Jump to content

ఆంగ్ల రాజ్యాంగం

వికీపీడియా నుండి
(ఆంగ్ల రాజ్యాంగము నుండి దారిమార్పు చెందింది)

ఆంగ్లేయుల రాజ్యతంత్రాన్ని గురించి ప్రముఖ రచయిత, చారిత్రికుడు దిగవల్లి వేంకటశివరావు రాసిన గ్రంథమిది.

రచన నేపథ్యం

[మార్చు]

భారత జాతీయోద్యమానికి మద్దతుగా రచనలు చేసిన భారతీయ రచయితలు పలువురు కవితలు, పద్యరచనలు, ఉద్యమగేయాలు వంటి కాల్పనిక రచనలు చేయగా ఉద్యమకారులకు స్ఫూర్తిని, అవగాహనను కలిగించేలా సరియైన విధంగా భారత చరిత్ర, ఇతర దేశాల రాజ్యాంగాలు వంటి కాల్పనికేతర సాహిత్యం రచించిన అరుదైన రచయితల్లో దిగవల్లి వేంకటశివరావు ఒకరు. బ్రిటీష్ పాలనాకాలంలో జాతీయోద్యమంలో పనిచేసే రాజనీతివేత్తలు, వక్తలు, ప్రజలు మొదలైన వారికి మరింత అవగాహన అందించేందుకు బ్రిటీష్ రాజ్యతంత్రాన్ని అందించారు రచయిత. ఈ గ్రంథాన్ని ఆయన 1933లో రచన చేశారు.

రచయిత

[మార్చు]
Digavalli Venkata Siva Rao.jpg
దిగవల్లి వేంకటశివరావు

ప్రధాన వ్యాసం: దిగవల్లి వేంకటశివరావు
దిగవల్లి వేంకటశివరావు చరిత్ర, రాజనీతిశాస్త్రాలలో గొప్ప కృషిచేసిన రచయిత. ఆయన వృత్తిపరంగా న్యాయవాది అయినా చారిత్రికాంశాలు, వాటి పరిశోధనపై చాలా ఆసక్తి కలిగివుండేవారు. 96 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని 60 చారిత్రిక గ్రంథాల రచనలో ఫలవంతం చేసుకున్నారు.

విషయాలు

[మార్చు]

ఆంగ్లేయుల రాజ్యాంగానికి సంబంధించిన చరిత్ర, నేపథ్యం, విశేషాలు వంటివాటి సమాహారంగా ఈ గ్రంథాన్ని రచించారు. మేగ్నకార్టాగా ప్రపంచప్రసిద్ధి చెందిన స్వేచ్ఛాస్వాతంత్రాల ప్రకటన నుంచి మొదలుకొని గత శతాబ్దిలో చోటుచేసుకున్న మార్పుల వరకూ వివరించారు. ఇవన్నీ భారత జాతీయోద్యమకారులకు, ప్రజలకు తెలిసి, వాటీని అనువుగా మలచుకునేందుకు వీలుగా వివరించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]