అర్జల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముస్లిములలో అట్టడుగు వర్గం.[1] వీళ్ళు సఫాయీ పాకీ పనులు చేసుకుని ఊళ్ళకు దూరంగా నివసించేవారు.[2] ఆంధ్రప్రదేశ్ లోని మహాతర్ లు, మోచీ లను ఈ వర్గంవారిగా వర్ణిస్తారు. గ్రామీణ ప్ర్రాంతాలలో వీరిని మస్జిద్ లోపలికి రానిచ్చేవారు కాదట.[3] అరేబియా ధర్మశాస్త్రం ముస్లింలను మూడు వర్గాలుగా విభజించింది అవి: అష్రఫ్ (ఉన్నత వర్గం), అజ్లఫ్ (చేతి వృత్తుల వారు), అర్జల్ (దళితులు). వారిలో అర్జల్ లు ధోబీ, హలత్కార్, ధునితా వర్గాలకు చెందిన ముస్లిం తరగతికి చెందిన అంటరానివారిగా పరిగణించబడ్డారు.[4]

సపాయీ పనివారి పై కవితలు

[మార్చు]

సోంబేరి ముఖాలు ఇంకా మొకమన్నా
కడుక్కోక ముందే
వాళ్ళు నగరం మొకం కడుగుతుంటారు...

ఎందరో తల్లులు బిడ్డలకీ మూతిగడిగి ముక్కుచీది,
లాలపోసి ,పొగడ్రా పూసి, దిష్టిసుక్క పెట్టి దీవించినట్టూ...

నగరంలో రోడ్లన్నిటిని బిడ్డలుగా లాలిస్తూ
దుమ్మూ దూళీ తుడిచీ
అందంగా దిద్దుతుంటారు...
మాయమ్మ మా చెల్లికి పాపిట తీసి జడేసినట్టూ
యీ సపాయమ్మలు పట్నంపిల్లకి చిక్కుదీసి కొప్పుబెడుతుంటారు..

బలిసిన దేహాలు నోరుపుక్కిలించకుండానే..
వాళ్ళు అన్ని టీనీళ్లు గొంతులో పోసుకుని పయనమవుతారు..

కాంట్రాక్టర్ల కావరపుకూతలు బెదిరింపులతో
వులుకులికీ పడుతూ ప్లాస్టిక్ కాగితాల సప్పుళ్ళై
ఫుట్పాత్ల యంబడి చెత్త పోగులై కూలబడుతూ అలిసిపోతున్న ఆ జీవితాలకు..
కంటినిండా నిద్రా
కడుపునిండా కూడూ కరువైన తనాన్ని
వట్టిపోయిన కట్టెలోంచి కనిపించే నరనరం న్యాయంగా చూపెటుతోందీ....

పొగులంతా ఆడి ఆడీ...
ఆదమర్శి నిద్రపూడుస్తున్న పిలకాయల్ని
పొద్దునే భుజం తట్టి నిద్రలేపినట్టు..
పొద్దంతా రకరకాల వాహనలై తిరిగీ తిరిగీ
అలిసిపోయిన సిటీ బిడ్డని
ఆ తల్లులు చేతులు సుతారంగా తడిమి
నిద్రలేపడం నగరంలో దినాం మామూలే కదా!

మా సిన్నప్పుడూ
మా ఊరి మడేలన్న మాసిపోయిన ఊరిగుడ్డల్ని ఉజ్జోగం జేసీనట్టూ...
ఈ సపాయితల్లులు
నగరాన్ని సుబ్బరంగా ఉతికి నేలపై నాజూగ్గా అరేస్తారు...

వాళ్ళు ఊడ్చే ఏ యీదీ వాళ్ళదికాదు
కడిగే ఏ కక్కుసు కాల్వలో వాళ్ళ వొంటికీ పారదు..

కాలాన్ని టీవీ సీరియళ్లముందు కారుస్తూ..
సాయంత్రాల్ని డీమార్ట్లవెలుగుల్లోనూ
స్టార్ హోటళ్ల విందుల్లోనూ
వెలకట్టి అమ్ముకునే కార్పొరేట్ తల్లులు
ఖరీదైనకోకలు ముడతపడకుండా
కంపుకబుర్లతో వాకింగ్లు చేస్తూ...
వాళ్ళను చూసి మురికి వాసనంటూ
ముక్కుమూసుకునే మురికిగుండెకాయలకోసరం..

ఈ నల్లతల్లులు
ఎన్ని దుమ్ముపట్టిన దేహాలతో తుమ్ములవుతారు
ఎన్ని తూర్లు దగ్గీ దగ్గీ మగ్గిపోతున్న పేగులవుతారు..

దినమంతా చీపురకట్టలై కదిలే
ఆచేతులకు ఎన్ని సలాములూ చేయాలి?
ఎండంతా నెత్తిమీద కొంగై తిరిగే వాళ్లకు
చెత్తబుట్టలుమోసే ఆ వీపులకు చేతులెత్తి
ఎన్ని దండాలు పెట్టాలి?

నగరాలనిండా పరిశుద్ధ పొద్దులవుతున్న
ఆ పాకీ తల్లుల పాదాలుతాకీ
ప్రాణం పోసుకునే ఏ నేలైనా
వాళ్ళ నట్టింట బతుకుదీపాలారిపోకుండా
అంత నూనెపోయాడమే
ఇకపై నేనుపాడే దేశభక్తి గేయం...!
ఎవరమైనా పాడాల్సిన జాతీయగీతం...!!”
-- పల్లిపట్టు9/5/2018.

మూలాలు

[మార్చు]
  1. "The Telegraph - Calcutta : Frontpage". www.telegraphindia.com. Retrieved 2018-05-21.
  2. "Dalit / Trivals | Indian Dalit Muslims' Voice | Page 11". dalitmuslims.wordpress.com. Retrieved 2018-05-21.
  3. "Know your Muslim Neighbour". bhaskarmaitro1.blogspot.in. Retrieved 2018-05-21.[permanent dead link]
  4. "Google Groups". groups.google.com. Retrieved 2018-05-21.
"https://te.wikipedia.org/w/index.php?title=అర్జల్&oldid=3899006" నుండి వెలికితీశారు