ఆమె 2019లో జరిగిన మహిళల జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో విజయం సాధించారు. క్రీడల్ని వృత్తిగా ఎంచుకోవడంలో తన తల్లిదండ్రుల ప్రోత్సహం ఎంతగానో ఉందంటారు అర్చన. కంటి వైద్య నిపుణులుగా పని చేస్తున్న ఆమె తల్లి అనురాధ కామత్ తన ఉద్యోగాన్ని సైతం విడిచి పెట్టి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు తన కుమార్తెకు సాయంగా నిలిచారు.[1]

తన సీనియర్లయిన ఆచంట శరత్, జి.సాథియాన్ మన్నననలు పొందిన అర్చన భారతీయ టేబుల్ టెన్నిస్ జట్టులో అత్యంత నమ్మదగ్గ క్రీడాకారిణిగా పేరుగాంచారు.

అర్చన ఆట తీరు దూకుడుగా ఉంటుంది. “టేబుల్ చుట్టు ఆమె చిరుతపులి వేగంతో కదలడం ఆమెలో ఉన్న ప్రత్యేకత. ఇదే ఆట తీరును కొనసాగిస్తే భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధిస్తారు” ఇది అర్చన గురించి భారతీయ టేబుల్ టెన్నిస్ కోచ్ బొన్న థామస్ అభిప్రాయం.[4]

వృత్తి పరమైన విజయాలు:[మార్చు]

2013లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌లో సాధించిన విజయంతో చిన్న వయసులోనే తన టేబుల్ టెన్నిస్ కెరియర్‌ను ఘనంగా ఆరంభించారు అర్చన. తన విజయ పరంపరను కొనసాగిస్తూ 2018లో జరిగిన జాతీయ జూనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌ను కూడా సాధించారు. ఏడాది తర్వాత 2019లో జరిగిన మహిళల జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో కూడా విజయం సాధించారు. దాంతో ఆమె భారత జట్టులో చోటు సంపాదించి అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం వచ్చింది. సీనియర్ స్థాయిలో మరింత దూకుడైన ఆట తీరును ప్రదర్శించేవారు అర్చన. ఇప్పుడు ఆట స్థాయి పెరిగిందని ఇందులో రాణించాలంటే ఆటగాళ్లు మరింత ఫిట్‌గా ఉంటూ తమలోని అత్యుత్తమ ప్రతిభను కనబర్చాల్సి ఉంటుందని ఆమె అంటారు. గాయాల పాలు కాకుండా చూసుకుంటూనే తన ఆట తీరును మరింత మెరగుపరచుకునేందుకు క్రమశిక్షణతో కూడిన కఠోరమైన శిక్షణను ఆమె ప్రారంభించారు.[5]

2018లో బ్యూనస్‌లో జరిగిన యూత్ ఒలంపిక్స్‌కు ఎంపిక కావడం ఆమె జీవితంలో సాధించిన అతి పెద్ద విజయాల్లో ఒకటి. సెమీ ఫైనల్స్ వరకు చేరుకున్న అర్చన ఆ పోటీల్లో నాల్గో స్థానంలో నిలిచారు.[1]

మిక్సడ్ డబుల్స్ విభాగంలో అర్చన, జి. సాథియాన్‌ల జోడీ అత్యంత బలంగా కనిపిస్తుంది. 2019లో కటక్‌లో జరిగిన కామన్ వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో మిక్సడ్ డబుల్స్ విభాగంలో ఇద్దరూ కలిసి స్వర్ణ పతకం సాధించారు.[2]

భారతీయ మహిళా టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో అర్చన 4వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం తన ర్యాంకును మరింత మెరగుపరచుకునే పనిలో ఉన్నారు. 2024లో జరగనున్న ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ప్రస్తుతం ఆమె కల.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "అర్చన కామత్: భారత టెబుల్ టెన్నిస్‌లో అరుదైన క్రీడాకారిణి - BBC ISWOTY". BBC News తెలుగు. Retrieved 2021-02-18.
  2. 2.0 2.1 "Sathiyan Gnanasekaran and Archana Girish Kamath add to Indian success". International Table Tennis Federation (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-07-22. Retrieved 2021-02-18.
  3. Staff, Scroll. "Junior Table Tennis Championships: Archana Kamath, Manav Thakkar bag titles". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  4. "Archana Kamath". DH Changemakers (in ఇంగ్లీష్). 2018-12-28. Retrieved 2021-02-18.
  5. "Archana Kamath brings offence to the table". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-09. Retrieved 2021-02-18.