Jump to content

అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతము

వికీపీడియా నుండి

ఆమ్లం, క్షారం లక్షణములు తెలుసుటకు స్వాంటె అర్హీనియస్ (Svante Arrhenius) అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీనిని అర్హీనియస్ సిద్ధాంతము (Arrhenius equation) అంటారు.

సిద్ధాంతము

[మార్చు]
అర్హీనియస్

అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో H+ అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. OH- అయాన్లను యిచ్చెవి క్షారాలు. ఈ సిద్ధాంతం ప్రకారం HCl ఆమ్లము. అది నీటిలో కరిగినపుడు H+, Cl-అయాన్లుగా విడిపోతుంది. ఈ సిద్ధాంతంప్రకారం NaOH క్షారం అది నీటిలో కరిగినపుడు Na+, OH- అయాన్లుగా విడిపోతుంది. నీటిలో H+ OH- అయాన్లు సమానంగా ఉంటాయి. అందువలన అది తటస్థ ద్రావణం.

అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం- లోపములు

[మార్చు]

ఈ సిద్ధాంతం నీటిలో కరిగిన పదార్థాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర ద్రావణాలైన బెంజీను వంటి కర్బన ద్రావణాలలో కరిగిన వాటిగూర్చి వివరించదు. HCl నీటిలో అయాన్లనిస్తుంది. కాని బెంజీన్ లో యివ్వదు. యిసుక (సిలికాన్ డయాక్సైడ్) లో H+అయాన్లు లేనప్పటికీ అది ఆమ్ల స్వభావములు కలిగి ఉంటుంది., అది నీటిలో కరుగదు. కార్బన్ డయాక్సైడ్ లో H+అయాన్లు లెనప్పటికీ అది ఆమ్ల స్వభావము కలిగి ఉండును. కాల్షియం కార్బొనేట్ నీటిలో కరగక పోయినప్పటికీ అది క్షార స్వభావాన్ని కలిగి ఉండును. కాల్షియం ఆక్సైడ్ లో OH-అయాన్లు లేనప్పటికీ అది క్షార స్వభావాన్ని కలిగి ఉండును.