అవగాహనా రాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అవగాహనా రాహిత్యం అనేది ఒక మానసిక పరిస్థితి. వస్తువులు, విషయాలు, గమనించదగ్గ అంశాలను పోల్చుకోలేకపోవడం, అర్ధం చేసుకోలేకపోవడం, అనుభవించలేకపోవడం ఈ పరిస్థితిలో కనిపించే అవస్థలు. మరొకరి సహాయం లేకుండా నేరుగా విషయాలను అర్ధం చేసుకోలేకపోవడం ఈ పరిస్థితిలో సాధారణం. స్థూలంగా చెప్పాలంటే, ఒక విషయమై తెలియకపోవటమే అవగాహనా రాహిత్యము. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఒక మనిషి లేదా జంతువు ద్వారా ఒక పరిస్థితి లేదా క్రియను అర్ధం చేసుకోలేకపోవడం లేదా అనుభవించలేకపోవడం అవగాహనా రాహిత్యం గా చెప్పబడుతుంది.

భావన

[మార్చు]

అవగాహన అనేది సాపేక్షమైన భావన. ఒక జంతువు పాక్షికంగా అవగాహన కలిగి ఉండవచ్చు, సుషుప్తావస్థలో ఉండి ఉండవచ్చు, లేదా పూర్తి అవగాహనా రాహిత్యంలో ఉండవచ్చు. అంతఃకరణంలో జరిగే విషయాల వలనో, బాహ్య ఇంద్రియాలకు కలిగే అనుభూతి వలనో అవగాహన కలుగవచ్చు. అవగాహనా రాహిత్య పరిస్థితిలో ఈ అనుభూతి ఆ జంతువు పొందలేదు.