అల్గారిథం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గణితశాస్త్రం మరియూ కంప్యూటరు రంగాలలో అల్గారిథం ఒక సమస్యను పరిష్కారించటానికి చేయవలసిన పనుల జాబితాను చాలా స్పష్టంగా తెలుపుతుంది. అల్గారిథం సమస్యనుస్థితుల ఆధారంగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తుంది; ఒక ప్రారంభ స్థితి నుండి మొదలై, ఆ తరువాత వచ్చే స్థితులను స్పష్టంగా తెలుపుతూ ఒక అంత్యస్థితిలో అంతమవుతుంది. కొన్ని అల్గరిథాలలో ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారడం ప్రతీసారీ ఒకేలాగా జరుగుతూ ఉంటాయి, వీటిని డిటర్మినిస్టిక్ (deterministic) అల్గారిథంలని పిలుస్తారు. ఇంకొన్నిటిలలో సందర్భాన్ని బట్టి ఒకదాని తరువాత ఒకటి వచ్చే స్థితుల గతి మారుతూ ఉంటుంది, ఇలాంటి వాటిని ప్రాబబిలిస్టిక్ (probablistic) అల్గారిథంలని పిలుస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=అల్గారిథం&oldid=1467057" నుండి వెలికితీశారు