Jump to content

అష్టభాషలు

వికీపీడియా నుండి
సా.శ. 3-4 శతాబ్దానికి చెందిన సూర్యప్రజ్ఞాప్తిసూత్ర, జైన ప్రాకృత భాషలో వ్రాయబడింది

తెలుగు కవులు ప్రాకృత భాషలలో పాండిత్యము సంపాదించిన వెనుక, అష్టభాషలనునవి ప్రచారములోనికి వచ్చినవి. నన్నయ కాలమునగాని, తిక్కన కాలమునగాని ఉభయభాలనియేకాని, అష్టభాషలను వ్యవహాలము లేదు. సా.శ.14వ శతాబ్దము ప్రారంభమునుండి అష్టభాషా వ్యవహారము వచ్చింది. ఇదియే చారిత్రకముగా సమంజసముగా నున్నది. ఏలయనగా ఉభయభాషలనగా సంస్కృతము, తెలుగు అనునవి రెండు. వీనితో గూడ, ప్రాకృత్ర భాషాభేదము లాంటివి చేర్చి అష్టభాష లని లాక్షణికుల మతము. అప్పకవి వాటిని ఈ క్రింది విధంగా విభజించాడు:

  1. సంస్కృతము
  2. ప్రాకృతము
  3. శౌరసేని
  4. మాగది
  5. పైశాచిక
  6. చూళిక
  7. అపభ్రంశము
  8. ఆంధ్రము

ప్రాచీనకవులలో భాస్కర రామాయణము రచయితలలో ఒకరు భాస్కర కవిపుత్రుడును అగు మల్లికార్జున భట్ట గద్యలో "శ్రీమ దష్టభాషా కవిమిత్ర కుల పవిత్ర భాస్కర సత్కవిపుత్ర మల్లికార్జున భట్ట ప్రణీతంబైన" అని వ్రాసియున్నాడు. అట్లే వెన్నెలకంటి అన్నయను తన షోడశ కుమార చరిత్రమున "అష్టభాషల మధు రాశు విస్తర చిత్ర కవితం " అని వ్రాసియున్నాడు.

సా.శ. 1656 సం.న అప్పకవి పైవిభాగము చెప్పియున్నను అంతకుముందీ ప్రాకృత భాషాభేధములలో భేదమున్నట్లు తెలియుచున్నది. సా.శ.1537లో తాళ్ళపాక అన్నమయ్య మనుమడు చినతిరుమలాచార్యుడు అష్టభాషా దండకము అనునొక దండకము ఎనిమిది భాషలలో రచించి యున్నాడు. అందున్న భాషలు:

  1. సంస్కృతము
  2. ప్రాకృతము
  3. శౌరసేని
  4. మాగది
  5. పైశాచిక
  6. ప్రాచీ
  7. అవంతీ
  8. సార్వదేశీ భాష-లేక నాగరభాష

దక్షిణాంధ్ర వాజ్మయమున వెలసిన సాహిత్యములో ప్రాకృతభాషా ప్రసక్తి యున్నది. సా.శ.1614-1633 వరకు తంజావూరిని పాలించిన రఘునాధనాయకుని కాలమున-అష్టభాషలలో సమస్యాపురాణము జరిగినట్లు యజ్ఞనారాయణ దీక్షితుడు సాహిత్యరత్నాకరము 11వర్గ 34వశ్లోకములో చెప్పియున్నాడు.ఆయన ఇచ్చిన అష్టభాషలు అప్పకవి ఇచ్చినవాటితో సరిపోవుచున్నవి. రఘునాధనాయకుని కాలమున మధురవాణి ప్రాకృతభాషా కవయిత్రి అని తెలియుచున్నది.

అప్పకవి ఇచ్చిన పలు అష్టభాషా ఉదాహరణములు

[మార్చు]
ప్రాకృతము
సంస్కృతము ప్రాకృతము తెలుగు
చక్రవాకః చక్రవాయో జక్కన
ఉపాధ్యాయః ఒజ్జావో ఒజ్జ
ద్వీప దివొ దివి
బ్రహ్మ బమ్హ బొమ్మ
కాంస్యమ్ కంసో కంచు
యశః యసో అసము
శౌరసేనీ
సంస్కృతము శౌరసేనీ తెలుగు
యజ్ఞోపవీతమ్ జన్నిదామ్ జన్నిదము
ప్రతిజ్ఞాతమ్ పదిన్నదమ్ పన్నిదము
హింతాల హిందాళో ఈదు
హరిదాళః హరిదళో అరిదళము
ధాతు దాదు జాదు
మాగదీ
సంస్కృతము మాగదీ తెలుగు
నేదిష్టమ్ నేదిష్టమ్ నేస్తము
కష్టమ్ కష్టమ్ కస్తి
పైశాచి
సంస్కృతము పైశాచి తెలుగు
అలక్తః అలత్తొ లత్తుక
శష్కులి శకులి చక్కిలము
ఊర్ణ ఉన్న ఉన్ని
త్రిలంగః తిలింగొ తెలుగు, తెనుగు, తెలుంగు
స్వర్ణమ్ సన్నమ్ సొన్న
నిశ్రేణి నిసేన నిచ్చెన
చూళిక
సంస్కృతము చూళిక తెలుగు
బృంద పుండొ పిండు
బుద్ద పుద్దొ పెద్ద
స్వర్ణమ్ పానో పొన్ను
మృగః మెకొ మెకము
స్వర్ణమ్ సన్నమ్ సొన్న
నిశ్రేణి నిసేన నిచ్చెన
అపభ్రంశము
సంస్కృతము అపభ్రంశము తెలుగు
బ్రాహ్మణ బాహ్మడు బాపడు
అపద్దమ్ అబడ్డన్ బడ్డు
స్తనమ్ తను చన్ను
శ్రుతమ్ సూడు చదువు

పైభాషలు వ్యవహారమునున్న ప్రదేశములు

[మార్చు]
  • ప్రాకృతము-మహారాష్ట్రదేశము
  • శారసేని-శురసేన -మధురా ప్రాంతము
  • మాగది- మగధ-బీహారు ప్రాంతము
  • పైశాచి- పాండ్యకేకయ
  • చూళిక- గాంధార, నేపాల, కుంతల
  • అపభ్రంశము- ఆభీరదేశము

పైశాచిభాష పైదేశములందే కాక బాహ్లిక, సహ్య, సుదేష్ణ, భోట, హైవ, కన్నోజ దేశములందు వయాప్తిచెందినది. (అప్పకవీయము).

మూలము

[మార్చు]