Jump to content

అల్లసాని వాని అల్లిక జిగిబిగి (జాతీయం)

వికీపీడియా నుండి
Portrait of Allasani Peddanna

అల్లసాని వాని అల్లిక జిగిబిగి తెలుగు సాహిత్యలోకంలో సుప్రసిద్ధి పొందిన జాతీయం/వాడుక. ఇది సాహిత్యంలో "అల్లసాని వాని అల్లిక జిగిబిగి"గా పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి. అతని కవిత్వంలో అన్నీసందర్భానికి తగిన పదాలే ఉంటాయి. మహాకవులు పదాలను అంత పొదుపుగా ప్రయోగిస్తారు. అల్లిక జిగిబిగి అంటే ఇదే.[1]

తన కవిత్వ లక్షణాలను తానే నిర్ణయించుకుంటూ అల్లసాని పెద్దన తన అల్లిక జిగిబిగియని సూచించేందుకు ఈ వాక్యం రచించారు.

వాడుక

[మార్చు]

సాహిత్యరంగంలో ప్రక్రియ, వస్తువుల పరంగా వైతాళికులైన పలువురు కవులు తమ కవిత్వ లక్షణ నిరూపణ చేస్తూ తామే కవిత్వం చెప్పడం జరిగింది. సాహిత్యవిమర్శకులు, పాఠకులు ఆయా లక్షణాలను ప్రస్తావించినప్పుడు అవే వాక్యాలు ఉదహరిస్తూంటారు. ఆ క్రమంలోనే అల్లసాని వాని అల్లిక జిగిబిగి వాడుకలోకి వచ్చింది.

ప్రాచుర్యం

[మార్చు]

సాహిత్యవిమర్శల్లో పలుమార్లు ప్రస్తావనలు జరగడమే కాకుండా విశ్వనాథ సత్యనారాయణ అల్లసాని పెద్దన సాహిత్యాన్ని గురించి వ్రాసిన విమర్శన గ్రంథానికి ఈ జాతీయాన్నే శీర్షికగా ఉంచారు.

మూలాలు

[మార్చు]
  1. gotelugu.com. "Naaku Nachhina Padyam | Gotelugu". gotelugu.com. Retrieved 2020-08-25.