అల్లెం
అల్లెం అనేది హిందూ వివాహ వ్యవస్థలో ఒక ఆచారంగా కొన్ని ప్రాంతాలలో ఉంది. కుమార్తెకు వివాహం చేసిన తరువాత అల్లుణ్ణి ఆరు నెలలు తమ యింటిలో ఉంచడాన్ని "అల్లెం పెట్టడం" అంటారు. ఆరుమాసాలు బాగా పౌష్టికాహారాన్నిచ్చి బలంగా తయారుచేస్తే కూతురి కడుపున ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని వారి నమ్మకం.[1]
ఆచార విశేషాలు
[మార్చు]పాతకాలంలో అన్నిప్రాంతాల్లో చాలా చిన్న వయసులో పెళ్ళి చేసేవారు.కొందరు అమ్మాయి యుక్తవయస్కురాలు కాకముందే చేస్తే కొందరు ఆ తర్వాత 3,4 ఏళ్లకే..... సరే పెళ్లయ్యాక ఎన్నేళ్లకో అమ్మాయిలు కాపురాలకు వచ్చేవారు...ఈలోగా అమ్మాయిని అత్తారింటికి పంపేముందు అల్లుడిని "అల్లెం"కు పిలిచేవారు. ఈ అల్లెం పెట్టడం కొన్ని నెలలపాటు సాగేది.
అల్లెం పెట్టే పద్దతి
[మార్చు]- ఈ అల్లెం సమయంలో రోజూ అల్లుడు గారికి రకరకాల ఆహారపదార్థాలు (శాకాహార, మాంసాహార పదార్థాలు) చేసి పెడతారు.ఇక పిండివంటలు చెప్పాల్సిన పనేలేదు. నేతి అత్తరాసులు (అరిసెలు, లడ్డు, కజ్జికాయలు..అంతేనా మళ్లీ వీటిని నెయ్యిలో కలుపుకుని తినాలి.
- ఇక అల్లుడు గారు నీడపట్టున తింటూ కాలక్షేపం చెయ్యడం, మరీ విసుగనిపిస్తే అలా పొలాలవెంట షికార్లు తిరిగిరావటం.....
- ఈ అల్లెం పెళ్ళి కొడుకుల వంటిమీద ఈగ వాలితే ఆ శరీరం నునుపుకు అది జారిపోవాలిట.....
- మరీ ఇంతలా తినిపించినప్పుడు స్థూలకాయులు అవుతారనుకోకండి....
- గ్రామీణ క్రీడలకు సంబంధించిన రాతిగుండును ఎత్తటం కూడా చెయ్యాలి...
- అందుకే ఈ రాతిగుండ్లకు "అల్లెం గుండు" అనే పేరు వచ్చింది..... (ఆ గుండును భుజమ్మీదకు ఎత్తుకుని వీపు మీదుగా కిందకు జారవిడవాలి)
- పట్టణీకరణ, పనుల వత్తిడి, యాంత్రికజీవన విధానలు, గ్రామాల సాంస్కృతిక విధ్వంసం.....ఏదైతేనేం ఈ ఆచారం మాయమైనా "అల్లెం పెళ్లికొడుకు" అనే మాట మాత్రం అక్కడక్కడా వినిపిస్తుంది.....
అర్ధం
[మార్చు]ఈ అల్లెం, అల్లెము అన్న పదానికి మూలం "అల్లిరము" అన్న పదం. పెళ్ళి అయిన తోడనే యల్లునిఁ బిలిచి యత్తవారింటఁబెట్టెడు విందు, మనుగుడుపు, అల్లిరము అన్న పదానికి అర్ధం విందు అని.
అల్లెం పద ప్రాచీనత
[మార్చు]ఈ పదం కొన్ని వందల ఏళ్లనాటిది...... పదకవితాపితామహుడు అన్నమయ్య ఈ సంకీర్తనలో ఆ దేవదేవుడిని అల్లీరము/అల్లెం తిందువు రమ్మని పిలుస్తున్న గేయాన్ని చూడండి
విచ్చేయవయ్యా వేంకటాచలము పొంత
కచ్చుగా నేమున్నచోటి కచ్యుత నారాయణా॥
అల్లనాడు లంక సాధించందరు మెచ్చగ
మల్లడి నయోధ్యకు మరలినట్లు
యెల్లగా గైలాసయాత్ర కేగి కమ్మరి మరలి
వెల్లివిరి ద్వారకకు విచ్చేసినట్లు॥
యెన్నికెతో గోమంతమెక్కి జయము చేకొని
మన్ననతో మధురకు మరలినట్లు
అన్నిచోట్లానుండి అల్లిరము లారగించ
వెన్నుడవై వేడుకతో విచ్చేసినట్లు॥
వహికెక్క ద్రిపురాలవనితల బోధించి
మహి నిందిరవొద్దికి మరలినట్లు
విహగగమన శ్రీవేంకటేశ మమ్ము గావ
విహితమై నామతిలో విచ్చేసినట్లు॥