Jump to content

అలంకారికులు

వికీపీడియా నుండి

ప్రాచీనులు, నర్వాచీనులని ఆలంకారికులిరులని ఇరు తెగలు. మొదటివారు గుణాలంకారమునకు ప్రాధానమిచ్చిరి. రెండవవారు వ్యంగమునకు ప్రాధాన్యమిచ్చిరి. కావుననే ప్రాచీనులగ్రంధములు- "కావ్యాలంకార: కావ్యాలంకారసంగ్రహ:" అని అలంకారపదఘటిత నామములు చెందియున్నవి. ఇరుతెగలవారిలో-కావ్యమునకు ఆత్మ విషయమున అభిప్రాయ భేదములు ఉన్నాయి. రస ప్రధానవాదులు కొందరు, అలంకార ప్రధానవాదులు మరికొందరు. గుణ ప్రధనవాదులు ఇంకొందరు, వ్యంగ్య ప్రధానవాదులు వేరొకందురు.

రసాత్మత్వవాదులు- రసాత్మత్వ సిద్ధాంతము తొలుత భరత మహర్షి నిరూపించాడు. రసరూపాత్మకమే కావ్యమని అభిప్రాయపడ్డాడు. గుణదోషాదులు లీతని మతమందున అప్రధానమయినవి, రసము ప్రధానము. ఈమతమునే, శృంగారతిలకము, రుద్రటుని కావ్యాలంకారము, రజశేఖరుని కావ్యమీమాంస, భోజుని సరస్వతీ కంథాభరణము పోషించినవి. కాన వీరందరూ "రసాత్మత్వవాదులు".

అలంకారతత్మవాదులు- వీరియందు అగ్రగణ్యుడు భామహుడు. చమత్కారమగు వాక్యమే 'వక్రోక్తీ అనియు, చమత్కారమున్నప్పుడే అలంకారతత్వము సిద్ధించునుననియు, అది ప్రధానముగా గలదియే కావ్యమనియు నీతని అభిప్రాయము. భామహుడు - "శబ్దార్ధౌ సహితౌ కావ్యం యుక్తం వక్రస్వభావోక్త్యా" అని కావ్య లక్షణమును నిర్వచించెను. వక్రోక్తి కారుడగు కుంతకుడు సయితము భామహు ననుకరించి యధాసాంఖ్యము మున్నగువారిని అలంకారత్వము శూన్యమని వచించె. " వక్రోక్తి: కావ్య జీవితం" అని ఈతని నిర్వచము.

గుణాత్మత్వవాదులు- కావ్యమునకు గుణములు ప్రధానమని వీరి అభిప్రాయము. అనగా అవి సాక్ష్యాత్తుగ ఉపస్కరములు కావనియు, "విశిష్టా పద రచనా రీతి:, విశేషోగుణాత్మా" అని చెప్పినటులు వైదర్భి మున్నగు రీతులద్వారమున కావ్యోపస్కరములనియు జెప్పవలయును. దండి, వామనులు ముఖ్యులు. ఓచిత్యయుక్తమగు వక్రోక్తిని కాంతి రూపముగు గునముగ అంగీపరింప వలయు, తద్విశిష్టమగు రీతియే కావ్యమునకు ఆత్మ అని దండి భామహుడితో భేదించాడు., నీతడు సమధిగుణమును కావ్యసోభాసర్వస్వమని పేర్కొనినాడు. ఈతని మతమునే వామనుడు బాగా వివరించాడు. "రీతి రాత్మా కావ్యస్య, విశిష్టాపదరచనా రీతి:, విశేషో గుణాత్మా" అని వామనుడు గుణయోగమనంగీకరించాడు.

వ్యంగ్య ప్రధానవాదులు- చాలావరకు అర్వాచీనులీతెగకే చేరిరి. "కావ్యస్యాత్మా ధ్వనిరీతి బుధై ర్య: సమామ్నాతపూర్వ:" అని ఆనందవర్ధనుడు. "శబ్దార్ధౌ మూర్తి రౌఖ్యాతౌ, జీవితం వ్యంగ్య వైభవం" అని వైద్యనాధుడు. ఇటులు పెక్కు మంది పూర్వమతముననుసరించి వ్యగ్యమునకే ప్రాధాన్య మిచ్చిరి. ఆత్మ ధ్వని, ధ్వనియే తద్వ్యవహార ప్రయోజకములు. గుణములు ఆత్మనిష్టములు. శబ్దార్ధముల జంట శరీరము. తన్నిష్ఠములు అలంకారములు. తుదివారి వాదమే అత్యంత రమణీయమని లాక్షణికులు కొందరి అభిప్రాయపడిరి. కవుననే కాళిదాస కవిసార్వభౌముని కవిత హృద్యముయినది.