అవెంజర్స్: ఎండ్ గేమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Avengers: Endgame
దస్త్రం:Avengers Endgame poster.jpg
Theatrical release poster
దర్శకత్వం
  • Anthony Russo
  • Joe Russo
నిర్మాతKevin Feige
స్క్రీన్ ప్లే
  • Christopher Markus
  • Stephen McFeely
ఆధారంThe Avengers 
by Stan Lee
నటులు
సంగీతంAlan Silvestri
ఛాయాగ్రహణంTrent Opaloch
కూర్పు
నిర్మాణ సంస్థ
పంపిణీదారుWalt Disney Studios
Motion Pictures
విడుదల
ఏప్రిల్ 22, 2019 (2019-04-22)(Los Angeles Convention Center)
ఏప్రిల్ 26, 2019 (United States)
నిడివి
181 minutes[1]
దేశంUnited States[2]
భాషEnglish
ఖర్చు$356 million[3]
బాక్సాఫీసు₹350 CRORES[4]

అవెంజర్స్: ఎండ్ గేమ్ అనేది మార్వెల్ కామిక్స్ లోని ఒక సూపర్ హీరో బృందమైన ది ఎవెంజర్స్ ను ఆధారంగా తీసుకుని రూపొందించిన అమెరికన్ సూపర్హీరో చిత్రం. దీనిని మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఇది 2012లోని ఎవెంజర్స్, 2015లోని ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మరియు 2018లోని ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, మరియు మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్ (ఎం.సి.యు.) లోని 21 చలనచిత్రాలకు సీక్వల్. సినిమా యొక్క దర్శకత్వాన్ని ఆంథోనీ మరియు జో రష్యా చేయగా, కథను క్రిస్టోఫర్ మార్కస్ మరియు స్టీఫెన్ మెక్.ఫీలి రచించారు. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, మార్క్ రఫ్ఫలో, క్రిస్ హెంస్వర్త్, స్కార్లెట్ జోహన్సన్, జెరెమీ రేన్నెర్, డాన్ చీడ్లే, పాల్ రుడ్, బ్రీ లార్సన్, కరెన్ గిల్లాన్, డానా గురిరా, బ్రాడ్లీ కూపర్ మరియు జోష్ బ్రోలిన్ నటించారు. ఈ చిత్రంలో, ఎవెంజర్స్ మరియు వారి మిత్రపక్షాలు ఇన్ఫినిటీ యుధ్ధంలో థానోస్ వలన చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడానికి కష్టపడతారు.

ఈ చిత్రాన్ని అక్టోబరు 2014 లో ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ - పార్ట్ 2 గా ప్రకటించారు. ఏప్రిల్ 2015 లో ఈ చిత్ర దర్శకత్వాన్ని వహించటానికి రస్సో బ్రదర్స్ వచ్చారు, మరియు మే నెలలో మార్కస్ మరియు మెక్ఫెయిలీ ఈ చిత్రానికి సంతకం చేసారు. జూలై 2016 లో, మార్వెల్ ఈ చిత్రం యొక్క పేరును తొలగించి, ఇంకా పేరులేని ఎవెంజర్స్ చిత్రంఅని సూచించారు. చిత్రీకరణ ఆగష్టు 2017 లో పైన్వుడ్ అట్లాంటా స్టూడియోలో ప్రారంభమైంది, దీనిని ఇన్ఫినిటీ వార్ తో కలిపి చిత్రీకరించారు.అదనపు చిత్రీకరణ మెట్రోమరియు డౌన్టౌన్ అట్లాంటామరియు న్యూయార్క్ లో జరిగింది. అధికారికంగా ఈ చిత్రానికి డిసెంబరు 2018 లో నామకరణం చేశారు.

ఎవెంజర్స్: ఎండ్ గేమ్విస్తృతంగా ఊహించబడింది సినిమా, మరియు డిస్నీ విస్తృతమైన మార్కెటింగ్ ప్రచారాలతో ఈ చిత్రాన్ని సమర్ధించింది. ఇది మొదటిసారి ఏప్రిల్ 22, 2019 న లాస్ ఏంజిల్స్లో ప్రదర్శించబడింది, మరియు ఏప్రిల్ 26, 2019 న అమెరికాలోని ఐమ్యాక్స్ మరియు 3డీ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం దర్శకత్వం, నటన, వినోద విలువ మరియు భావోద్వేగాలకు మంచి ప్రసంశలు అందుకుంది, విమర్శకులు ఈ 22-చిత్రాల కథ ముగిసిన విధానాన్ని పొగిడారు. కేవలం మూడు రోజుల్లోనేఇది అనేక బాక్స్ ఆఫీసు రికార్డులనుకూడా అధిగమించడమే కాక ప్రపంచవ్యాప్తంగా $ 1.2 బిలియన్లను వసూలు చేసింది, ఇది 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పేరు గాంచింది, ప్రపంచవ్యాప్తంగా 18 వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అయ్యింది.

  1. "Avengers: Endgame (12A)". British Board of Film Classification. April 12, 2019. Retrieved April 12, 2019.
  2. Newman, Kim (April 25, 2019). "Avengers: Endgame review: the finale these heroes deserve". British Film Institute. https://www.bfi.org.uk/news-opinion/sight-sound-magazine/reviews-recommendations/avengers-endgame-marvel-universe-heroes-finale. Retrieved April 28, 2019. 
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; DeadlineProfitAnalysis అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "Avengers: Endgame (2019)". Box Office Mojo. Retrieved April 28, 2019.