Jump to content

అవినీతి సూచీ - 2023

వికీపీడియా నుండి

ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ( గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ) 'అవినీతి సూచీ - 2023' ని ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. ఈ సూచీలో మొత్తం 180 దేశాల్లో భారతదేశం 93వ స్థానంలో నిలిచి[1]. 2022 సంవత్సరంలో 40 పాయింట్లు సాధించిన భారతదేశం, 2023లో 39 పాయింట్లు కే పరిమితమైంది[2]. 2022 సంవత్సరంలో భారతదేశం 85వ స్థానంలో ఉన్నది[3]. ప్రపంచవ్యాప్తంగా అవినీతిరహిత దేశంగా డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిస్తే, ఫిన్లాండ్ రెండో స్థానంలో నిలిచింది[4]. అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా చివరి స్థానంలో మిగిలింది[5]. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపార వేత్తల అభిప్రాయాలు తీసుకొని సున్నా నుంచి 100 మధ్య పాయింట్లను కేటాయిస్తారు. సున్నా అయితే అవినీతి ఎక్కువ అని, 100 అయితే అవినీతి రహితమని పేర్కొంటారు.

మూలాలు :

  1. Bharat, E. T. V. (2024-01-30). "అవినీతిలో భారత్​ 93వ స్థానం- ఆ దేశమే టాప్​". ETV Bharat News. Retrieved 2024-04-13. {{cite web}}: zero width space character in |title= at position 16 (help)
  2. "Global Corruption Index 2023: ప్రపంచ అవినీతి సూచీలో 93వ స్థానంలో భారత్‌". Sakshi Education. Retrieved 2024-04-13.
  3. telugu, NT News (2024-01-30). "Global Corruption | ప్రపంచ అవినీతి సూచీలో ఇంకా దిగజారిన భారత్‌.. ర్యాంక్‌ ఎంతంటే..!". www.ntnews.com. Retrieved 2024-04-13.
  4. PTI (2024-01-30). "India ranks 93 out of 180 countries in corruption perceptions index 2023". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-04-13.
  5. "India ranks 93 out of 180 countries in corruption perceptions index 2023". The Economic Times. 2024-01-30. ISSN 0013-0389. Retrieved 2024-04-13.