అశ్విని ఎక్బోటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్విని ఎక్బోటే
జననం
అశ్విని కట్కర్

1972 మార్చి 22
మరణం2016 అక్టోబరు 22(2016-10-22) (వయసు 44)
వృత్తినటి, నృత్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు2000–2016
జీవిత భాగస్వామిప్రమోద్ ఎక్బోటే
పిల్లలుశుభంకర్

అశ్విని ఎక్బోటే (1972, మార్చి 22 - 2016, అక్టోబరు 22) మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి. మరాఠీ నాటకరంగం ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టింది.[1][2]

జననం[మార్చు]

అశ్విని ఎక్బోటే 1972, మార్చి 22న మహారాష్ట్రలోని సోలాపూర్ లో జన్మించింది. అశ్విని సోదరుడు కూడా రంగస్థల, సినిమా నటుడు.[3]

నటనారంగం[మార్చు]

అశ్విని ఎక్బోటే అనేక మరాఠీ నాటకాలలో, ప్రాంతీయ భాషా సీరియల్స్‌లో నటించింది. అశ్విని మహిళా సాధికారత, పర్యావరణ సమస్యలలో చురుకుగా పాల్గొన్నది. నృత్య శిక్షణా తరగతిని నడపడంతోపాటు ఉచితంగా ప్రదర్శనలు నిర్వహించింది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

పూణే ఫైర్ బ్రిగేడ్‌లో సీనియర్ రేడియో టెక్నీషియన్ అయిన ప్రమోద్ ఎక్బోటేతో అశ్విని వివాహం జరిగింది. వారికి శుభంకర్ అనే కుమారుడు ఉన్నాడు. శుభంకర్ ఎక్బోటే మంత్ర అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు.

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

 • మహాసత్తా
 • డెబూ
 • వేకేషన్
 • డంక్యావర్ డంకా
 • తప్తపది
 • మాఝా నావ్ శివాజీ
 • భో భో
 • ఎఫ్యూ: ఫ్రెండ్షిప్ అనలిమిటెడ్
 • కాఫీ ఆణి బరంచ కహీ
 • రేడియో నైట్స్ 6. 06
 • మహాగురు
 • బావరే ప్రేమ హే (2017)
 • ఆరంభ్
 • క్షణ్ హా మోహచా (2008)
 • భుల్వా (2007).
 • ఏక్ పల్ ప్యార్ కా (హిందీ)
 • సంత్ జనాబాయి[5]

మరాఠీ నాటకాలు[మార్చు]

 • తిఘాంచి గోష్ట్
 • ఏక క్షణాత్
 • నంది

టెలివిజన్[మార్చు]

 • దుహేరి
 • దుర్వా
 • రాధా హీ బావరీ
 • తూ భేట్శీ నవ్యానే
 • అహిల్యాబాయి హోల్కర్
 • అరుంధతీ
 • ఉంచ్ మఝా ఝోకా
 • అసంభవ
 • మన్ ఉధాన్ వర్యాచే
 • తుజ్విన్ సఖ్యా రే
 • ఫు బాయి ఫు

మరణం[మార్చు]

అశ్విని ఎక్బోటే 2016 అక్టోబరు 22న పూణేలోని భారత నాట్య మందిర్‌లో జరిగిన ఒక నాట్య ప్రదర్శన సందర్భంగా వేదికపై కుప్పకూలి మరణించింది.[6][7]

మూలాలు[మార్చు]

 1. "Marathi classical dancer Ashwini Ekbote passes away during performance on stage | Bollywood News". India TV. Retrieved 2022-12-18.
 2. "actress Ashwini Ekbote passed away | नाट्य-सिने अभिनेत्री अश्विनी एकबोटे यांचे निधन". Maharashtra Times. Retrieved 2022-12-18.
 3. "Ashwini Ekbote's brilliant performance which ended in her death as her parents, friends watched". The Indian Express. Retrieved 2022-12-18.
 4. "Ashwini Ekbote : Biography, wiki, age, height, serials, husband, family". justmarathi.com. Retrieved 2022-12-18.
 5. "Sant Janabai - Sumeet Music". youtube.com. Retrieved 2022-12-18.
 6. "Actress dies of cardiac arrest on stage in Pune | Mumbai News". Times of India. Retrieved 2022-12-18.
 7. "Marathi Actress Ashwini Ekbote dies on stage!". Archived from the original on 17 April 2018. Retrieved 2022-12-18.