అల్లం వీరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లం వీరయ్య
జననంగాజులపల్లి గ్రామం,మంథని మండలం, కరీంనగర్ జిల్లా
వృత్తిసాహితీకారుడు
మతంహిందూ


అల్లం వీరయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ సాహిత్యకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అల్లం సోదరుల్లో రెండోవాడు వీరయ్య. తాను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా, తనకిష్టమైన సాహిత్యాన్ని మాత్రం వదుల్లేదు. తన చుట్టూ జరిగిన జరుగుతున్న ఘటనలకు ఎప్పటికప్పుడు పాట రూపమిచ్చి ప్రజలను చైతన్యులను చేశారు. సుమారు 120 వరకు పాటలు రచించారు. అల్లం వీరయ్య పాటలు అనే సంకలనాన్ని మా భూమి నిర్మాత బీ నర్సింగరావు ప్రచురించారు. విప్లవోద్యమాలకు నెలవైన తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం భుక్తి కోసం.. పేద ప్రజల విముక్తి కోసం పిడికిళ్లు బిగించిన సందర్భాన్ని పురస్కరించుకొని అల్లం వీరయ్య కలం నుంచి జాలు వారిన ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో.. అనే పాట ఇప్పటికీ ప్రతినిత్యం ఎక్కడో ఓచోట వినిపిస్తూనే ఉంటుంది. ఈయన పాటల రచయితయే కాకుండా వాసన, ధీరుడు, రెండు మరణాలు, కుందేలు తాబేలు లాంటి 12 కథలను సైతం రాశారు.